డైలీ సీరియల్

అన్వేషణ -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో ఉన్న ఆలోచనలు, భావాల్ని ఎవరితోనన్నా పంచుకుంటే మనస్సు తేలికపడుతుందన్న సంగతి తొలిసారిగా అప్పుడే అర్ధమయ్యిందతడికి.
హిమజ! పేరు ఎంత బాగుందో మాటా తీరూ అంతే బాగుందనుకున్నాడు. ఆమెతో మాట్లాడుతుంటే ఇదీ అని చెప్పలేని ప్రశాంతంగా అనిపించిందతడికి. ఆమెలో ఆడంబరం లేదు. అతిశయం లేదు. షాపింగ్ మాల్లో చుడీదార్లో కనిపించినప్పుడూ ఆమె బాగుంది. శిల్పారామంలో చీరలో కనిపించినప్పుడూ ఆమె బాగుంది...
అలా సోఫాలో చాలాసేపు ఆమె గురించే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. కొంతసేపటికి ఆలోచనలు అటూ ఇటూ మళ్లాయి. అమ్మమ్మ కళ్లల్లో మెదిలింది.
ఎముకల పోగులా అయిపోయిందిప్పుడు. కొన్నాళ్లక్రిందట కాస్త బలంగా ఉండేది. వయస్సు మీద పడిందిప్పుడు. ఆపైన కష్టాలు, కన్నీళ్లు మరింత కృంగదీశాయి. ఆమె అప్పుడు పడ్డ కష్టం తను ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, దుఃఖమూ వస్తుంది తనకోసం అంత కష్టపడిందా అని!
ఆమె తనతో ఉంటుందని, ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూసుకోవాలని ఇంత ఇల్లు తీసుకున్నాడు తను. ఆ నేల విడిచిపెట్టి రాలేదన్నదామె. ఆమె ఆలోచనల్ని నెమ్మదిగా అర్థం చేసుకోగలిగాడు అనిరుధ్.
ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా, ఇంకెక్కడా ఏ పనీ చేయవద్దని నెలనెలా తన ఫ్రెండు కొండబాబుకి డబ్బు పంపుతున్నాడు అనిరుధ్. అతడు ఆమెకు కావలసినవన్నీ అమర్చిపెడతాడు. అంతేకాదు అమ్మమ్మని కనిపెట్టుకుని చూడడానికి ఓ పనమ్మాయిని కూడా ఏర్పాటుచేశాడు. రెండురోజులకోసారి కొండబాబు ఫోన్‌చేసి ఆమె యోగక్షేమాలు తెలుపుతుంటాడు. ఆమెను కూడా సెల్‌ఫోన్‌లో మనవడితో మాట్లాడిస్తుంటాడు.
అమ్మమ్మ తన దగ్గరికి రాకపోయినా ఆమెకోసం తాను ఆమాత్రమేనా చేయగలిగినందుకు కొంతలోకొంత తృప్తిపడ్డాడు అనిరుధ్.
ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న అతడి మస్తిష్కంలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. ఆ ఆలోచన రాగానే ఎవరో అతడిని కుదిపినట్లయ్యింది. ‘పెళ్లిచేసుకోరా అనిరూదూ...’అంటున్న అమ్మమ్మ మాటలకి జవాబుగా అన్నట్టు... ‘హిమజను పెళ్లిచేసుకుంటే!’అన్న ఆలోచన కొన్ని క్షణాలపాటు అతడిని కుదిపేసింది.
‘్ఛ! ఏమిటిలా ఆలోచిస్తున్నాను? రెండు నెలలక్రిందట పరిచయమై, భావాలు, అభిరుచులు కలసి కాస్త కలివిడిగా మాట్లాడినంతమాత్రాన ఇలా ఊహించేసుకోవడమేనా?’ అని లెంపలు వాయించుకున్నాడు తప్పుచేసిన వాడిలా. కానీ ఆ ఆలోచన రోజూ అతడిని వెంటాడుతూనే ఉంది.
‘నీకేం తక్కువ? సినిమా హీరోలాకాకపోయినా ఎర్రగా బుర్రగా ఉన్నవాడివి... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వి... సొంతంగా కంపెనీ పెట్టుకుని రెండుచేతులా సంపాదిస్తున్నవాడివి... భార్కని చక్కగాచూసుకునే సంస్కారం ఉన్నవాడివి... హిమజని పెళ్లిచేసుకుంటే అమ్మమ్మ నీ దగ్గరికొస్తుందేమో! అమ్మమ్మని బాగాచూసుకునే సంస్కారం ఆమెలోనూ ఉంది...’’ ఇలా రోజూ అతడి మనస్సు ప్రేరేపిస్తూనే ఉంది. హిమజతో స్నేహం రోజులు గడుస్తున్నకొద్దీ బలపడుతూనే ఉంది. ఇప్పుడు వాళ్లిద్దరిమధ్యా అరమరికలులేవు. ‘అండీ’లు పోయాయి. వారానికోసారి ఇద్దరూ ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చుని మనసారా కబుర్లు చెప్పుకుంటున్నారు. రోజుకొకసారైనా సెల్‌ఫోన్‌లో పలుకరించుకుంటున్నారు.
