డైలీ సీరియల్

అన్వేషణ -45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి బక్కపల్చగా ఉంటాడు. కళ్లు లోతుకుపోయి ఉంటాయి. కానీ తీక్షణంగా ఉంటాయి. కాస్త ఎర్రగానూ ఉంటాయి. ముఖం ఎప్పుడూ సీరియస్‌గా ఉంటుంది. జుట్టు కొంత నెరిసి ఉంటుంది. దానికి ఎప్పుడూ తైల సంస్కారం లేదు. దువ్వడం అంటూ కూడా లేదు. వాడెప్పుడూ కాన్వాస్ బూట్లే వేస్తాడు. చేతులకి వాచీలు, ఉంగరాలు వగైరా ఏమీ ఉండవు. మనిషి ఎంత బక్కగా వున్నా మోటు పనులు బాగానే చేస్తాడు.
వీళ్లిద్దర్నీ వెతుక్కుంటూ బయల్దేరిన అనిరుధ్, కొండబాబు ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దిగారు విశాఖపట్నం స్టేషన్‌లో. అక్కడనుంచి జగదాంబా సెంటర్‌కొచ్చి ఒక లాడ్జిలో దిగారు. అది స్టార్ హోటల్ కాకపోయినా అలాంటిదే. ‘‘ఇంత పెద్ద లాడ్జి ఎందుకురా’’ అని కొండబాబు అన్నా అనిరుధ్ వినిపించుకోలేదు.
రూములో ఫ్రెష్షయి భోజనం చేయడానికి బయల్దేరారు. మధ్యలో సెల్‌నెట్‌వర్క్ ఉంటే వెళ్లి థామస్ నెంబరు వున్న కాగితం చూపించి అడ్రస్ చెప్పగలరా అని అడిగాడు కొండబాబు.
అది తమ నెట్‌వర్కు కాదని, ఫలానా చోటకి వెళ్లి కనుక్కోమని చెప్పిందామె. లంచ్ చేసి వచ్చాక ఆమె చెప్పిన నెట్‌వర్క్‌కి వెళ్లారిద్దరూ. అక్కడ నేరుగా అడ్రెస్ అడిగితే చెబుతారా అన్న సంశయం వచ్చింది కొండబాబుకి. లోపల కుర్చీల్లో కంప్లయింట్‌లు, తదితర పనులమీద వచ్చిన వారు చాలామందే కూర్చొని ఉన్నారు.
క్షణం సేపు ఏం చేద్దామా అని కొండబాబు ఆలోచించి నెమ్మదిగా అక్కడున్న సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్లాడు. అతడిని మాటల్లో పెట్టాడు. తర్వాత అసలు విషయానికి వచ్చాడు.
‘‘గురూ! ఈ అడ్రస్ కావాలి మాకు. ప్లీజ్..’’ అన్నాడు.
అలా వేరేవాళ్లకి అడ్రస్‌లు ఇవ్వడం కుదరదు అన్నాడు సెక్యూరిటీ గార్డు.
‘‘అలాక్కాదు గురూ.. మాకు చాలా అవసరం.. అతడితో పనుంది.. అతడు ఫోను లిఫ్ట్ చేయడం లేదు.. అందుకే అడ్రస్ అడిగేది.. నీకేం కావాలో అడుగు.. ఇస్తాం.. మాకు అడ్రస్ సంపాదించి పెట్టు..’’ చెప్పాడు కొండబాబు. ఆ ఇద్దర్నీ చూస్తూ వౌనంగా ఉన్నాడు అనిరుధ్ అలాంటి పనులు తనకి చేతకావన్న ఉద్దేశ్యంతో. కొండబాబు ఏంకావాలో అడుగు అనగానే సెక్యూరిటీ గార్డు కాస్త మెత్తబడ్డాడు.
‘‘నాలుగైదు సార్లు ఫోన్ చెయ్యకపోయారా?’’’ అన్నాడు సెక్యూరిటీ గార్డు.
