డైలీ సీరియల్

పచ్చబొట్టు-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్ట్‌మాన్ తతంగమంతా ఉత్త గ్యాస్ అని నిన్ననే అనుకున్నాడు. అలాగే అయింది. ఇక ఆలోచించేదేముంది?
అప్పుడు తృప్తి వెళ్లిన ఇల్లు సంగతి గుర్తువచ్చింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? ఏమిటి? ఇది ఆఫీసు వర్క్ కాదు కాబట్టి డ్యూటీ లేనప్పుడు తనే కనుక్కుందామనుకున్నాడు అనే్వష్. తర్వాత కనుక్కుంటే అసలామెకు సంబంధించిన వారెవరూ అక్కడ లేరని తెలిసింది.
***
‘‘అన్నయ్యా! అన్నయ్యా! లేవరా! పచ్చబొట్టు దొరికిందట. ఆడావిడే. రచయిత్రి అట’’.
‘‘విద్యా! పొద్దునే్న జోకులెయ్యటానికి నేనే దొరికానా? వెళ్ళరా!’’
‘‘నిజంరా బాబూ! ఆవిడకు ముప్ఫై ఐదేళ్ళట’’
‘‘అదయితే అస్సలు నమ్మను. ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది’’.
‘‘లేదు.. ఆవిడ దగ్గిర పచ్చబొట్టు పొడిచే సామానులన్నీ ఉన్నాయని పేపరులో క్లియర్‌గా రాసారు’’.
‘‘ఇంతకీ ఏ ఊర్లో? ఏదీ పేపరు ఇటు ఇవ్వు’’ అంటూ తీసుకొన్నాడు.
పేపరు తెరిచి చదవటం ప్రారంభించాడు.
పట్టుబడ్డ పచ్చబొట్టు
తూర్పుగోదావరి జిల్లా యానాం ట్రావెలర్స్ బంగ్లాలో అనుమానాస్పద పరిస్థితులలో వున్న స్ర్తి దగ్గిర పచ్చబొట్టు పొడిచే పరికరాలు ఉండటంవలన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె రచయిత్రి రాధిక. తను ప్రశాంత వాతావరణంలో నవల రాసుకోవడానికి మాత్రమే ఇక్కడకు వచ్చానని, తనకూ ఆ పరికరాలకు ఏ సంబంధం లేదని, తను పచ్చబొట్టు కాదని బుకాయిస్తోందని, అవి తనవి కానప్పుడు ఆమె దగ్గిర ఆ పరికరాలు ఎందుకు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఆమెను కోర్టుకు విచారణ నిమిత్తం తీసుకువెళ్తున్నారని తెలుస్తోంది.
‘‘విద్యా! ఇది రాత్రే నాకు తెలుసురా. అక్కడ పోలీసులు నాకు ఇన్‌ఫార్మ్ చేశారు. జ్యూడీషియల్ కస్టడీ ద్వారా ఆమెను ఇక్కడకు రప్పిస్తాం. కేసు ఇక్కడే నడుస్తుంది. ఊరికే కాసేపు నినే్నడిపించాలని అలా మాట్లాడాను. ఎక్కడ ఏది జరిగినా ముందు ఇన్‌ఫర్‌మేషన్ వచ్చేది నాకేగా! ఈ విలేకరులు ఇంత ఉంటే అంత ఊహించి జోడించేస్తారు’’.
‘‘మరి నాకు రాత్రే ఎందుకు చెప్పలేదు?’’
‘‘ఏం రాత్రికి రాత్రి వెళ్లి విడిపించేసేదానివా?’’
‘‘అలా కాదు కానీ పచ్చబొట్టు పట్టుబడటం నాకిష్టం లేదు. ఆమెవల్ల ఎంతమంది బాగుపడుతున్నారో మా హాస్పిటల్‌కి వచ్చే రోగులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు’’.
‘‘ఆయమ్మ దయవల్ల మావోళ్ళు బుద్ధిగా ఉంటున్నారని’’ ఒకరు.
‘‘మా ఆయన చెడు తిరుగుళ్ళకు స్వస్తి చెప్పి బుద్ధిగా ఉంటున్నాడని’’ మరొకరు.
‘‘పోకిరీలా తిరిగే నా కొడుకు బుద్ధిమంతుడయ్యాడని ఇంకొకరు. ఇలా ఇంకెందరో?’’
ఇంతమందికి మంచి చేసే పచ్చబొట్టు లొంగిపోయి, శిక్ష పడితే మళ్లీ ఈ అరాచికాలన్నీ విజృంభించవా? నువ్వే చెప్పు.
‘‘నువ్వు చెప్పేది నిజమే విద్యా! కానీ కోర్టులో కేసు వేసాక ఆమెను పట్టుకోవాలి. చట్టం ప్రకారం శిక్షించాలి, తప్పదు కదా!’’
‘‘ఒరేయ్! నాదో చిన్న రిక్వెస్టురా! సినిమాల్లో ఈమధ్య చూసి చూడనట్లు మంచివాళ్ళను వదిలేస్తారుగా. అలా ఆ పచ్చబొట్టు నిజమైతే వదిలేస్తానని మాట ఇవ్వరా!
‘‘పిచ్చితల్లీ! ఆమె పచ్చబొట్టు కాదు నాకు తెలుసు.’’
‘‘ఒకవేళ అయితే నేను చెప్పినట్లు చేస్తావా? లేదా?’’
‘‘చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవటం తప్పురా!’’
