డైలీ సీరియల్

యువర్స్ లవ్వింగ్లీ... 40

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రాకులా మెడలు కొరకడం, సడెన్‌గా స్మశానంలో నేలమీదనుంచి చేతులు మొదలవడం వంటివి. నిజంగా ఒక దెయ్యం మనిషిని చంపాలనుకుంటే మెడ పట్టుకుని పైకెత్తడాలూ, విసిరి గోడకేసి కొట్టడాలు ఏమీ అక్కర్లేదు. దెయ్యం కనపడగానే మనిషి భయంతో గుండె ఆగి చచ్చిపోతాడు. తెలుగు సినిమాల్లో డైలాగు లాగా దెయ్యం ఒక మనిషిని చంపాలనుకుంటే ‘కత్తులతో కదా- కంటిచూపుతో’ చంపెయ్యగలదు!
ఆమె మాటలు విని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు పాణి. అతడి మెదడులో ఏదో మెరుపు మెరిసినట్టైంది. ‘్థంక్స్ అంజలీ.. దెయ్యాలతో నీకున్న పరిచయం నాకిలా ఉపయోగపడుతుందనుకోలేదు. చాలా మంచి సమాచారం ఇచ్చావు’ అన్నాడు మెరిసేకళ్ళతో.
‘‘దెయ్యాలతో పరిచయమా?’’ కోపంగా చూసింది అంజలి.
‘‘అదే.. దెయ్యాల సినిమాలతో’’ సరిదిద్దాడు పాణి. ‘‘నువ్వు ఇచ్చిన సమాచారం నాకు బాగా ఉపయోగపడుతుంది ఈ కేసులో. మనం త్వరలోనే అరకు లోయ వెళ్ళబోతున్నాం. నువ్వు సామాన్లు సర్దుకోవచ్చు’’ ఉత్సాహంగా అని ఫోన్లో నెంబర్లు డయల్ చేయసాగాడు పాణి.
****
‘‘హలో డాక్టర్ పరమేశ్వర్ గారేనా?’’
‘‘నమస్తే డిటెక్టివ్ పాణీ. చాలా రోజులైంది మాట్లాడి, బాగున్నారా?’’ పాణి నెంబరు గుర్తుపట్టి అవతలనుంచి అన్నాడు డాక్టర్ పరమేశ్వర్. గతంలో కొన్ని కేసుల విషయంలో ఆయనతోపాటూ పాణి పని చేశాడు. ఆ స్నేహంతోనే ఆయనకి ఫోన్ చేశాడు.
‘‘డాక్టర్‌గారూ, బాగున్నారా? ఒక మెడికల్ కేసుకి సంబంధించిన చిన్న సందేహం ఉంది. తీరుస్తారేమోనని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు పాణి.
‘‘చాలా సంతోషం. ఈ రకంగానైనా నేను గుర్తుకు వచ్చాను. ప్రస్తుతం ఏ కేసు పరిశోధిస్తున్నారు’’ నవ్వుతూ అన్నాడాయన. పాణి కేసులూ, ఆ కేసులని అతడు పరిశోధించే విధమూ అతడితో కలిసి పనిచేసిన అందరికీ ఆసక్తికరంగా వుంటాయి.
హైదరాబాద్‌కి చెందిన ఒక పాతికేళ్ళ యువకుడు మర్డర్ కేసు’
‘‘ఓ, హైదరాబాద్లోనే ఉన్నారా? ఇంత దూరం వచ్చి మరి మా రాజమండ్రి రాకుండా వెళ్లిపోతారా?’’ అన్నాడాయన. ఆయన స్వంత ఊరు రాజమండ్రి. ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటున్నాడు.
పక్కనే కూర్చున్న అంజలి వంక క్రీగంట చూస్తూ పాణి ‘‘తప్పకుండా వస్తామండీ. నాతో పాటూ నా భార్య అంజలి కూడా వచ్చింది. మాకు మీరు రాజమండ్రి గోదావరి తీరం, ధవళేశ్వరం ఆనకట్టా, పట్టిసీమ, అంతర్వేది చూడడానికి ఏర్పాటుచెయ్యాలి’’.
అతడి మాటలని విని ఒకసారి మూతి తిప్పి అక్కడినుంచి లేచింది అంజలి. ఆమె మూతి తిప్పే లాంగ్వేజీని చదవడం వచ్చు పాణికి. దాని అర్థం ‘ముందు అరకు లోయ సంగతి చూడండి. అంతర్వేది సంగతి తర్వాత ఆలోచిద్దాం’ అని. పాణి సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు.