ఆమెతో పరిచయం బలపడిన తర్వాత అర్థమైంది అనిరుధ్‌కి ఆమె ఎంత సందడిగా ఉంటుందో! ఎంత అందంగా జోకులేస్తుందో! ఏదో ఒక స్వరం పలికినట్లు ఆమె మాట్లాడుతుంటే రెప్ప వాల్చకుండా ఆమెనే చూడాలనిపిస్తుంది అనిరుధ్‌కి. ‘హిమా! నువ్వు మాట్లాడుతుంటే వీణ మీటినట్లు హాయిగా ఉంటుంది. ఎంతసేపైనా వినాలనిపిస్తుంది...’ ఓరోజు పార్కులో లాన్‌లో కూర్చున్నప్పుడు... కాళ్లు రిలాక్స్‌గా జాపుకుని, చేతులు మీద వెనక్కివాలి ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్లు అన్నాడు అనిరుధ్.
‘అవునా! అంతలా మాట్లాడుతున్నానన్నమాట!’ అన్నదామె నవ్వుతూ, అతడి ముఖంలోకి సూటిగా చూస్తూ. ‘నిజం! నిన్ను పొగడదామని కాదు నేనంటున్నది....’
‘తెలుసు... పొగిడి నన్ను కాకాపట్టే తత్వం నీలోలేదని నాకు బాగా తెలుసు అనిర్!’ అన్నదామె.
‘అరె! అనిర్!... భలే పేరుపెట్టావే?... నా పేరు సరిగ్గా పలకడం చేతకాక మా అమ్మమ్మ ‘అనిరూదూ’ అంటుంది. ఇక మిగిలినవాళ్లు అనిరుద్దూ అంటూ నోటికొచ్చినట్లు పిలుస్తారు. అసలు ఇంత అందమైన పేరు మా అమ్మమ్మ నాకెలా పెట్టిందో నాకే తెలీదు. అదే విషయం ఓసారి అమ్మమ్మని అడిగాను. ఆమె ఏమన్నదో తెలుసా? నాకు మాత్రం ఏం తెలుసురా అంది. నన్ను స్కూల్లో చేర్చడానికి ఆమె తీసికెళ్లిందిట. టీచర్ పేరు చెప్పమంటే వాడికి నామకరణం అంటూ ఏమీ జరగలేమ్మా... అప్పలకొండ అని పిలుస్తున్నాం అన్నదిట. దానికి ఆ టీచర్ నవ్వుకుని ‘మొక్కా’అని అడిగిందిట. అదేం కాదని మా అమ్మమ్మ చెప్పడంతో సరే ఆ పేరు బాగోలేదు... అనిరుధ్ అని రాస్తున్నాను అని రిజిష్టర్‌లో నా పేరు టీచర్ రాసింది... కొన్నాళ్లదాకా అమ్మమ్మకి ఆ పేరు పలకడం చేతకాలేదు. చివరికెలాగో అనిరూదూ అని పిలవసాగింది’ చెప్పాడు అనిరుధ్.
‘అయితే నీ పేరుకీ ఓ చరిత్ర ఉందన్నమాట...’అని నవ్విందామె.
‘కదా! ఇప్పుడు నువ్వు దాన్ని షార్ట్‌కట్‌చేసి ‘అనిర్’అన్నావ్. ఈ పేరూ బాగానే ఉంది...’ ‘బావుందా? అయితే థాంక్స్. నువ్వు నన్ను హిమా అంటున్నావ్ కదా. నేను నిన్ను అనిర్ అంటాను...’అని కిలకిలా నవ్వేసింది.
‘ఇంతకీ అనిర్ అంటే అర్థం ఏమిటి?’
‘అర్థం?... ఇప్పుడు మనవాళ్లు పెట్టుకునే పేర్లకు అర్థాలుండడం లేదు. అయినా అనిర్ అంటే అర్థం ఏమిటో నాకూ తెలీదు. డిక్షనరీ చూస్తాను...’
‘నీ దగ్గర తెలుగు డిక్షనరీ ఉందా?...’
‘లేదు... బుక్‌షాప్‌కి వెళ్లి చూస్తాను... బుక్‌షాప్ అంటే గుర్తొచ్చింది... నీకు బుక్‌రీడింగ్ అలవాటుందా?’ అడిగిందామె.
‘అలవాటు అంటే... పెద్దగా లేదు. కానీ చదువుతాను.’ ‘ఇప్పటిదాకా ఏం చదివావ్?’ ‘ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్‌లో నా రూమీట్ ఒకతను ఉండేవాడు... అతడి పేరు... శ్రీకాంత్... అతడు శ్రీశ్రీ గురించి గొప్పగా చెప్పేవాడు. ఓసారి శ్రీశ్రీగారి మహాప్రస్థానం ఇచ్చి చదవమన్నాడు. చదివాను. మరోసారి కృష్ణశాస్ర్తీ కృష్ణపక్షం ఇచ్చి చదవమన్నాడు. అదీ చదివాను. నిజం చెప్పాలంటే ఆ రెండూ నాకు సరిగా అర్థం కాలేదు. ఒకరిది విప్లవం.... ఒకరిది... ‘్భవకవిత్వం.’
‘అవునుట! తర్వాత అతడే చెప్పాడు. శ్రీశ్రీ గురించి అతడు రూములో గొప్పగా లెక్చర్లిచ్చేవాడు. ఒక్కోసారి నా చదువు కూడా డిస్ట్రబ్ అయ్యేది... అతడే తర్వాత బుచ్చిబాబు, రావిశాస్ర్తీ కథల పుస్తకాలు ఇచ్చాడు. చదివాను. అవి బావున్నాయి.’ - ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842