‘‘చేశాం.. గురూ.. వాడు ఫోను ఎత్తడం లేదు.. వేరే ఫోను నుంచీ చేశాం.. అదీ ఎత్తడం లేదు.. వాడికి అర్థమైంది మేమే చేస్తున్నాం... అందుకే ఇంటికైనా వెళదాం అని మా ప్రయత్నం.. ప్లీజ్ మేం అడిగితే కౌంటర్‌లో అడ్రస్ ఇవ్వకపోవచ్చు.. నువ్వు తీసుకుని ఇవ్వు గురూ.. నీకేం కావాలో చెప్పు ఇస్తాం..’’ అబద్ధాన్ని అందంగా చెప్పి బ్రతిమిలాడుతున్నట్లు అన్నాడు కొండబాబు.
‘ఎంతిస్తారు?’’ అనడిగాడు నిర్మొహమాటంగా.
‘‘నువ్వే చెప్పు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘ఓ రెండు వేలు ఇస్తాం..’’ అని కొండబాబు సెక్యూరిటీ గార్డు ముఖంలోకి చూశాడు ఏమంటాడోనని.
అతడి ముఖం ప్రసన్నంగా అయినట్లు గుర్తించాడు. ఏమంటావ్ అన్నట్లు అతడి ముఖంలోకి చూశాడు అనిరుధ్.
‘‘లేటవుద్ది.. కూర్చోండి..’’ అన్నాడు కొండబాబు చేతిలోంచి ఫోన్ నెంబరు కాగితం అందుకుంటూ.‘‘్ఫర్వాలేదు..’’ అనిరుధ్ అన్నాడు.
‘‘ఏదన్నా పనుంటే చూసుకురండి.. ఈలోగా చూస్తాను.. కౌంటర్ చాలా బిజీగా ఉంది..’’ చెప్పాడు సెక్యూరిటీ గార్డు.
‘‘అలాగే..’’ అని చెప్పి ఇద్దరూ అక్కడనుంచి బయటికి వచ్చేశారు.
‘‘ఓ గంట పోయాక వద్దాం.. వాడన్నట్లు లోపల బిజీగానే ఉంది కదా!’’ అనిరుధ్ చెప్పాడు.
అవునన్నట్లు తలూపాడు కొండబాబు. ఇద్దరూ లాడ్జికొచ్చారు. కొండబాబు రిలాక్స్‌గా మంచంమీద వాలిపోయాడు. అనిరుధ్ కుర్చీలోనే రిలాక్స్‌గా కూర్చుని హిమజకి ఫోన్ చేశాడు.
‘‘మేం ఎక్కడున్నామో తెలుసా.. నా స్టుపిడ్ డాడీ వేటలో వైజాగ్‌లో..’’ అన్నాడు, ఆమె ప్రశ్న కోసం ఎదురుచూడకుండా.
‘‘ఓ.. రెండు వికెట్స్ ఔటయ్యాయిగా.. ఇక మూడో వికెట్ కోసం విశాఖ వెళ్ళారా.. నువ్వూ కొండబాబును..’’ అడిగిందామె.
‘‘అంతేగా మరి!.. ఏమిటి విశేషాలు..’’
‘‘నేనూ వచ్చెయ్యనా? విశాఖలో రుషికొండ బీచ్‌లో.. ఏరాడకొండలూ... భీమిలీ బీచ్.. బావుంటాయిట.. నేనోసారి వెళ్లినపుడు ఆర్కె బీచ్‌కి మాత్రం వెళ్లాను...’’
‘‘ఈ రోజు బయల్దేరి వచ్చేస్తావా?..’’
‘‘అంత ఇమీడియెట్‌గానా? సెలవు చూసుకోవాలి.. రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలి.. ఇవన్నీ కనీసం టూ త్రీ డేస్ పడతాయి అనిరూదూ బాబూ..’’ గోముగా చెప్పిందామె.
