డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ..32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నీ సబ్జెక్ట్ కాదు కదా? ఈ పుస్తకం తీసుకున్నావెందుకు?’’ అడిగిందామెని ఆశ్చర్యంగా.
‘‘సైకాలజీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నాకు ఖాళీ దొరికినపుడల్లా ఆ పుస్తకాలు చదువుతుంటాను. ప్రతీ ఒక్కరూ చదివి తెలుసుకోవాల్సిన పుస్తకాలు ఇవి. నువ్వు కూడా చదువు వీలైతే’’
హరితకి మొదటి రోజు ఆమెని చూసిన సందర్భం గుర్తుకు వచ్చింది. తనెంతో ఆకట్టుకున్న ఆమె కళ్ళలో ఎదుటివాళ్ళని కట్టిపడేసేలాంటి ఆ శక్తి ఏమిటో ఆమె కప్పుడు అర్థమయ్యింది. ఆ శక్తి ఆకర్షణతోనో, అందంతోనో, డబ్బుతోనో వచ్చింది కాదు.. విజ్ఞానంవల్ల వచ్చింది!
లక్ష్మి హరితని వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది. వెంటనే ఇంటికి వెళ్లి చేసే పని కూడా ఏమీ లేకపోవడంతో హరిత అంగీకరించింది. ఇద్దరూ ఆమె స్కూటీ మీద వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ ఇంటిని చూసి హరిత ఆశ్చర్యపోయింది. వాళ్ళకి వున్న స్టేటస్‌కి ఆమె రోజూ కాలేజ్‌లో కారులో రావచ్చు.
ఆమె హరితని తన గదిలోకి తీసుకువెళ్లింది. ఒక అలమారునిండా పుస్తకాలు, కంప్యూటర్, మ్యూజిక్ సిస్టమ్ వున్నాయామె గదిలో. అన్ని పుస్తకాలని చూసి హరిత ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యాన్ని చూసి లక్ష్మి నవ్వింది.
‘‘పుస్తకం అన్నది ఈ ప్రపంచాన్ని వాస్తవంగా చూడడానికి కిటికీలాంటిది. ప్రపంచానే్న కాదు... నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కూడా పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి.’’

హరితకి రెండు రోజుల క్రితం అర్థరాత్రి వరకూ తన క్లాస్ పుస్తకం చదవడం గుర్తొచ్చింది.
‘‘అది సరే.. ఇంతకీ నీ సంగతులేం చెప్పడం లేదు.. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? ఏం చేద్దామనుకుంటున్నావు?’’ అడిగింది లక్ష్మి.
హరిత వరుణ్ గురించి చెప్పాలా వద్దా అని కొంచెంసేపు ఆలోచించింది. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. కావేరి దగ్గిర చెప్పినంత ధైర్యంగా ఆమె దగ్గిర చెప్పలేకపోతోంది. హరిత బయలుదేరబోతుంటే ఆమె పుస్తకాల రేక్‌లోంచి ఒక పుస్తకాన్ని తీసింది. దానిమీద ‘టు హరిత విత్ లవ్’ అని రాసి సంతకం చేసి హరితకి ఇచ్చింది.
‘‘చాలా మంచి పుస్తకం. నేను రెండుసార్లు చదివాను. నువ్వు కూడా చదువు, నా గిఫ్ట్‌గా నీ దగ్గిర వుంచు’’ చెప్పింది.
హరిత ఆ పుస్తకంకేసి చూసింది. ‘ది ఆర్ట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ అన్న శీర్షిక వున్న పుస్తకం అది.
‘‘స్నేహం అంటే నాకెంతో ఇష్టం. ఎందుకో తెలుసా?’’ అడిగింది లక్ష్మి.
‘‘ఎందుకు?’’
‘‘సాధారణంగా తల్లిదండ్రులకీ పిల్లలకీ, అన్నదమ్ములకీ, అక్కచెల్లెళ్ళకీ చివరికి భార్యాభర్తలమధ్యన కూడా కొన్ని విషయాలలో కమ్యూనికేషన్ గేప్ వుంటుంది. కానీ ఆ రకమైన కమ్యూనికేషన్ గేప్ వుండనిది కేవలం స్నేహితుల మధ్యే. ఎదుటివాళ్ళేనుకుంటారోనన్న సంకోచం లేకుండా మనసులోని భావాలని పంచుకోగలిగేది స్నేహితులతోనే. అందుకే నాకు అన్ని బంధాల్లోకీ స్నేహబంధమే గొప్పదనిపిస్తుంది’.
‘‘్థంక్యూ’’ అంది హరిత పుస్తకాన్ని అందుకుని.
ఆమె చెప్పినట్లుగానే ఇద్దరు స్నేహితుల మధ్యన కమ్యూనికేషన్ గేప్ వుండదు.. నిజమే!
కానీ ఆమె తనని తన భవిష్యత్ ప్రణాళికలేమిటని అడిగిన ప్రతిసారీ వరుణ్ విషయం ఎందుకు చెప్పలేకపోతోంది? ఆమె ద్వారా తన తండ్రికి తెలిసి ఇంట్లో గొడవ అవుతుందన్న భయంవల్ల కాదు..
మరెందుకు? తను చేస్తున్నది తప్పేమోనన్న సంకోచంవల్లా? ఆమెకి మరోసారెప్పుడైనా లక్ష్మితో విషయం అంతా చెప్పి తన మనసులో భావాలని పంచుకోవాలనిపించింది.
