డైలీ సీరియల్

పచ్చబొట్టు-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య తనను ఇష్టపడటమా? ఏ డాక్టరునో, ఇంజనీరో కావాలనుకుంటుంది అనుకున్నాడు. నిన్న అలా ఆమెతో మాట్లాడకపోతే మరీ విస్తుపోయేవాడు. ఏది ఏమైనా తను అదృష్టవంతుడు. అందరాని చందమామ దోసిట్లో వాలుతోంది. ఒక్కసారి విద్యతో మాట్లాడాలి. మనసు తహతహలాడుతోంది. తనను ఎన్నుకోవటంలోనే విద్య నిరాడంబరత తెలుస్తోంది.
అనే్వష్ మాత్రం తక్కువవాడా? స్టేటస్ గురించి ఆలోచించకుండా టాక్సీ నడుపుకొనే తనకు విద్యను అందించటమా? విద్యను జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. అదే అనే్వష్ ఋణం తీర్చుకొనే తరుణోపాయం.
టాక్సీ ఆఘమేఘాల మీద ఆసుపత్రిని చేరింది. ఒక్క ఉదుటన దిగి లోపలికి వెళ్లాడు. నర్స్ ఎదురు వచ్చింది. విద్య గురించి అడిగాడు.
‘‘ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారు. గంట దాకా బయటికి రారు’’ అని చావు కబురు చల్లగా అందించింది.
అప్పటిదాకా ఎగిసిపడుతున్న అల తీరం చేరినట్లయింది. ఉవ్వెత్తున ఎగిసిన కెరటం కరిగిపోయినట్లయింది. అయినా నిరాశ చెందలేదు. ముందుసారి ఇక్కడకు వచ్చినపుడు విద్యకోసం వెయిట్ చేసిన చెట్టు నీడన చేరాడు.
జీవితం ఎంత విచిత్రం? ఒక పరిచయం లేని వ్యక్తి ఆనాడు. మరి ఈనాడు ఆమె తన అర్థాంగి, భాగస్వామి, కలలరాణి. రేపు తమ పిల్లలకు తల్లి. ఇంకా.. ఇంకా.. మనవళ్ళు.. మునిమనవళ్ళు.. సాగే నదిలా తమ జీవిత ప్రయాణం.
తీపి తీపి కలలు కంటూ గంటను నిముషంలా గడిపేసాడు.
నర్సు వచ్చి పిలిచేంతవరకూ అతను ఈ లోకంలో లేడు.
విద్య విజిటర్స్ రూమ్‌లో ఉంది. వినీల్ రాగానే లోపలికి తీసుకెళ్లింది.
‘‘ఏంటి వినీల్? ఇప్పుడొచ్చారు?’’ అంది క్యాజువల్‌గా.
‘‘నిజంగా తెలియదా విద్యా?’’
నిజంగానే అనే్వష్ వినీల్ దగ్గరకు వెళతానని చెప్పలేదు.
ఇంతలో సెల్ రింగయింది.
‘హలో’ అంది.
‘‘నేను అనే్వష్‌ని. కంగ్రాచ్యులేషన్స్‌రా! వినీల్ ఒప్పుకున్నాడు. మధ్యలో ఫ్రెండ్ తగిలి వదలకపోవడంతో ఆలస్యమయింది. ఓ.కె మరి ఉంటా’’ అని పెట్టేసాడు.
అప్పుడు సిగ్గు సహజ సిద్ధంగా ఆమె బుగ్గలపై లాస్యమాడింది.
‘‘అనే్వషా?’’ అని అడిగాడు వినీల్.
‘‘ఊ!’’ అంది విద్య.
‘‘్థంక్యూ విద్య! థ్యాంక్యూ.. నీ ఋణం జన్మ జన్మలకి మిగల్చుకుంటాను. మళ్లీ జన్మలలో కూడా నువ్వే నాదానివి కావాలి’’ అన్నాడు ఆమె చేతులను పట్టుకొని ఊపేస్తూ.
