డైలీ సీరియల్

అన్వేషణ -34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి ఏడు గంటలు కావస్తూంటే నారాయణ లేచాడు సీటులోంచి. అతడి బ్రీఫ్‌కేసు తీసుకుని రాగిణి కూడా నడిచింది. ఇద్దరూ కారులో రాగిణి ఇంటికి వచ్చారు. అల్లుడుగారువచ్చినంత హడావుడి చేసింది రాగిణి తల్లి.
‘‘ఏమిటి అదోలా మూడీగా ఉన్నారు?’’ అనడిగింది మంచినీళ్లు తెచ్చి ఇస్తూ నారాయణను రాగిణి అడిగింది.
నారాయణ ఏమీ మాట్లాడలేదు. రహీం చెప్పిన విషయం రాగిణికి చెప్పాలా వద్దా అని కొంతసేపు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు అంతా విన్న తర్వాత ఆమె చిన్నగా నవ్వింది.
‘‘అంటే మీకో కొడుకొస్తున్నాడన్నమాట?!’’ అన్నది నవ్వుతూనే.
నారాయణ విసుక్కున్నాడు. అసహనంగా ముఖం పెట్టాడు. తర్వాత అన్నాడు- ‘‘నేనే ఎందుకవ్వాలి?.. థామస్ కావచ్చు.. కనకారావు కావచ్చు..’’ అని.
‘‘అవును.. ఊరికే అన్నానులెండి.. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు?’’ అడిగిందామె.
వాడిని లేపెయ్యాలని రహీం చెప్పిన విషయం చెప్పలేదామెకి. ఓ రెండు గంటలు అక్కడ ఉండి ఇంటికి వచ్చేశాడు నారాయణ. మామూలుగా అయితే అక్కడే భోజనం చేసి, రాగిణితో ఎంజాయ్ చేసి ఏ పదకొండు గంటలకో ఇంటికి వచ్చేవాడు.
భర్త ఎప్పుడు ఇంటికి వచ్చినా ఈమధ్య భార్య వీరాయమ్మ పట్టించుకోవడం మానేసింది. దానిక్కారణం ఆమెకు ఇటీవలకాలంలో బాగా వళ్లు చేసింది. దానికితోడు ఆస్త్మా ఒకటి వచ్చిపడింది. దేనిమీదా ఆమెకు ధ్యాస ఉండడంలేదు. బిపి ఇంతకుముందు ఉండనే ఉంది. ఎప్పుడూ మందు మింగడంతో ఆమెకు బాగా విసుగొచ్చేస్తోంది.
భర్త నారాయణకు బయట వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమెకు చాలాకాలం క్రిందటే తెలిసింది. మొదట్లో గొడవ చేసేది. క్రమేణా అలవాటైపోయింది. ఇపుడు రాగిణి గురించి కూడా ఆమెకు బాగా తెలుసు. తను పనికిరాకుండా పోయినందుకు ఆయన ఎలా ఏడిస్తే ఏమిటిలే అనుకుంటోందిప్పుడు. కానీ చాలామంది ఆడవాళ్లు అలా సరిపెట్టుకోలేరు. అయితే వీరాయమ్మది అదో విచిత్రమైన తత్వం!
ఇంటికొచ్చాడన్నమాటేగానీ నారాయణకి నిద్రపట్టడంలేదు. రహీం చెప్పిన విషయాలే పదే పదే బుర్రలో గింగుర్లాడుతున్నాయి. ముప్ఫయ్యేళ్లక్రిందట జరిగిన సంఘటన ఇలా తనను ఇప్పుడు వెంటాడడం ఏమిటో అతడికి అర్థం కావడంలేదు. ఎన్ని రేప్‌లు, మర్డర్లు కాలగర్భంలో కలిసిపోవడం లేదు గనుక!
ఆ తర్వాత కూడా తాము ఏదో ఒక ఛండాలపు పని చేయకుండా ఉన్నారా?! అనుకున్నాడు. ఓ బాలికనుఅనుభవించిన సంఘటన, దంపతులను బెదిరించి మహిళను అనుభవించినసంఘటన, వివాహితను వేధించి, వేధించి లొంగదీసుకున్న సంఘటన.. గతంలో తాము చేసిన ఘనకార్యాలు జ్ఞాపకం వున్నకొన్ని కళ్లల్లో మెదిలాయి నారాయణకి. వాటికెలాంటి ఇబ్బందులూ ఇంతవరకూ తమకు కలుగలేదు. కానీ ఆ పిచ్చిదానిపై తాము జరిపిన అత్యాచారం ఇపుడు ఇలా తమను వెంటాడడం అతడికి చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.