***
లక్ష్మిని కలిసాక హరితకి కొత్తగా వచ్చిన అలవాటు.. పుస్తకాలు చదవడం, ఏ మాత్రం సమయం దొరికినా ఇదివరకట్లా టీవీలో వచ్చే సీరియల్స్, గేమ్‌షోలూ చూడడం మానేసి పుస్తకాలు చదువుతోంది.
తెలుగులోనూ ఇంగ్లీష్‌లోనూ రకరకాల విషయాలకి సంబంధించినవి.. వివిధ రచయితలు రాసినవి.. లైబ్రరీ నుంచి తీసుకువచ్చి చదవసాగింది. సమయం ఎలా గడుస్తోందో తెలియకుండా గడిచిపోతోంది. లక్ష్మి చెప్పినట్టుగానే పుస్తకాలు చదువుతుంటే మనసులో ఏవో ద్వారాలు తెరచుకుంటున్నట్టుగా అనిపించసాగింది. ఆ విజ్ఞానంవల్ల వచ్చిన ఆత్మవిశ్వాసంతో వరుణ్‌లో మార్పు తీసుకురాగలనన్న నమ్మకం ఆమెలో కలుగసాగింది. అయితే ప్రస్తుతం ఆమె సమస్య వరుణ్ కాదు.. భరణి!
***
ఈ సృష్టి మొత్తం ఏ సూత్రంమీద తిరుగుతుందో చెప్పడం కష్టం కానీ మనిషి జీవితం మాత్రం ఆశ అన్న సూత్రంమీదే నడుస్తుంది. ఆ ఆశ లేకపోయాక బ్రతకడం చాలా కష్టం. హరిత పరిస్థితి అలాగే వుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెని లక్ష్మి కనబడి పలకరించింది.
‘‘ఏంటలా వున్నావు?’’ అనడిగింది చూడగానే.
హరితకేం చెప్పాలో తెలియక తల దించుకుంది. లక్ష్మి హరిత భుజంమీద చెయ్యి వేసింది. ‘‘పద కాఫీ తాగుదాం’’ అంటూ హరితని బలవంతంగా రెస్టారెంట్‌లోకి తీసుకుని వెళ్లింది.
వరుణ్, తనూ రెగ్యులర్‌గా కాఫీ తాగే హోటల్ అది.. విరక్తిగా నవ్వుకుంది హరిత. ఇప్పుడు కూడా అదే హోటల్లో తన జీవితం మలుపు తిరగబోతోందని ఆమెకి తెలియదు.
‘‘చెప్పు హరితా, ఎందుకలా వున్నావు?’’ ఆత్మీయత ధ్వనిస్తున్న గొంతుతో అంది లక్ష్మి.
హరితకెలా చెప్పాలో అర్థం కావడంలేదు. కానీ స్నేహితులమధ్య బిడియం మంచు ముక్కలా కరిగిపోతోంది.
‘‘్భయమో మరొకటో తెలియదు కానీ నీతో నేను మొదటినుండీ కొన్ని విషయాలు చెప్పకుండా దాచాను’’ అంటూ మొదలుపెట్టి తమ ఇంటి పరిస్థితి, తను పెరిగిన వాతావరణం, వరుణ్ పరిచయం, ప్రేమా, అతని మనస్తత్వం, తన ఆలోచనలు, తనకీ వరుణ్‌కీ మధ్యన వచ్చిన గొడవ, దాన్ని భరణి అవకాశంగా తీసుకోవడాన్ని గురించి చెప్పింది.
ఆమె చెప్పినదంతా నిశ్శబ్దంగా వింది లక్ష్మి.
‘‘ఇది మీ ఇంట్లోనే కాదు హరితా, చాలామంది ఇళ్ళలో జరిగేదే. మూఢ నమ్మకాలవల్ల, ఛాందస భావాలతో ఆడపిల్లలకి తగినంత స్వేచ్ఛని ఇవ్వకపోవడం, మగ పిల్లలకి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం చేస్తూ వుంటారు.. రెండూ తప్పే. ఇంట్లో సరైన ఆదరణ, ఆప్యాయత కరువై ప్రేమ రాహిత్యంతో ఆడపిల్లలు పాడవుతారు. మితిమీరిన స్వేచ్ఛవల్ల మగ పిల్లలలు పాడవుతారు. అలాంటి మితిమీరిన స్వేచ్ఛవల్ల భరణీకి ఆడ పిల్లలని ఒక ఆట వస్తువు అన్న అభిప్రాయం ఏర్పడి అంత చులకనగా మాట్లాడగలుగుతున్నాడు.’’
‘‘్భరణి కూడా వరుణ్ లాంటి సామాన్యమైన యువకుడే. ఐతే నాకే బాధా ఉండకపోను లక్ష్మీ. భరణి అలాంటి సామాన్యుడు కాదు. శక్తిమంతుడు, పలుకుబడి వున్నవాడు. అన్నింటినీ మించి తన మాటే నెగ్గాలన్న పంతం వున్నవాడు. అతడి స్వభావాన్ని గమనించి నేను దూరంగా వున్నానని తెలిసిందంటే అతడు వౌనంగా ఊరుకోడు. నామీద ఎలాగైనా కక్ష సాధించాలనుకుంటాడు. అదే ప్రస్తుతం నన్ను వేధిస్తున్న సమస్య. ప్రస్తుతం నాకే సపోర్టూ లేదు. ఒక్కదానే్న అతడ్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదు’’.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