‘‘నేను కూడా’’ అంది విద్య.
ఆ రెండు మాటలు చాలు ఆ రెండు మనసుల స్వచ్ఛతను తెలపటానికి.
వారి మధ్య మాటలు కన్నా కళ్ళ ఊసలే ఎక్కువయ్యాయి.
***
పెరట్లో రావిచెట్టు, వేపచెట్టు కలిసి ఉండేవి. కొందరు అలా ఉంటే మంచిదని వచ్చి పూజలు చేసుకొనేవాళ్ళు. తమ ఈ ఇంట ప్రవేశించటానికి ముందే ఉన్నాయి. అమ్మా, నాన్న చనిపోటంతో మామయ్య ఇంట చేరాను. మామయ్య పెద్దమనుసతో కోడల్ని చేసుకున్నాడు తన కొడుకు ఇచ్చి వివాహంచేసి. దానితో ఆ ఇంట్లో బంధం మరింత బలపడింది. తన జీవితానికిక ఢోకా లేదనుకుంది. ఆప్యాయంగా చూసుకొనే అత్త, ప్రాణం పెట్టే భర్త, అనురాగాన్ని పెంచిన మామయ్య, ప్రేగు తెంచుకుపుట్టిన కన్నపిల్లలు.. ఇక ఈ జీవితానికి తక్కువేమిటి అనుకొంది. కానీ ఆ మాట ఎన్నో సంవత్సరాలు నిలవలేదు. పెద్ద వయస్సులో అత్తయ్య, మామయ్య తన దారి చూసుకుంటే, జీవితాంతం నీ చేయి వదలనని మంత్రాల సాక్షిగా చేతిని పట్టుకున్న భర్త హార్ట్ ఎటాక్ పేరుతో సముద్రం.. నడిమధ్యలో చెయ్యి వదిలేసి పరారయ్యాడు. అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. పిల్లను పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. కొడుకు చేతికందివచ్చాడు. ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకొంది. ఆ ఆశకి ఆదిలోనే హంసపాదులా పెళ్లికి ముందు ‘‘అత్తయ్యా! అత్తయ్యా!’’ అంటూ ఎన్నో కబుర్లు చెప్పిన కోడలు మొదటిరోజు నుంచే సాధించటం ప్రారంభించింది. ఈ జీవికి చచ్చేదాకా కష్టాలు రాసిపెట్టినట్లున్నాడు భగవంతుడు. మంచివాళ్ళకు రోజులు కావు. కొడుకు బాధపడతాడని అతని ముందు వౌనం వహిస్తుంది. కోడలి గొంతుకు భయపడి నోరు విప్పదు. చెబితే అర్థం చేసుకొనేవారికి చెప్పచ్చుకానీ, అర్థమరుూ్య అర్థంకానట్లు నటించేవారికి ఏం చెప్పగలం?
ఊరూరా వెలుస్తున్న వృద్ధాశ్రమాలు కొందరి పాలిట వరాలేమో! కానీ నా పాలిట శాపమే. భర్త పోయిన దగ్గిరనుంచీ కళ్ళలో వత్తులు వేసుకొని పెంచిన కొడుకును వదిలి నా అనే వాళ్ళు లేని అనాధలా ఆశ్రమాల చెంత చేరటం ఊహించటానికే కష్టంగా ఉంది.
