డైలీ సీరియల్

అన్వేషణ -59

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇతను..’’ అని అనిరుధ్ అంటూండగానే..’’ కొండబాబుగారు.. అని నవ్వుతూ పూర్తిచేసింది హిమజ. కొండబాబు భార్య సావిత్రిని పరిచయం చేశాడు.
‘‘ఏదో సినిమాలో పాటలా వసంతకాలం రాకుండానే తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు పెళ్లికాకుండానే అత్తారింటికి వచ్చేశాను..’’ అన్నది నవ్వుతూ హిమజ.
‘‘్ఛఛ! అదేం లేదు. కోయిల ఎప్పుడూ కూస్తుంటేనే ఏటెల్లకాలం వసంతకాలంలా ఉంటుంది..’’ అన్నది సావిత్రి.
‘‘అరె! మిమ్మల్ని చూడగానే మా ఆవిడకి కూడా కవిత్వం వచ్చస్తోందండీ..’’ అని కొండబాబు నవ్వేశాడు.
‘‘పోరా! నీకంటే మా చెల్లాయికి ఈస్తటిక్ సెన్స్ ఎక్కువ..’’ అన్నాడు అనిరుధ్.
‘‘ఒరే కొండలూ.. అందరూ ఇక్కడే భోజనాలు..’’ అమ్మమ్మ అన్నది.
‘‘కాదు అమ్మమ్మా.. మా చెల్లాయి వచ్చిన సందర్భంగా ఈ రోజు మా ఇంట్లోనే భోజనాలు.. నువ్వూ అక్కడికే వచ్చెసెయ్..’’ కొండబాబు చెప్పాడు.
‘‘అవును బామ్మా.. నువ్వు ఏం అవస్థపడతావ్.. మా ఇంటికే వచ్చెయ్..’’ చెప్పింది సావిత్రి.
అలా ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది.. ఇంటికి ఎంతో కళ వచ్చినంత సంబరపడింది అమ్మమ్మ. తొందరలో ఆ మూడు ముళ్ళూ మనవడి చేత వేయించేస్తే బాగుంటుంది ఆమె ఆలోచిస్తోంది.
‘‘ఒరే అనిరుధ్.. ఆరు గంటలు కావస్తూంది.. ఈ రోజు డాక్టర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లాలి మనం..’’ గుర్తుచేశాడు కొండబాబు. ఆ మాటకి అనిరుధ్ మనస్సు గంభీరంగా మారిపోయింది.
‘‘ఏదైనా కానీ నువ్వు బాగా ఇదిగా ఫీలవకు..’’ చెప్పాడు కొండబాబు.
ఇద్దరూ డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లారు. మళ్లీ అనిరుధ్‌లో టెన్షన్ మొదలైంది. ఎంత కాదనుకుంటున్నా ఏదోగా అనిపిస్తోంది. డాక్టర్ ఇంకా రాలేదు. వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. ఏడు గంటలు కావస్తూంటే వచ్చాడు డాక్టర్. మరో పాగంట గడిచాక వీళ్లని లోపలికి పంపింది నర్స్.
ఇద్దరూ ఆయనకెదురుగా వున్న కుర్చీల్లో కూర్చున్నారు. ఆయన డ్రాయర్‌లోంచి ఒక కవరు తీసి, అందులోంచి రిపోర్టు బయటికి తీశాడు.
‘‘డిఎన్‌ఎ మ్యాచ్ అయ్యింది.. ఆయనే మీ ఫాదర్...’’ చెప్పాడు డాక్టర్.
అనిరుధ్‌కి సంతోషించాలో, ఏడవాలో అర్థం కాలేదు. గంభీరంగా అయిపోయాడు ముఖం అభావంగా మారిపోయింది క్షణంలో.
డాక్టర్‌కి ఇవ్వాల్సింది ఇచ్చి వౌనంగా బయటకొచ్చారు. అనిరుధ్ చెయ్యి పట్టుకున్నాడు కొండబాబు. రోడ్డుమీదకొచ్చాక బైక్ దగ్గర కాస్సేపు నిలబడ్డాడు అనిరుధ్.
‘‘ఇప్పుడేం చేద్దాం..?’’ అడిగాడు కొండబాబు. వెంటనే ఏమీ మాట్లాడలేదు. కాస్సేపయ్యాక అన్నాడు.
‘‘నువ్వు ప్రకాశాన్ని మా మామయ్య ఇంటికి తీసుకునిరా.. అలాగే మా అమ్మమ్మనీ, హిమజనీ తీసుకుని నేను వస్తానక్కడికి.. వీలయితే మీ అమ్మని కూడా తీసుకునిరా.. సావిత్రిని కూడా.. ప్రకాశం రానంటే నాలుగు తన్నయినా తీసుకునిరా..’’ దృఢంగా చెప్పాడు.
‘‘నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లనా?’’
‘‘వద్దు.. నువ్వు ప్రకాశం కోసం వెళ్లు.. నేను ఆటోలో వెళతాను..’’
మరేమీ మాట్లాడకుండా కొండబాబు వెళ్లిపోయాడు. అనిరుధ్ ఇంటికి వెళ్లి మామయ్య ఇంటికి వెళదాం.. మాట్లాడే పని ఉందని అమ్మమ్మనీ, హిమజనీ తీసుకుని మేనమామ ఇంటికి బయల్దేరారు. వాళ్లు బయల్దేరేసరికి ఓ నలభై నిముషాలు పట్టింది. అప్పటికి ప్రకాశాన్ని బైక్ ఎక్కించుకుని బయల్దేరాడు కొండబాబు.
అప్పుడే బయటనుంచి ఇంటికి వచ్చిన సత్యం తలుపు వెయ్యబోతూ ఇంటిముందు ఆటో ఆగేసరికి ఎవరా అని చూశాడు. తల్లి, మేనల్లుడు, మరో అమ్మాయి ఆటో దిగేసరికి అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెనుకనే మరో ఆటోలో సావిత్రి, కొండబాబు తల్లి రావడం చూసి మరీ ఆశ్చర్యపోయాడు.
*
(ఇంకా ఉంది)

సర్వజిత్ 9010196842