‘‘్ఫర్వాలేదు.. అప్పుడేనా.. ఇక్కడ ఎలా లేదన్నా వారం పైనే ఉండాల్సి వస్తుంది.. ఏమో అంతకన్నా ఎక్కువ రోజులు కూడా పట్టేట్టుంది..’’ అన్నాడు అనిరుధ్.
‘‘్ఫర్వాలేదురా.. వస్తానంటే రమ్మను.. పనిలో పని ఓ రెండు రోజులు ఎంజాయ్ చేద్దాం..’’ కొండబాబు అన్నాడు కళ్లు మూసుకునే.
హిమజతోనే అనిరుధ్ మాట్లాడుతున్నాడని అతనికి అర్థమయ్యింది.
‘‘వింటున్నావా? కొండలు కూడా రమ్మంటున్నాడు..’’ చెప్పాడు అనిరుధ్.
‘‘ఓకె! ఐ విల్ ట్రై.. టికెట్ దొరికితే వచ్చేస్తాను..’’ చెప్పిందామె. తర్వాత ఓ అర నిముషం మాట్లాడి ఫోన్ పెట్టేసింది.
ఓ రెండు గంటలు పోయాక ఇద్దరూ బయల్దేరి సెల్ నెట్‌వర్క్ సెంటర్‌కి వెళ్లారు.. అప్పటికే సెక్యూరిటీ గార్డు వీళ్లకోసం అన్నట్లు ఎదురుచూస్తున్నాడు.
వీళ్లు వెళ్లగానే రహస్యంగా కొండబాబుని, అనిరుధ్‌నీ ప్రక్కకు తీసుకువెళ్లి థామస్ అడ్రస్ రాసి ఉన్న కాగితం అందించాడు.. అన్న ప్రకారం అనిరుధ్ ఇస్తానన్న డబ్బు తీసి ఇచ్చాడు.. వాడు మర్యాదగా సెల్యూట్ చేసి ‘ఏమన్నా అవసరం ఉంటే రండిసార్’ అన్నాడు. సరే అన్నట్లు తలూపి ఇద్దరూ లాడ్జికి వచ్చేశారు.
ఇంటి అడ్రస్ సంపాదించా సరే.. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్లి థామస్ అనేవాడిని కలుసుకోవడం అనేది జరిగే పని కాదు. కలవాల్సిన అవసరం లేదు కూడా. లేకపోతే మనిషి ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ హోదాలో ఉన్నాడో తెలుసుకునేందుకు మాత్రం ఆ అడ్రస్ ఉపయోగపడుతుంది. ఆ మాటే చెప్పాడు అనిరుధ్‌తో కొండబాబు.
‘‘అవునురా! నువ్వన్నది నిజమే!.. మనం వాడి ఇంటికి వెళ్లాల్సిన పనిలేదు.. కాకపోతే నువ్వన్నట్లు వాడి హోదా తెలుసుకోవచ్చు.. అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు..’’ అనిరుధ్ చెప్పాడు.
‘‘మరో పని కూడా చెయ్యొచ్చురా.. ఏదో పేరు చెప్పి ఎవడో గన్నాయ్‌గాడు పంపించాడనీ, ఇక్కడేదో పనుందని, మిమ్మల్ని కలవమన్నాడని.. గ్యాస్ కొట్టి వాడితో మాట్లాడవచ్చు... ఎక్కడ కలవమంటాడో తెలుసుకోవచ్చు.. అప్పుడేం చేయ్యాలో ఆలోచించొచ్చు..’’ మరో ఉపాయం చెప్పాడు కొండబాబు.
‘‘ముందు వాడి ఇల్లు చూద్దాం.. తర్వాత నువ్వు చెప్పిన రెండో పాయింట్ ట్రై చేద్దాం..’’ అనిరుధ్ అన్నాడు.
సాయంత్రం నాలుగు గంటలు కావస్తూన్న సమయంలో అనిరుధ్ బట్టలు మార్చుకుని కొండబాబుకేసి చూశాడు. అతడు ఇంకా లుంగీతో మంచంమీద దొర్లుతున్నాడు.
- ఇంకా ఉంది

సర్వజిత్ 9010196842