డైలీ సీరియల్

పచ్చబొట్టు--31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరునాడే తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చాడు.
శరీరమంతా నిస్సత్తువుగా ఉన్నా కళ్ళు మాత్రం పనిచేస్తున్న ఆమె వాపోని క్షణం లేదు.
పిల్లవాడు తన దగ్గిర లేకపోతే ఏడుస్తాడని వాడిని అంటి పెట్టుకొనే ఉండేది. తన భర్త ఎన్నిసార్లు అలిగేవాడు. ఆ రోజు నేనూ వాడిని అలాగే వదిలేస్తే ఈ రోజు వీడింతటి వాడయ్యేవాడా? అపుడు ఈ సుఖం తనకు మాత్రం అక్కర్లేదా? వాడి ఆలనా పాలనకి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాం? అలాగే వీడు కూడా భార్యకు బుద్ధి చెప్పి తనను ఇంట్లోనే ఉంచుకుంటే ఎంత గర్వపడేది. ఇలా చేతకానివాడిలా తెచ్చిపడేసాడు. వెధవ.. వెధవ అని- ఎన్నిసార్లో తిట్టుకుంది. చిన్నపుడు కంటికి రెప్పలా కాపాడితే కదా వీడిపుడు భార్య కొంగు పుచ్చుకొని తిరుగుతున్నాడు.
భార్యను ప్రేమగా చూడటంలో తప్పులేదు. కానీ దానికోసం తనని నిర్లక్ష్యం చేసాడే! అదే తను భరించలేకపోతోంది. తనే కాదు ఏ తల్లీ ఈ ఆవేదనను భరించలేదు. ఆయన కంటే ముందే తనూ పోతే ఈ బాధ ఉండేది కాదు అని కుళ్లి కుళ్ళి ఏడుస్తోంది ఆమె.
రేపు ఇదే పరిస్థితి తన కోడలికీ రాకపోదు. అపుడు ఇదే బాధ తనూ పడక తప్పదు. కాకపోతే అది చూడటానికి తను ఉండదు అనుకుంది శాంతిరత్నం.
****
హెచ్చరిక -6
హాయ్ ఫ్రెండ్స్!
పాఠాలు మొదలుపెట్టేప్పుడు ముందు చెప్పేదే ‘మాతృదేవోభవ’. కానీ ఎంతమంది దానిని గుర్తుపెట్టుకుంటున్నారు? అదే జరిగితే ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు? అందులో వృద్ధులు ఎందుకుంటారు?
అపురూపమైనది, వెలకట్టలేనిది తల్లి.. తల్లి ప్రేమ. అలాంటి తల్లి లేదని ఎందరో ఆక్రోశిస్తోంటే ఉన్నవాళ్ళు తమ తల్లులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. ఇది న్యాయమేనా? ఆలోచించకుండా అన్యాయం అని చెప్పవచ్చు.
సంసారంలో భర్త పాత్ర ఎంత ముఖ్యమైనదో, కొడుకు పాత్ర అంతే విలువైనది. తానొవ్వక, తానొప్పించక అన్న రీతిలో ఇద్దరితో నెగ్గుకు రావాలి గానీ భార్యమీద ప్రేమ, తల్లిమీద ద్వేషం చూపించటం అమానుషం.
అందుకే ఈసారి పచ్చబొట్టు ‘్భషణ్’కి బిరుదుగా ఇస్తున్నా!
నన్ను అభిమానిస్తున్న అందరికీ ఈ విధంగా కృతజ్ఞతలు అందజెయ్యగలగడం నా అదృష్టం. కానీ నేను మీ నుంచి ఆశించేది అది కాదు.
పచ్చబొట్టు ఇలా చేస్తుంటే బాగుంది అనుకొని నా కోసం ఎదురుచూసేకంటే అవమానాన్ని ఎదుర్కొనే ప్రతి స్ర్తి ఓ పచ్చబొట్టుగా మారాలి. అపుడే నా కృషికి తగ్గ ఫలితం దక్కినట్లు.
ఆ రోజు ఈ రోజే కావాలి!
పచ్చబొట్టు ఒక వ్యక్తి కాదు ఓ శక్తి. ఓ ప్రభంజనం అని అందరికీ అర్థం కావాలి. అది మీ చేతుల్లోనే ఉంది.
నా సహకారం మీకెప్పుడూ ఉంటుంది.
ఎల్లప్పుడూ మీకోసం ఆరాటపడే
పచ్చబొట్టు
అడ్రస్: భూషణ్, డోర్ నెం.666, నెహ్రూబజార్, మార్కాపురం
***

పేపరులో ఈ వార్త చదివిన ముఖ్యమంత్రి ‘శ్రీచరణ్’ వెంటనే హోమ్‌మినిస్టర్ హరికృష్ణని పిలిపించి పచ్చబొట్టు గురించి అరగంట మాట్లాడారు. తక్షణం ఆ విషయంలో క్రింద ఉద్యోగులతో మాట్లాడి యాక్షన్ తీసుకోండి.
పచ్చబొట్టు చేసే పని మంచిదే కానీ విఐపిల వత్తిడి నాకెక్కువయిపోతోంది. ఇప్పటివరకు పచ్చబొట్టు ఎవరో కనిపెట్టలేకపోయాం. ఇక ముందు మరెన్నో పచ్చబొట్టులు తయారయితే మరింత కష్టాలలో పడిపోతాం. అప్పుడు చేతులెత్తేసేకన్నా ముందు జాగ్రత్త పడటం మంచిది. మీవల్ల కాదంటే పచ్చబొట్టును పట్టిచ్చిన వారకి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటన ఇవ్వండి. అపుడు మీరు పట్టుకోలేకపోయినా లక్ష కోసం లక్షమంది ప్రయత్నిస్తారు. అపుడు పచ్చబొట్టు దొరికితీరుతుంది. క్విక్‌గా ఆ కార్యక్రమంలో పడండి. నాకు ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఉండండి. ఇక మీరు వెళ్ళవచ్చు అని పంపించేసాడు.
