డైలీ సీరియల్

పచ్చబొట్టు-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలా డబ్బా కూడా కొద్దిగా చీకట్లోనే ఉందన్నాడు. అంత జాగ్రత్త తీసుకుంటుందా ప్రతి విషయంలో? ఒక్కచోట కూడా తప్పు చెయ్యదేం? ఎన్నో కేసులు పట్టుకున్నారంటే ఏదో చిన్న ‘క్లూ’ తమకు దొరకటంవలనే!
ఇందుగలడందులేడని ఎక్కడెక్కడో ప్రత్యక్షమవుతుందే! అప్పుడే తన కొత్త ఇల్లు ఎలా తెలిసింది? ఎవరు తెచ్చిపెట్టారు? ఎవరూ తమింటికి రాలేదే? ‘పాకర్సా!’ వెంటనే వాళ్ళకి ఫోన్ చెయ్యాలనిపించింది. టైమ్ చూసాడు. పదకొండు దాటింది. ప్రొద్దున దాకా ఆగాలా? ఎలాగ? వాళ్ళ ద్వారానే రావాలి. ఈ దెబ్బతో దొరికిపోయినట్లే!
మొన్న పిల్లాడితో పంపలా, అలాగే ఎవరితోనేనా పంపి ఉండచ్చుగా! ఎక్కువ ఆశపడి నిరాశపడకని అంతరాత్మ.
పొద్దున సెల్‌లో ‘పేకర్స్’తో మాట్లాడాను.
‘‘మీరా అనే్వష్ సాబ్!’’ మా వాళ్ళు బాగా చేసారా?’’
‘‘పాకింగ్, సర్దటం అంతా బాగా చేశారు సార్. ఏ వస్తువూ పాడవకుండా ఇంటికి తెచ్చారు. నాకో చిన్న ఇన్‌ఫర్‌మేషన్ కావాలి వాళ్ళ ద్వారా! వాళ్ళు ఎప్పుడు వస్తారు?’’
‘‘రాత్రంతా పాకింగ్‌లోనే ఉన్నారు సార్. మధ్యాహ్నం వస్తారు! రాగానే మీ దగ్గిరకు పంపమంటారా?’’
‘‘ఆ పని చెయ్యండి. మరిచిపోకండి’’
‘‘ఎవరిదయినా మరిచిపోతాం కానీ మీ దెట్లా మరచిపోతాను. రాగానే గుర్తుపెట్టుకొని పంపుతాను’’.
‘‘అలాగే’’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
మధ్యాహ్నందాకా ఆగాలి. ఏదీ అనుకోగానే జరిగిపోదుగా!
అన్నీ తమాషాగా చేస్తుంది. వారం రోజులు ఏ డ్రెస్సు వేసుకుంటే ఆ డ్రెస్సులో పెట్టుకు తిరిగాడు ముందుసారి పచ్చబొట్టుకు రాసిన లెటర్. తర్వాత దాని విషయమే మరిచిపోయాడు. ఆ ఉత్తరం ఎలా వెళ్ళింది?
‘‘విద్య? నా బ్లాక్ ప్యాంట్ కనిపించదే?’’
‘‘అదా! ధోబీకి వేసానన్నయ్యా!’’’
‘‘మరి పాకెట్స్ చెక్ చేసావా?’’
‘‘లేదురా! ఎప్పుడూ ‘్ఛమేలీ’నే చూసి నాకిచ్చేస్తుంది. అందుకే పట్టించుకోలేదు. క్యాష్ ఏమైనా తేడా వచ్చిందా?’’
‘‘లేదు. ఒక కాగిడం కనిపించకపోతే. దానిపైన సెల్ నెంబర్ రాసుకున్నాను’’.
‘‘అరె! ఈసారి వచ్చినపుడు అడగనా?’’
‘‘అర్జెంట్. నేనే వెళ్లి తెచ్చుకుంటాను. ఛమేలీ ఇల్లు తెలుసుగా!’’
‘‘సరే! వెళ్లిరా’’ అంది విద్య.
సందులు గొందులు తిరిగి ఛమేలీ వాళ్ళింటికి వెళితే వాళ్ళ అమ్మ ఎదురువచ్చింది.
‘‘్ఛమేలీ ఉందా?’’ అడిగాడు.
‘‘లేదు బాబూ! ఊరెళ్ళింది? ఏం బాబూ.. బట్టలేమన్నా అర్జెంట్‌గా కావాలా?’’
‘‘మొన్న వేసిన బట్టలు ఉతికేసారా?’
‘‘ఆ ఇస్ర్తి కూడా అయిపోయాయి. సాయంత్రం మా అబ్బాయితో పంపిస్తాను’’.
‘‘మీ అమ్మాయి ఊరినుంచి ఎప్పుడొస్తుంది?’’
‘‘రెండు రోజుల్లో వచ్చేస్తుంది’’.
‘‘సరే రాగానే విద్య ఒకసారి రమ్మని చెప్పింది చెప్పు’’ అని చెప్పి ఇంటికి వచ్చేసాడు. ఎప్పుడూ అన్నీ ఇచ్చేసే ఛమేలీ ఈసారి లెటర్ ఎందుకు ఇవ్వలేదు?
పోనీ చూడలేదా అంటే చిన్న పేపరు కాదే!
ఏమిటో తన చుట్టూనే పెద్ద గూడుపుఠాణీ జరుగుతోంది. ఏ ఒక్కటీ తేలినా పచ్చబొట్టు దొరికిపోతుంది. అయినా ఛమేలీ ఇపుడే ఊరికి వెళ్లాలా? ఉంటే ఇప్పటికప్పుడు తెలిసిపోయేదే.