‘‘తప్పకుండా చేస్తాను. ఇంతకీ ననే్నదో అడగాలన్నారు ఏమిటి?’’ అన్నాడాయన ఆసక్తిగా.
పాణి ఆయనకి భరణి కేసుని సూక్ష్మంగా చెప్పి అన్నాడు. ‘‘మనుషుల్లో ప్రతి ఒక్కరికీ ఏవేవో భయాలుంటాయి. జంతువుల గురించీ, వ్యాధుల గురించీ, ప్రతికూల పరిస్థితుల గురించీ, దెయ్యాల గురించీ ఏదో రకంగా నిరంతరం మనుషులు భయపడుతూనే ఉంటారు. అయితే విపరీతమైన భయం మనిషిని మృత్యుముఖంలోకి నెట్టే అవకాశం ఉందా? భయంతో నా గుండె ఆగినంత పనైంది అని చాలామంది అంటూ ఉంటారు. నిజంగా వైద్య పరంగా భయంవల్ల గుండె ఆగి మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయా?’*’
‘‘్భయం మానసికం. మరణం అన్నది శారీరకం. అయినా సరే రెండింటికీ సంబంధం ఉంది. హార్వర్డ్‌కి చెందిన ప్రముఖ సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం మరణించిన స్థితికి మనిషికి తీసుకువెళ్ళేది సహానుభూత నాడీ వ్యవస్థ వచ్చే మార్పులే.
ఒక మనిషి లోతైన భయాన్ని అనుభవిస్తూ తన గుండె ఆగిపోతుందేమోనని భయపడేలాంటి స్థితిలో అతడి శారీరక స్థితిలో కొన్ని నిర్దిష్టమైన మార్పులు సంభవిస్తాయి. భయం అన్న మానసిక స్థితికి శారీరక ప్రతిస్పందన అది. దానే్న సైకాలజిస్టులు ఫైట్ ఆర్ ఫ్లైట్ స్థితిగా వ్యవహరిస్తారు.
ఈ స్థితి మనిషి కండరాల్లోకి ఉప్పెనలా శక్తిని నింపడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల మనిషి ఊపిరి పీల్చుకునే వేగం విపరీతంగా పెరుగుతుంది. అడ్రినలిన్ రక్తంలోకి వేగంగా పంప్ చేయబడుతుంది. ఈ రియాక్షన్‌వల్ల రక్తనాళాలు గట్టిగా బిగుసుకుని గుండె నుండి శరీర భాగాలకి చేరాల్సిన ఆక్సిజన్‌ని చేరనీయకుండా చేస్తాయి.
సాధారణంగా భయం తగ్గగానే శరీరం మామూలు స్థితికి వస్తుంది. గుండె ఆగినంత పనవ్వడం అంటే ఇదే. కానీ అనుభవించే భయం విపరీతమైనప్పుడు మాత్రం అడ్రినలిన్ కెమికల్ ఒక కుదుపులా గుండెని చేరుకుని మనిషిని వెంటనే మరణం వైపు నెట్టేస్తుంది. అధిక మొత్తంలో ‘కొకైన్’ గుండెకి చేరినంత ప్రమాదం ఇది. అంతేగాక, భయంవల్ల శరీరం అనుభవించే అధిక స్థాయి ఒత్తిడి కూడా ఒకరకంగా మరణానికి కారణవౌతుంది.
భయం, అధిక భావోద్రేకం, అధికమైన సంతోషం, కోపం కూడా మనిషిని ఈ స్థితికి నెట్టేస్తాయి. ఈ రకంగా సంభవించే మరణాన్ని హఠాన్మరణం అంటారు. సాధారణంగా వైద్యులు దీన్ని సహజ మరణంగానే పరిగణిస్తారు’’.
పాణికి భరణి పోస్టుమార్టమ్ రిపోర్టు గుర్తుకు వచ్చింది. ‘‘చాలా థాంక్స్ పరమేశ్వర్‌గారూ. మీ ఆహ్వానానికి కూడా కృతజ్ఞతలు. నేను రాజమండ్రి వచ్చేముందర మీకు ఫోన్ చేస్తానుర’’ అన్నాడు పాణి ఫోన్ పెట్టేస్తూ.
***
‘‘రవీంద్రగారూ, భరణిని చంపిందెవరో తెలిసింది’’ అన్నాడు పాణి.
‘‘అవునా? ఇంత తొందరగానా?’’ ఆశ్చర్యపోతూ అన్నాడు రవీంద్ర ‘‘ఎవరూ?’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