‘‘అలాగని ఎందరో అమాయకులు ఆడవారైన పాపానికి బలి అయిపోవటం తప్పుకాదా?’’
‘‘ఆ రకంగా ఆలోచిస్తే అది కరెక్టే. కానీ నేను బాధ్యతగల పోలీసాఫీసరుని’’
‘‘ఈ ఒక్కసారికి నా మాట విను.’’
‘‘అలాగేలే!’’
‘‘అదుగో! అదే! మళ్ళీ ఆ‘లే’ఏమిటి. గోడమీద కప్పలా ఉంది నీ వ్యవహారం.
‘‘నువ్విలా ఫైట్ చేస్తున్నావని తెలిస్తే పచ్చబొట్టు ఎంత మురిసిపోతుందో?’’
‘‘ఆవిడ మురిసిపోవాలని కాదు భారతీయ వనితగా ఈ దేశం. ఈ ప్రజలు ఎలా ఉండాలని నేను కోరుకుంటానో అలానే ప్రవర్తిస్తోందీ పచ్చబొట్టు. ప్రజలలో ఈ మార్పునే ఆమెను కోరుకుంది. ఒక రకంగా సాధించినట్లే! ఈ సమయంలో మనం ఆమెను అభినందించాలే తప్ప శిక్షించకూడదు. నేనే జడ్జినయితే ఇలాగే తీర్పు ఇస్తాను.’’
‘‘సరే! ఈ కేసులో నినే్న జడ్జిగా నియమిస్తాంలే!’’
‘‘అన్నయ్యా! నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను. నువ్వు జోక్‌గా తీసుకుంటున్నావ్!’’
‘‘లేదమ్మా! నేనంతా సీరియస్‌గానే విన్నాను.’’
‘‘కానీ చేస్తానని మాట ఇవ్వటం లేదు.’’
‘‘ముందు ఆమే పచ్చబొట్టు అని నిరూపించబడనీ...’’
ఇక అన్నయ్యతో వాదించే ఓపిక లేకపోయింది విద్యకు.
ఆరోజు ఆకలి లేదు. అన్నం తిననంది. అనే్వషే బ్రతిమలాడి తినిపించాడు.
పచ్చబొట్టుకోసం పోరాడటానికి మీకు బలం కావాలి. రోజూకన్నా ఎక్కువ తినాలి కానీ వద్దనకూడదు అంటూ.
వినీల్ కూడా ఆరోజంతా ఏడిపిస్తూనే ఉన్నాడు విద్యను.
యశోదరమ్మ మాత్రం ‘‘ఎందుకురా దాన్నలా అంటారు’’అని వెనకేసుకొస్తోంది.
సాయంత్రం అనుకున్నట్లే విద్య, వినీల్ నాయనమ్మను గుడికి తీసుకువెళ్ళారు. అనే్వష్ నాకు కుదరటం లేదని వెళ్ళిపోయాడు స్టేషన్‌కు.
ఎంత విశాలమైన గుడో! ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ శిల్ప నైపుణ్యంచూడు అంటూ గుడిలో స్తంభాలను విద్యకు చూపిస్తున్నారావిడ.
లోపల వరుసగా ఉన్న లింగాలను ఒక్కటి వదలకుండా చూసి దండం పెట్టుకున్నారు. ఆ శ్రద్ధకు ముచ్చటేసింది వారిద్దరకు.
ఆ వయసులో తమకు ఆమాత్రం ఓపిక ఉంటుందంటే నమ్మలేం! ఇప్పటి ఆహారాలు అలాంటివి. ఈ వయసులోనే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా కష్టపడుతున్నాం.
బయటకు వచ్చాక ఈశ్వరుని విగ్రహంముందు కాసేపు కూర్చున్నారు. తర్వాత సువర్ణ ముఖీనది దగ్గరకు తీసుకువెళ్ళారు. కాసిని నీళ్ళు తీసుకొని తలమీద జల్లుకున్నారు. ఒక్కోసారి ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఒక్కోసారి ఇసుక కనిపిస్తూ ఆడుకోవాలనిపిస్తుంది.
‘‘విద్యా! నీకు తెలుసా! మా చిన్నప్పుడు కూలి చేసి వచ్చి ఈ ఇసుకలో చెయ్యి పెడితే వాళ్ళ కూలికి సరిపడా డబ్బులొచ్చేవని చెప్పుకునేవారు.’’
‘‘నిజంగానా నాయనమ్మా! నాకింతవరకు తెలియదు ఈ విషయం.’’
‘‘కాళహస్తీశ్వరుడి లింగాన్ని పూజారులుకూడా తాకరు. అది తెలుసా పోనీ.’’
‘‘ఇది మాత్రం విన్నానులే. కారణం తెలియదుకానీ.’’
‘‘ఆ సర్వేశ్వరుడిని ఓ అజ్ఞాని అనుమానించాడట. లింగాన్ని ముట్టుకోకూడదని చెబుతున్నా వినకుండా తన బ్రొటనవ్రేలితో తాకాడట. ఇంకేముంది? తాకినంతమేర రాయి అయిపోయిందట. అంత మహిమగలదా లింగం. అభిషేకం చేసేప్పుడు కూడా పూజారులు పైనుంచే లింగానికి అభిషేకం చేస్తారు కానీ తాకరు.’’
‘‘ఇన్నాళ్ళుగా ఈ ఊళ్ళో తిరుగుతున్నాను కానీ ఇవన్నీ నాకు తెలియవు నానమ్మా! ఇంకా చెప్పండి వినాలని ఉంది’’ అన్నాడు వినీల్. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206