హోమ్ మినిస్టర్ డైరెక్టర్ జనరల్‌ని పిలిపించారు. పచ్చబొట్టు పట్టుకోవాల్సిన ప్రయత్నాలు చేపట్టమని, పట్టుకుంటే లక్ష రూపాయల బహుమతి ప్రకటించమని అందరికీ మెసేజ్‌లు పంపమని చెప్పారు.
డైరెక్టర్ జనరల్ డిస్ట్రిక్ హెడ్స్ యస్‌పిలకు వైర్‌లెస్ ద్వారా మెసేజిని పంపేశారు. ఆయన డిఎస్‌పి, డిఎస్‌పి సిఐలకు, సిఐలు యస్‌ఐకి, ఎస్‌ఐలు హెడ్ కానిస్టేబుల్స్‌కి, హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్‌కి న్యూస్ వెంటనే పాస్ చేసేసారు.
ఇదంతా తెలుసుకున్న పచ్చబొట్టు నవ్వుకుంది. తన తలకు ఓ రేటు నిర్ణయించారని.. అయినా పట్టించుకోలేదు. తను దొరకననే ధీమా ఆమెది. మా చేతుల్లోంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు దొరికితీరాల్సిందే అనే ధీమాలో పోలీసులు. ఎవరు గెలుస్తారో కాలమే చెప్పాలి.
ఒకరిని మించిన ఒకరు ప్రత్యర్థులై పోటీపడితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి.
గోడలమీద పోస్టర్లు వెలిసాయి ‘పట్టుకుంటే లక్ష’.
‘‘పచ్చబొట్టును అప్పగించండి, లక్ష పట్టుకెళ్ళండి’’
ప్రతి పేపరులో పాంప్లెట్స్ వెలిసాయి- ‘పచ్బబొట్టును బంధించండి - లక్షను సొంతం చేసుకోండి’-
మంచిపనులు చేసేవాళ్ళను పట్టుకోవటానికి తయారు. గొలుసు దొంగతనం చేశాడని, సైకిల్ ఎత్తుకుపోయారన్నా అతీపతీ ఉండదు. చూస్తాం, చూస్తాం అంటూనే గడిపేస్తారు. ఇలాంటివాళ్ళకు పచ్చబొట్టును అప్పచెప్పాలా? నిజంగా కనిపించినా పారిపోయేలా చేస్తాం కానీ అప్పజెప్పం. ఆడవాళ్ళంతా మనసుల్లోనే తీర్మానించుకున్నారు.
జల్సారాయుళ్ళుగా చెలామణి అవుతున్న మగవాళ్ళు మాత్రం పచ్చబొట్టు మాకే దొరకాలి, ఎంచక్కా పోలీసులకు పట్టిచ్చి లక్షని అప్పనంగా కొట్టేసెయ్యచ్చు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కానీ ఇలా ఉంటుందనీ కానీ, ఇలా ఉంటాడని గానీ ఒక బొమ్మగానీ, ఒక ఫొటోకానీ లేని పచ్చబొట్టును ఎలా పట్టుకుంటారు?
ఆ ఆలోచనే లేదు. ఎలాగైనా పట్టేసుకోవాలి. ఆలోచించాక ఆ విషయం తెలుస్తోంది. అపుడు తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు.
ఎవడైతే తమ దృష్టిలో చెడ్డవాళ్ళో వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి పచ్చబొట్టు పొడవటానికి వచ్చినపుడు పచ్చబొట్టును పట్టుకోవాలని ఎవరికివారే తాము మంచివాళ్ళని చెడ్డవాళ్ళని వెతకటం ప్రారంభిస్తున్నారు.
ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే నాలుగువేళ్ళు తనవైపు చూస్తాయని తెలియని అమాయకులా వీళ్ళు?
***
పేపర్‌లో హెచ్చరిక చదివాక పచ్చబొట్టును అభినందించకుండా ఉండలేకపోయాడు. అలాగే అతనికో ఆలోచన వచ్చింది. పథకంగా రూపకల్పన చేసుకున్నాడు. వెంటనే లేచి పచ్చబొట్టుకి ఉత్తరం రాయటం ప్రారంభిండు. అది అయ్యేటప్పటి పనె్నండు గంటలయింది. దానిని టేబుల్‌మీద ఇదివరకు ఉత్తరం పెట్టినట్లే పెట్టి పేపర్ వెయిట్ పెట్టాడు.
ముందు లైట్ వేసి ఉంచే పడుకోవాలనుకున్నాడు. మళ్లీ అలా కాదని లైటు ఆర్పేసాడు. మొదటికే మోసం వస్తుంది. తను లేచి ఉన్నానని తెలిస్తే పచ్చబొట్టు లోపలికి రాదేమోనని అనుమానించాడు. దుప్పటి భుజాలదాకా కప్పుకొని కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నాడు.
గడియారంలో ముల్లులు మారుతున్నాయి కానీ పచ్చబొట్టు రాలేదు. ఐదు గంటల దాకా జాగారం చేసాడు. తెలతెలవారుతున్న సమయం, ఇక పచ్చబొట్టు వచ్చే సాహసం చెయ్యదని నిర్థారించుకొని నిద్రకుపక్రమించాడు. అపుడు సెల్ రింగయింది.
‘హలో!’ అన్నాడు అనే్వష్.
‘ఉత్తరం తీసుకోవటానికి వచ్చాను’ సెల్‌లోంచి ఉడికిస్తూ పచ్చబొట్టు. -సశేషం