‘‘ఏరా అన్నయ్యా! పేపరు దొరికిందా?’’
‘‘లేదే! ఛమేలీ ఊరెళ్ళిందట.’’
‘‘వాళ్ళమ్మని అడగకపోయావా?’’
‘‘తీసి నీకే ఇవ్వాలి. ఇక దానితోపాటే ఉతికేసారేమో?’’
‘‘అయ్యో! ఇప్పుడెలా? నేనెలాగో కనుక్కుంటాలే!’’
పచ్చబొట్టు తన విషయం విద్యకు చెప్పొద్దనటంతో ఎన్ని అబద్ధాలు విద్యకి చెప్పాల్సి వస్తుందో? మనసులోనే మధనపడ్డాడు అనే్వష్.
‘‘బట్టలు తేగానే ఉందేమో చూస్తాలే అన్నయ్యా!’’
‘‘సరే! ఆఁ! విద్యా! కొత్త ఇల్లు, కొత్త వాతావరణం. జాగ్రత్తగా ఉండు’’ హెచ్చరించాడు.
‘‘ఎందుకలా అంటున్నావ్?’’
‘‘రోజులు బాగోలేవు. ఎవరినీ నమ్మటానికి లేదు, అందుకని. అంతకన్నా ఏం లేదు’’
‘‘సరే! జాగ్రత్తగా ఉంటానులే’’
‘‘వినీల్ వెళ్లిపోయాడా?’’
‘‘ఆ! అన్నయ్యా! ఈ ఇల్లు బాగుంది కదా!’’
‘‘ఈ ఇల్లు బాగుంది. అందులో మహారాణిలా మా చెల్లి బాగుంది’’.
‘‘్ఫ! అన్నయ్యా!’’ చాలా రోజుల తర్వాత మూతి మడుచుకుంది విద్య.
‘‘పోతున్నాను తల్లీ! నా డ్యూటీ నాకు తప్పదుగా. అందులో స్పెషల్ డ్యూటీలు’’ షర్ట్ తీసి హేంగర్‌కి తగిలిస్తూ అన్నాడు.
‘‘పచ్చబొట్టు నిన్ను బాగా ఏడిపిస్తోంది కదరా అన్నయ్యా!’’
‘‘ఇంకెన్నాళ్ళులే!’’
‘‘దొరికే ఛాన్సుందంటావా?’’
‘‘ఆ! అనుమానాస్పదంగా ఎవరి దగ్గరినా పచ్చబొట్టు వేసే పరికరాలు ఉంటే వెంటనే అరెస్టు చెయ్యమని అన్ని స్టేషన్‌లకు ఆర్డర్స్ పంపాం. ఎక్కడో ఒకచోట దొరకకపోదని నమ్మకం’’.
‘‘వినీల్ సాయంత్రం తన సామాను తెచ్చేసుంటానన్నాడు.’’
‘‘పంతులుగారిని సంప్రదించి ఈవారంలో ముహూర్తాలు పెట్టమని చెబుతాను’’.
తల ఊపింది విద్య.
‘‘నలుగురూ వచ్చి నాలుగు అక్షింతలు వేస్తే పని అయిపోతుంది. ఏరా?’’
‘‘్ఛ! ఫో!’’ అంది విద్య. మామూలుగా అయితే బోలెడు దెబ్బలాడేది. నా పెళ్లి నీకు పనా అని. కానీ ఇప్పుడలాంటి మాటలు రావటం అరుదయ్యాయి. అమ్మా, నాన్న దిగులు దాన్ని భర్తీ చేస్తోంది.
విద్యను అనే్వష్ హాస్పిటల్ ముందు దింపాడు.
ఇంతలో కాంపౌండర్ కామేష్ పరుగెత్తుకొచ్చాడు.
‘‘విద్యమ్మగారూ! వచ్చేసారా! ఇప్పుడే మీ సెల్‌కి ఫోన్ చేసాం. రింగ్ అవుతోంది కానీ ఎవరూ ఎత్తలేదు. మిమ్మల్ని అర్జెంట్‌గా తీసుకురమ్మంటే వస్తున్నాను. అర్జెంట్ ఆపరేషనంటమ్మా! మీరు లేకపోతే పేషెంట్ ఆపరేషన్ చేయించుకోవటానికి ఒప్పుకోవటం లేదు.’’.
‘‘పద! వస్తున్నాను’’ అంటూ ‘‘అన్నయ్యా! నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.. బై’’ అంటూనే పరుగులాంటి నడకతో హాస్పిటల్‌లో ప్రవేశించింది.
విద్యా డాక్టర్ వచ్చేసారు. అప్పుడే పేషెంట్లలో చలనం, సంచలనం.
‘‘మా అమ్మాయి చావనన్నా చస్తానంటోంది కానీ మీతో తప్ప వేరే వాళ్ళతో కాన్పు చేయించుకోదటమ్మా. మీరే కావాలట. రండమ్మా! రండి! తొందరగా రండి’’.
ఆ అమ్మాయి తండ్రి రోదనలో ఆమెను నడవనివ్వటంలేదు.
‘‘మీరు తప్పుకోండి. ఎవరైతే ఏముంది. సమయం ముఖ్యం. ఆలస్యమయితే ప్రమాదం కదా! అలా మొండి పట్టు పట్టకూడదు. అందరూ డాక్టర్లే!’’
‘‘నా తల్లి నీ చెయ్యి పడిందంటే నా బిడ్డ సంగతి ఆలోచించక్కర్లేదు’’ ఆమె తల్లి విద్య వెంబడి పడుతోంది.
‘‘అలాగా! మీరేం భయపడకండి’’ అంటూనే ఆపరేషన్ రూంలోకి వెళ్లింది. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206