డైలీ సీరియల్

అనంతం-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతకాలం గొలుసుకొండల్లో అజ్ఞాతవాసం చెయ్యాలో..
ఎంతకాలం పోలీసులు వాళ్ళనలా వెంటాడి వేధిస్తుంటారో తెలియదు.
ఒకళ్ళమీది ఆధారపడి బ్రతకటం అభిమానస్తులకెంత బాధ!
‘‘నిజ్జఁవే! నువ్వు సెప్పినట్టే శాద్దాఁవు’’అన్నాడు గోపీనాయక్.
లక్ష్మీబాయి మొహంలో ఏదో కాంతి కనిపించింది!
ఆమె దూరంగావెళ్ళాక గోపీనాయక్ ఆలోచనలు రాగ్యాకేసి మళ్ళాయి!
రాగ్యా యింకా ఎందుకు గుహకు తిరిగిరాలేదు?
ఎక్కడికి వెళ్ళుంటాడు?
కనీసం మాటకూడా చెప్పకండా ఎందుకు వెళ్ళాడు?
గోపీనాయక్ అంతరంగంలో అలజడి మొదలైంది!
* * *
తెల్లవారింది.
భూగోళం మరోవైపు సత్యాలను శోధించి వచ్చిన కర్మసాక్షి కారడివిలోకి తొంగి చూసాడు.
తాజా సూర్యకిరణాలు వాడిగావేడిగా ఉన్నాయి!
పారిపోయిన చీకట్లు గుబురు పొదల్లో గుడగుడ లాడ్తున్నాయి!
జగత్తు జాగృతమై-
నాగరక ప్రపంచంలో బుద్ధిజీవులు పోటీదారుడు తరుముకొస్తున్నట్టే పరుగులు పెడుతూ- సాధించిన విజ్ఞాన ప్రదర్శనలో అణుబాంబులు ప్రయోగిస్తూ, ఆధునిక మారణాయుధాలు కనుగొంటూ, అణుకర్మాగారాలు స్థాపిస్తూ, విశ్వరహస్యాలు ఛేదిస్తూ-
మరణం లేని మరో ప్రపంచం సృష్టించుకొని- ఆచంద్రార్కం ప్రపంచంమీద ఆధిపత్యం కొనసాగిస్తూ కర్రపెత్తనం చెయ్యాలని తపన పడుతూ ఉంటే,
అడవుల్లో రాగి సంకటి ముద్దలకోసం అడవి పుత్రుల ఆవేదన!
విచిత్రం కదూ?
రాత్రంతా రాగ్యా అజాపజా లేడు.
గుహలో వున్న ఎవ్వరికీ కంటిమీద కునుకు లేదు.
రాగ్యాని గురించే వాళ్ళంతా ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నారు.
ఇప్పుడేం చెయ్యాలి?
రాగ్యా విషయం ఎలా తెలుసుకోవాలి?
గోపీనాయక్ మెదడు ఆలోచనల తీవ్రతతో వేడెక్కింది!
రాత్రంతా రాగ్యా ఎక్కడున్నాడో?
ఎంత ప్రమాదం!
అడవిలో, అందునా రాత్రివేళల్లో ఎదురయ్యే ప్రమాదాలు ఎలాంటివో తెలిసి కూడా రాగ్యా అలా ఎందుకు చేసినట్టు?
అడవిలో-
మనిషిని చంపి తిని ఆకలి చల్లార్చుకోవాలని క్రూర మృగాలూ-క్రూర మృగాల్ని చంపి, వాటి చర్మంతో, గోళ్ళతో వ్యాపారంచేసి కోట్లు గడించాలని మనిషీ-
పోటీపడుతుంటారు!
పులిగోర్లు- ఏనుగు దంతాలు- పాము చర్మాలు-తాబేళ్ళు- దేవాంగ పిల్లులూ- కలివికోళ్ళూ, ఎర్ర కలబంద- ఎర్ర చందనం-
అన్నీ అదృష్టం పండించే వ్యాపార వస్తువులే, మనిషికి!
వాటికోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడు!
మనిషిని మనిషే వేటాడి చంపుతాడు..
ఎవరు ఎవర్ని చంపారో తెలియదు..
ఎవరు ఎవర్ని వేటాడారో తెలియదు..
చచ్చిందెవ్వరో- చంపిందెవ్వరో తెలియదు..
అది అడవి చరిత్ర..
అంతం లేని చరిత్ర..
అనంతానంతమైన చరిత్ర!
రాగ్యాకోసం గోపీనాయక్ అడవికి బయల్దేరాడు...
గుహలోనుంచి బైటికొచ్చి పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగిపోతోన్నాడు.
సూర్యకాంతికి, అతని చేతిలోవున్న పదునైన వేటకొడవలి జిగేల్మని మెరుస్తూ, రవ్వల రజను కురిపిస్తున్నట్టుంది!
ప్రమాదాన్ని ఖాతరుచేసే స్థితిలో లేడు! అతని ఆలోచనలన్నీ రాగ్యామీదే లగ్నమైపోయాయి.
అతన్ని వెతకాలన్న ధ్యేయం తప్ప మరేమీ గుర్తుకురావటం లేదు గోపీనాయక్కి!
అయినా అప్రమత్తంగానే ఉన్నాడు.
ప్రమాదం ఎదురైతే ప్రతిఘటించటానికి సిద్దంగా ఉన్నాడు.
దారిలో ఓ పొదలోనుంచి అలికిడి వినిపించింది!
అక్కడికి దూకాడు.. వేట కొడవలితో బలంగా వేటువేస్తూ చివరిక్షణంలో ఆగిపోయాడు!
రెండు కుందేళ్ళు పొదలోనుంచి బైటికొచ్చి దూరంగా పారిపోయాయి!
కుందేళ్ళతో ప్రమాదం లేదు. వాటిని గమనించే వేటు వెయ్యలేదు.
ప్రమాదం తలపెట్టే శత్రువైతే వేటు వెయ్యక తప్పదు కదా?
అంటే-
మనిషికి తక్షణావసరం మనుగడ!
దానికి విఘాతం కలిగితే సహించడు.
ఎదురు తిరుగుతాడు.
జీవన్మరణ పోరాటం అది!
జయించినా, జయించకపోయినా- మనుగడ కోల్పోయేందుకు సిద్ధపడడు. చివరికంటా పోరాడి తీర్తాడు!
మనుగడకోసం వేటువేస్తే హింస! వేటు వెయ్యకపోతే అహింస!
దౌర్జన్యాల్ని సహించి మనుగడని పణంపెట్టి శాంతిమంత్రం జపిస్తే అహింస!
‘‘నేనూ బ్రతకాలి’’అంటూ ఎదురుతిరిగితే.. హింస!
హింసకీ, అహింసకీ విభజనరేఖ ఏమిటి?
దానె్నవరు విభజించారూ?
నివురుకప్పిన నిప్పు శాంతంగా రగుల్తూనే ఉంటుంది! సందర్భంవస్తే పెనుమంటలు సృష్టిస్తుంది..
అగ్నిపర్వతం మాత్రం శాంతంగా కనిపించదూ!
భళ్ళున పగిలినప్పుడే లావా విరజిమ్మేది!
అలాంటి శాంతిలో ఎంత ప్రమాదం!?
గోపీనాయక్ ముందుకుపోతోనే ఉన్నాడు..
గాలి ఉధృతంగా వీస్తోన్నది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు