డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఓకే, ఒక పని చేద్దాం. మనం పైకి వెళ్దాం పద. వెళ్లి షాపర్స్ స్టాప్ షోరూమ్‌లో చూద్దాం. తెల్ల చుడీదార్లో ఎవరైనా అమ్మాయి ఉందేమో వెదుకుదాం. అలాంటి అమ్మాయి అక్కడ కనిపిస్తే నీ అనుమానం తీరిపోతుంది కదా?’’ అన్నాము మేము.
‘‘షాపర్స్ స్టాప్‌కా? నేను రాను’’ భయపడుతున్నట్టుగా అన్నాడు భరణి.
మేమంతా నవ్వాము. ‘‘్భరణీ నువ్వింత పిరికివాడివనుకోలేదు’’ అన్నాము.
మేమలా ఆటపట్టించేసరికి భరణి సర్దుకున్నాడు.‘‘్భయమా? అలాంటిదేం లేదు. అసలు దెయ్యాలూ భూతాలూ ఉన్నాయని నేను నమ్మను. ఒకవేళ ఉన్నా కూడా అవి ననే్నం చేయలేవు. ఎందుకంటే నేను వాటికన్నా భయంకరమైనవాడ్ని కనుక. ఏదో నాకనిపించింది నేను చెప్పాను. మీరన్నట్టుగా అది భ్రమే కావచ్చు’’ అంటూ నవ్వాడు.
భరణి ఆ విషయాన్ని అలా తేలికగా తీసుకోవడంతో మామూలు కబుర్లలో పడిపోయాము మేము. తరువాత కొద్ది రోజులకి భరణి పేరన కాలేజీకి ఒక ఉత్తరం వచ్చింది. తెల్లరంగు కవరులో నల్లరంగు ఒక కాగితం.
దానిమీద తెల్లరంగు అక్షరాలతో ‘నీ అంతు చూస్తాను’ అని తెలుగులో ప్రింటు చేసి ఉంది. క్రింద చిన్న చిన్న అక్షరాలతో యువర్స్ లవింగ్లీ అని ఉంది. ఆ ఉత్తరాన్ని చూసి ఎవరు రాసి ఉంటారా అని తలలు బద్దలుకొట్టుకున్నాము మేము.
మా చర్చ అంతా అయిపోయాక భరణి నెమ్మదిగా చెప్పాడు. ‘‘సెల్ ఫోన్లూ, ఈమెయిళ్ళూ ఎన్నున్నా ఉత్తరాలు రాసే అలవాటు బ్రతికున్నపుడు సంధ్యకి ఉండేది. అంతేకాదు, నాకు తను రాసే ప్రతి ఉత్తరంలోనూ, ఈమెయిల్ క్రిందా, మెసేజ్ క్రిందా యువర్స్ లవింగ్లీ అని రాయడం సంధ్యకి అలవాటు’’ అని.
మేమందరం ఉలిక్కి పడ్డట్టుగా చూసాము భరణి మాటలకి. ‘‘నువ్వింకా మాల్ దగ్గర జరిగిన ఆ సంఘటనని మర్చిపోలేదా?’’ అన్నాం.
‘‘సందేహం లేదు. ఈ ఉత్తరాలు సంధ్య ఆత్మ రాసినవే’’ అన్నాడు భరణి మా మాటలని పట్టించుకోకుండా.
‘‘ఏమిటి నీ పిచ్చివాగుడు?’’ అన్నాము మేము కోపంగా.
‘‘పిచ్చివాగుడు కాదు. పచ్చి నిజం. ఆ రోజు నేను భ్రమపడ్డానన్నారు మీరు. నేను కూడా నిజమేనేమో అనుకున్నాను. కానీ ఆ రోజు నేను భ్రమపడలేదనడానికి సాక్ష్యంగా నాకు సంధ్య ఆత్మ మళ్లీ కనిపించింది. కాలేజీ హాస్టలు బిల్డింగ్‌మీదా, ఐమాక్స్ థియేటర్ దగ్గర షాపింగ్ మాల్‌లోనూ అచ్చం అపుడు కనిపించినట్టే దూరం నుంచి కనిపించి మాయమైంది’’.
ఆ మాటలకి మా ముఖాలు నెత్తురు లేనట్టుగా పాలిపోయాయి. అప్పటికీ మేము అతడి మాటలని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే సరిగ్గా మళ్లీ వారం తిరిగేసరికల్లా అతడికి అలాంటి ఉత్తరమే వచ్చింది. మేము కూడా భయపడుతుంటే, సరిగ్గా తరువాతి బుధవారం మళ్లీ ఉత్తరం వచ్చింది. ఇంక ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాం మేము. ఆ ఉత్తరాన్ని బాగా పరిశీలించాము. దానిమీద ఉన్న పోస్టలు ముద్ర అలుక్కుపోయినట్టుగా ఉంది. సరిగ్గా కనిపించేది కాదు ప్రతీసారి. అంతకన్నా మమ్మల్ని షాక్‌కి గురిచేసిన విషయమేమిటంటే పోస్టుమేన్‌కి ఆ కవరు చూపిస్తే దాన్ని తను తీసుకురాలేదని చెప్పాడు. మాకు గుండెలు దడదడలాడాయి.
ఎవరైనా ఆ కవరుని తీసుకొచ్చి మా కాలేజ్ లెటర్ బాక్స్ (ఇన్‌బాక్స్)లో వేస్తున్నారనేమో అన్న అనుమానం మాకు వచ్చింది. లెటర్ బాక్స్ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని స్టూడెంట్ రిప్రెసెంటేటివ్ దగ్గర ఉంటుంది. ఉదయం బాక్సు అతడే తెరిచి వచ్చిన ఉత్తరాలన్నీ తీసుకెళ్లి ఎవరి ఉత్తరాలు వాళ్లకి బట్వాడా చేస్తాడు. లెటర్ బాక్సు కాలేజీ గేటు దగ్గర ఉంటుంది. అక్కడ పగలంతా సెక్యూరిటీ గార్డు ఉంటాడు.
పోస్టుమేన్ కాకుండా ఆ లెటర్ బాక్సులో ఎవరైనా ఉత్తరాలు వేస్తున్నారేమోనని మేము అతడ్ని ప్రశ్నించేవాళ్ళం. ఎవరూ వేసేవారు కాదు. మంగళవారం రాత్రి ఒక మనిషిని పెట్టి ఆ లెటర్ బాక్సు దగ్గరకి ఎవరైనా వస్తున్నారేమో గమనించమన్నాం. ఎవరూ రాలేదు కానీ మర్నాడు మాత్రం భరణికి లెటర్ వచ్చింది! దాంతో మాకు కూడా సంధ్యే దెయ్యమై వచ్చి ఉత్తరాలు పోస్టు చేస్తోందన్న విషయం అర్థమైంది.
అంతేకాదు, పూర్వం సంధ్య వాడిన సెల్ నెంబరు నుంచి భరణికి అర్థరాత్రుళ్ళు బ్లాంక్ కాల్స్ వచ్చేవి. కస్టమర్ సర్వీస్‌కి ఫోన్ చేస్తే ఆ నెంబరు గత కొద్దికాలంగా వాడకంలో లేకపోవడంతో వేరే వాళ్ళకి అలాట్ చేసేమని చెప్పేరు. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే తామెవ్వరికీ కాల్స్ చేయలేదని చెప్పేవారు.
ఒకసారి భరణి హరితతో కలిసి పబ్‌కి వెళ్లినపుడు అతడికి పేపర్ నేప్‌కిన్స్‌మీద ‘నిన్ను వదలను’ అని రక్తంతో రాసిన అక్షరాలూ, క్రిందన ‘యువర్స్ లవింగ్లీ’ అన్న అక్షరాలూ కనిపించాయి. అతడు కంగారుపడి హరితకి చూపించాడు. ఆశ్చర్యకరంగా ఆ నేప్కిన్‌మీద హరితకేమీ కనిపించలేదు. ఇలాంటి అనుభవాలు భరణిని సంధ్య ఆత్మ వెంటాడుతోందని మాకు రూఢీగా అర్థమైంది.
వింటున్న పాణికి తన భార్య అంజలి తరచుగా చూసే హాలీవుడ్ హర్రర్ సినిమాలు గుర్తుకువచ్చాయి. చనిపోయిన వ్యక్తులు డ్రాకులా (రక్తపిశాచి)గా మారి శత్రువులని మెడమీద కొరికి రక్తం పీల్చి చంపేస్తూ వుంటాయి.
‘‘నువ్వన్నట్టుగా సంధ్య ఆత్మ భరణికి కనిపిస్తోందనే అనుకుందాం. కానీ అసలు సంధ్య ఆత్మే భరణిని చంపిందని నువ్వెలా అనుకుంటున్నావు? భరణి ఆ రోజు గెస్ట్‌హౌస్‌కి వెళ్ళడానికీ, సంధ్య ఆత్మకీ ఏమైనా సంబంధం ఉందా?’’ తన ప్రశ్న తనకే అసంబద్ధంగా అనిపించింది పాణికి. కానీ సూర్య చెప్పింది నిజమని నమ్మడం మినహా తనకి మరో ఆప్షన్ లేదు ప్రస్తుతం. అతడు చెబుతున్నదాన్ని నమ్మని పక్షంలో అతడ్ని విచారించడం అనవసరం.
‘‘అప్పటివరకూ భరణికి సంధ్య ఆత్మ కనిపించిన ప్రదేశాలు షాపర్స్ స్టాప్, ఐమాక్స్ థియేటర్, కాలేజీ హాస్టల్, పబ్ మొదలైనవి.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