డైలీ సీరియల్

బంగారుకల - 37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాయా! నామ మాత్రంగా మనం బహ్మనీ సుల్తాన్‌ను సింహాసనంపై నిలిపాం. వారిలో వారు అంతఃకలహాలలో మునిగి ఉంటారని విజయనగర సామ్రాజ్యం వైపు కనె్నత్తి చూడరనీ భావించాం’’ తిమ్మరుసు విశే్లషించారు.
‘‘అవును అప్పాజీ! మరి ఈ పెనుమార్పేమిటి?’’ రాయలు అసహనంగా అడిగారు.
‘‘బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్, బీదర్, బీరారు సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నా వారిని చూస్తూ ఉండిపోయాం. కానీ గోల్కొండ రాజ్యం నుండి కులీకుతుబ్‌షా మన కొండవీడుపై దాడికి సిద్ధమయ్యాడు.’’
‘‘్ఫర్వాలేదు అప్పాజీ మన పాండురంగ సేనాపతి ఆ సంగతి చూడగలరని భావిస్తున్నాం.’’
‘‘రాయా! అదే నా యోచన కూడా’’
ఇరువురు ప్రశాంత మనస్కులై సమావేశ మందిరం నుండి బయటికి వస్తుంటే చాటుగా స్తంభం మాటున జరిగిన ఓ నీడ తిమ్మరుసు మంత్రి దృష్టిలో పడకపోలేదు. ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. నొసలు ముడిపడింది.
***
వీరేంద్రుడు, కంటకుడు మదిరాపానం చేస్తూ ఒళ్లు తెలియని ప్రేలాపన స్థితిలో ఉన్నారు.‘రాళ్లన్నీ ఒకచోట, రత్నాలన్నీ ఒకచోట’ అన్నట్లుగా వీళ్ళిద్దరిదీ ఒకే ఆలోచన. విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయాలని. ఒకే స్నేహం, కుటిల బుద్ధితో లాభం పొందటానికి.
‘‘ఆ ముసలి నక్కను తప్పిస్తేగాని మన పాచిక పారదు’’ వీరేంద్రుని మాటలు ముద్దముద్దగా ఉన్నాయి.
‘‘అది అంత సులభం కాదు వీరేంద్రా!తిమ్మరుసు మంత్రి రాయలవారికంటే రాజనీతి చతురుడు. ఆయనని తప్పించమంటే రాయలవారినే’’
‘‘హుష్ నోటి మీద వేలుంచి ఆపాడు వీరేంద్రుడు
‘‘జగన్నాథ! ఆ పని మనమెందుకు చేస్తాం. రాయలతోనే చేయిద్దాం’’ వీరేంద్రుడు కుటిలంగా అన్నాడు.
‘‘అసాధ్యం. తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాయలు తిమ్మరుసును వదులుకోడు’’ కంటకుని నిరాశాస్వరం.
‘‘జగన్నాథ! అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికే గదా ఈ వీరేంద్రుడున్నది ’’ మరోసారి మదిర సేవించాడు వీరేంద్రుడు.
‘‘మీ మాటలు నాకు బోధపడటం లేదు. వారిద్దరూ ఒకరికొకరు బహఃప్రాణాలు’’.
జగన్నాథ! బహఃప్రాణాలు. హ్హహ్హహ్హ! ఆ ప్రాణాలు పోతే పోలా’’.
‘‘ఆ!’’ నిర్ఘాంతపోయాడు కంటకుడు. భయపడ్డాడు కూడా!
‘‘మా నాయన గండమనాయకుడు వంటి నమ్మకమైన సేనాధికారులున్నంతవరకూ అది కుదరని పని’’ కంటకుడు పళ్ళు కొరికాడు. తనని కారాగారంలో వేసినప్పుడు ఏ సహాయం చేయని తండ్రి అంటే అతనికి చాలా కోపంగా ఉంది.