ఇన్నాళ్ళూ తోడూ నీడగా ఉన్న ఆ మహావృక్షాలే వీళ్ళ స్వార్థానికి బలి అయిపోయి నేల కూలాయి. నేలంతా చదును చేసి ఇపుడే వెళ్లారు పనివాళ్ళు. ఆ స్థలంలో బజ్జీలతనికి కొట్టు పెట్టుకోమని చెప్పారట. వాడు అద్దె క్రింద వెయ్యి రూపాయలు ఇస్తాడట. నిజంగా నా దగ్గిర డబ్బు ఉంటే వాళ్ళకు ఆ వెయ్యి నెల నెలా ఇచ్చి ఆ చెట్లను కాపాడేదాన్ని. ఇన్నాళ్ళూ ఎంత సేద తీర్చాయి. వాటికి ఏమిచ్చినా రుణం తీరదు. ఎన్ని ఫ్యానులు తిరిగినా ఆ గాలి వస్తుందా? డబ్బేనా ముఖ్యం? పరిసరాల అందం ఇప్పటివాళ్ళకు అక్కర్లేదా? ఏమీ అర్థం కాదు. మా కాలం ఊహలు వేరు. తింటానికి తిండి, ఉండటానికి చిన్న ఇల్లు ఉంటే చాలు అనుకొనేవాళ్ళం. ఇప్పటివాళ్ళకు అలా కాదు. టీవీలు, ఫ్రిజ్‌లు, ఓవెన్‌లు, దివాన్‌లు, అందమైన ఇల్లు, పంపు తిప్పకుండా చెయ్యి పెడితే వచ్చే సింకులు, ఏసి రూములు. ఆశలకు అంతులేదు. దానికోసం డబ్బు సంపాదించాలనే తాపత్రయం. దీనికి అంతు ఉంటుందా? ఉండదు. కోరిక వెంట కోరిక పుడుతూనే ఉంది. ఒకటి తీరితే మరొకటి వెంబడి పడుతుంది. ఇక ఆ జీవితాలకు ప్రశాంతత ఏముంటుంది?
ఇంకా ఈ భూమిమీద ఉండి తను ఏం సాధించాలి? తీసుకుపోకూడదు. నేస్తాల్లాంటి ఆ చెట్లు పోయినా, ఆ దృశ్యాన్ని చూసినా ఇంకా ఈ ప్రాణం నిలబడే ఉందే! వాటితోపాటూ తనూ పోతే ఒక శని వదిలిందని సంతోషపడేవారు కదా! ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలను భరించాలో!
తన పని తను చేసుకోగలిగినా బాగుండేది. వృద్ధాప్యం నడ్డి వంచితే, ఆరోగ్యం తనను మరీ ముసలిదాన్ని చేస్తోంది. చేసిపెడితేనే వంద వంకలు వెతికే కోడలు, ఇక చేయించుకుంటే ఊరుకుంటుందా? కొడుకు దగ్గిర రోజూ పాడే పాటే పాడుతోంది. వద్దన్నా ఈ చెవులకి అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. చెముడు వచ్చినా బాగుండేది. చాలామందికి ఈ వయసులో దాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఉపయోగం కోసమేనేమో! అదృష్టవంతులకే ముసలితనంలో చెముడు వస్తుందన్నమాట. మనస్తత్వ శాస్తవ్రేత్తలా కారణాలు వెతుక్కుంటోంది.
‘‘ఎన్నాళ్ళీ వెధవ చాకిరీ. ముసల్దానికి చెయ్యలేక ప్రాణం పోతోంది. రేపో మాపో అంటాడు డాక్టర్. అలా అంటూనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎంతకీ పోదే! మీ అమ్మను తీసుకెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనే పడెయ్యవయ్యా మగడా అంటే నువ్వు వినవు. అలా చేస్తే చెయ్. లేకపోతే ఒక నర్సును పెట్టి చేయించుకో. ఇక నా వల్ల కాదు’’ ఖచ్చితంగా చెప్పేసింది కాళేశ్వరి.
‘‘ముసల్ది చివరి క్షణంలో మన దగ్గిర ఉండాలి కానీ అక్కడా ఇక్కడా ఉండటం ఏమిటి మనతోనే ఉంచుకుందాం’’
‘‘అలాగే ఉంచుకో. అది ఉంటే నేను ఉండను. అంతే. ఏ విషయం తేల్చుకో’’ అని తెగేసి చెప్పేసింది.
‘‘అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదని’’ ఊరికే అన్నారా? తల్లికంటే పెళ్లామే ఎక్కువయింది తన కొడుకుకు. పడకింటి సుఖానికే ప్రాముఖ్యత ఇచ్చాడు.
*
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206