‘రహీం అన్నట్లు వాడిని లేపెయ్యకపోతే తన పరువు గంగలో కలిసిపోవడం ఖాయం.. ఒకవేళ తాను వాడి తండ్రినని రుజువయినా ప్రమాదమే.. ఒకవేళ అలా కాకపోతే వాడు తమను ఏదో కారణంగా బ్లాక్‌మెయిల్ చెయ్యడని గ్యారంటీ ఏమిటి?.. థామస్‌గాడితో మాట్లాడి వాడిని లేపెయ్యాలి.. ఈ కనకారావుగాడు ఎక్కడ చచ్చాడో.. బేవారస్‌గాడు..’ రాత్రంత్రా నారాయణ ఆలోచిస్తూనే ఉన్నాడు కంటిమీద కునుకు లేకుండా.
****
కవితా రియల్ ఎస్టేట్స్ ఆఫీసుకు ఎదురుగా రోడ్డు డివైడర్‌కి అవతలి ప్రక్కన ఉన్న హాల్లో కూర్చున్నారు కొండబాబు, అనిరుధ్. ఉదయం పదకొండు గంటల సమయంలో వాళ్లిద్దరూ అక్కడికొచ్చారు. నారాయణ విషయం ఎలా డీల్ చెయ్యాలా అని వాళ్లు మొన్నటినుంచీ ఆలోచిస్తూనే ఉన్నారు. ఏ దారీ కనిపించడంలేదు. కొండబాబు మనస్సులో ఏదో మెదిలేసరికి అనిరుధ్‌ని తీసుకుని అక్కడికొచ్చాడు.
‘‘అదే వాడి రియల్ ఎస్టేట్స్ ఆఫీసు. ఆఫ్ట్రాల్ ఒక రిక్షా తొక్కుకునే వాడు ఈ స్థాయికి ఎలా ఎదిగిపోయాడో తలచుకుంటే నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుందిరా.. కొన్ని కొన్ని భలే నవ్వొస్తాయి సుమా! ఏడాది క్రిందట ఓ డొక్కు సైకిలుమీద అవస్థపడుతూ వెళ్ళేవాడు ఈ రోజు టూ వీలర్‌మీద రయ్‌మని తిరుగుతున్నాడు. అందుకు ఉదాహరణ మన సందు చివరనున్న పొట్టి శీనుగాడేరా..’’ కొండబాబు అన్నాడు టీ తాగుతూ అనిరుధ్‌తో.
‘‘అవును కదా!.. మనం అలా ఎందుకు ఎదగలేకపోయాంరా?!’’’ అనిరుధ్ అడిగాడు.
‘‘మనకి ఆ సుడి లేదురా.. అంతే..’’
‘‘సరే! ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి?.. నారాయణ వ్యవహారం ఎలా?’’
‘‘వాడి ఆఫీసులో ఎవడినేనా పట్టుకోవాలి..’’
‘‘పట్టుకుంటే?!’’
పట్టుకుంటే.. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నాను.. ఒకదారి ఉంది..’’
‘‘ఏమిటది?’’
‘‘నా మిసెస్ సావిత్రికి దూరపు బంధువొకామె ఈ ఆఫీసులోనే పనిచేస్తోందని నిన్న రాత్రి సావిత్రి చెప్పింది.. ఆమె మీ పనికి ఉపయోగపడుతుందేమో చూడమని కూడా సావిత్రి చెప్పింది.. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలి.. ఇక్కడ ఆమె ఉద్యోగం ఏమిటో..’’ కొండబాబు చెప్పాడు రియల్ ఎస్టేట్ ఆఫీసుకేసే తదేకంగా చూస్తూ.
ఇంతలో ఆ ఆఫీసునుంచి ఫ్లాస్కు పట్టుకుని ఒకతను బయటికి రావడంతో కొండబాబు వాడిని గమనించాడు.
‘‘ఆఫీసు అటెండరు కాబోలు వస్తున్నాడు.. వీడిని మాటల్లో దింపుతాం...’’ అన్నాడు స్వగతంలా కొండబాబు.
వాడు డివైడర్ ఎక్కి దాటి హోటల్‌కొచ్చాడు. ‘్ఫ్లస్కు నింపరా.. తిరగలేక చస్తున్నాను..’ అన్నాడు టీ మాస్టర్‌కి ప్లాస్కు అందిస్తూ.
‘‘ఏరా పెద్ద ఫ్లాసు కొనుక్కోవచ్చుకదరా పదిసార్లు తిరక్కపోతే..’’ టీ మాస్టర్ అన్నాడు.
‘‘అమ్మో ఏవన్నా ఉందా? కొంటే మేం టీలు తెగ తాగేత్తామని బాసుకన్నా బాసు మేడం ఒప్పుకోదు..’’ అతను అన్నాడు
‘‘మీ రాగిణీ మేడమ్మా.. మహా పిసినార్రాబాబూ...’’ సప్లయిర్ అన్నాడు.
‘‘ఆమెగారు ఎంత చెబితే అంత మా బాసుకి.. ’’ అంటూ అతడు కూర్చున్నాడు అనిరుధ్, కొండబాబు కూర్చున్న టేబుల్ దగ్గర.
‘‘రియల్ ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నావా?’’ అతడిని మాట కలుపుతూ అడిగాడు కొండబాబు.
‘‘అవునండి...’’
‘‘ఏం చేస్తున్నావ్?’’
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842