‘‘జగన్నాథ! నేను ఎన్నిసార్లు మహారాజుకు ఆ ముసలి మంత్రి మీద ఆరోపణలు చెప్పాను. ఉహూ వింటేనా. కానీ నాదగ్గర మరో బ్రహ్మాస్త్రం ఉంది’’ వీరేంద్రుడు కళ్లు పెద్దవి చేశాడు. బ్రహ్మాస్త్రం పేరు వింటూనే కంటకునిలో ఆసక్తి పెరిగింది.
‘‘ఏమిటది వీరేంద్రా! నీవు చాలా తెలివైన వాడివి. చెప్పు చెప్పు’’ ఆరాటపడ్డాడు.
‘‘ఆ! అది చెప్పేది కాదు జగన్నాథా! చేసి చూపించేది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మా గజపతుల వంశంలోంచే తెచ్చాము. మా దుర్గాలన్నీ స్వాధీనపర్చుకొని మాకింత బిచ్చం వేస్తాడా ఆ రాయలు’’ వీరేంద్రుని కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి.
కంటకునికేదో అర్థం అరుూ కానట్లుంది.
ఆరేళ్ళ తిరుమలరాయుడు పరుగు పరుగున వచ్చాడు. ‘‘మామయ్యా! మీరు నాకు కత్తియుద్ధం ఇంకా ఎప్పుడు నేర్పిస్తారు?’’
‘‘కాలం వచ్చేసింది నాయనా! జగన్నాథా! నేర్పిస్తాను. నువ్వు వెళ్లి ఆడుకో’’ వీరేంద్రుడు తిరుమల రాయని బుజ్జగించి పంపేశాడు.
‘‘చాలా పొద్దుపోయింది వీరేంద్రా! మేము వెళ్తాం’’
‘‘జగన్నాథ’’ కంటకునికి వీడ్కోలిచ్చి పంపేశాడు వీరేంద్రుడు.
తూలుతూ ఇటు తిరిగిన వీరేంద్రునికి కాళికలా నిప్పులు చెరిగే కళ్ళతో అన్నపూర్ణాదేవి కన్పించింది.
‘‘ఏమిటిది వీరేంద్రా! నీ ప్రవర్తన నాకేం నచ్చటంలేదు. చుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్లు’’.
నిందావాక్యాలకు అతడేమీ చలించలేదు. వీరేంద్రునికి కార్యసాధనే ముఖ్యం.
‘‘జగన్నాథ! చుట్టాన్ని కాబట్టే నీ గురించే నా ఆరాటమంతా’’ లేని ప్రేమ ఒలకబోశాడు.
‘‘నా గురించి నువ్వేం ఆరాటపడనక్కరలేదు. నా పుట్టింటి చుట్టానివని ప్రభువు ఆదరిస్తుంటే ఇంకా ఎన్నాళిక్కడ?’’ అన్నపూర్ణాదేవికి చాలా కోపంగా ఉంది.
‘‘జగన్నాథ! అంత కోపం వద్దమ్మా! మహారాజుకు ఎందరో భార్యలుండటం మామూలే! కానీ వీరగజపతి వంశంలో పుట్టిన నిన్ను అందరిలో కలపటమే’’ నసిగాడు.
‘‘అది మా స్వవిషయం. ఇందులో నీ ప్రమేయమవసరం లేదు’’ గిరుక్కున వెనుదిరిగింది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! నీ స్వవిషయమే! మా ఇంటి ఆడపడుచువైన నీ గురించి, నీ కొడుకు గురించి నువ్వు వద్దన్నా మాకు తాపత్రయమే!’’ నచ్చచెప్తూ రెచ్చగొడుతున్నాడు.
‘‘ఇప్పుడు నాకు, యువరాజుకి వచ్చిన లోటేం లేదు. ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం నాకు మనశ్శాంతి ఉండేట్లు లేదు’’ కుపిత స్వరంతో అంది అన్నపూర్ణాదేవి.
‘‘జగన్నాథ! మన యువరాజే రాజు కావాలని నా ఆశ’’.
‘‘నీ ఆశ అనకు. అది విజయనగర ప్రజల ఆశ. ప్రభువు కోరిక కూడా!’’

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి