డైలీ సీరియల్

విలువల లోగిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అది వేరు. ఇది వేరు. నీకెలా చెప్పేది అర్థమయ్యేట్లు.’’
‘‘ఏమీ చెప్పద్దు. చక్కగా నన్ను నీదగ్గర ఉండనీ.’’
‘‘ఎన్నాళ్ళు ఉంటావేం?’’
‘‘నిన్ను ఒంటరిగా వదిలేసి నేను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతాననుకున్నావా?’’
‘‘కాకపోతే?’’
‘‘ప్రశే్నలేదు. నిన్ను నాతో తీసుకువెళ్తాను. లేదంటే పెళ్ళే చేసుకోను.’’
‘‘అలాఅయితే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళేకావు.’’
‘‘అమ్మా! విశ్వ అందరిలాంటి ఆడపిల్లకాదు. ఏదనుకుంటే అది చేసి చూపిస్తుంది.’’
‘‘ఆడపిల్లల దగ్గర ఉంటే ఈ లోకం ఆడిపోసుకుంటుంది.’’
‘‘అలా అంటే ఒప్పుకొనేది లేదు. ఆడపిల్ల, మగపిల్లాడు తేడా ఏంలేదు. నా లెక్కలో. చిన్నప్పుడు మీరు మమ్మల్ని చూసుకుంటారు. పెద్ద వయసులో మేం మిమ్మల్ని చూసుకోవాలి.. అంతే.’’
‘‘రేపు ఇంకొకరి దగ్గర ఇలా మాట్లాడి ఇంకో సంబంధంవస్తే అదీ చెడగొట్టుకుంటావా ఏమిటి?’’
‘‘అసలు ఒప్పుకుంటే కదా వద్దనటానికి. నాతో నిన్ను రావద్దన్న వారి ముఖం కూడా చూడను.’’
‘‘తప్పు. అలా అనకూడదు.’’
‘‘అమ్మా! చిన్నతనంలో నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి.’’
‘‘ఇలా అయితే నీ పెళ్ళి అయినట్లే. ఏమిటో చెబితే వినే రకంకావు.
సరే విశ్వా! కాసేపు నువ్వు పడుకో. ఈలోపు నేను వంట చేసేస్తాను’’ అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.
వంటిల్లు అంటే అది వేరే గదికాదు. ఒకే ఇంటిని తడికెలతో వేరుచేసి అలా పిలుచుకుంటారు.
అందరూ దాన్ని గుడిసె అంటారు కానీ విశ్వమాత్రం ‘మా పొదరిల్లు’అని మురిపెంగా చూసుకుంటుంది.
చుట్టూ రకరకాల పూలమొక్కలు, కూరగాయలు, పండ్ల చెట్లుతో ఆ వాతావరణం ఎవరికైనా హాయిగొలుపుతుంది.
పెరట్లో తోటకూర కోసి పప్పులో వేసింది. నాలుగు టమోటాలు కోసి చారు పెట్టింది.
గంట తర్వాత ‘‘విశ్వా! భోంచేస్తావా?’’అని అడిగింది.
కాసేపు ఆగి తిందామమ్మా అని చెప్పింది. మరి ఆమె అంతరంగం సూర్యచంద్రను కాదన్నందుకు బాధ లేదా అని సతాయించి చంపుతోంది. దానికీ, మనసుకు సర్దిచెప్పలేక అయోమయంలో పడింది విశ్వ.
విశ్వ ఆత్మవిశ్వాసం ముందు అవి ఓడిపోయాయి.
అప్పుడు కానీ ఆమెకు మనశ్శాంతి లభించలేదు.
ఇంతలో శాంతి పిలుపు ‘విశ్వా’ అని
‘‘హేయ్! శాంతి! ఎప్పుడు వచ్చావ్?’’ రారా!’’
‘‘ఒక అరగంట అయింది. అమ్మ నన్ను తిట్టకుండా ఒక అరగంట కూర్చుని నీ పేరుచెప్పి వచ్చేసాను.’’
‘‘ఎలా ఉంది నీ కాపురం?’’
‘‘శాంతి లేకపోయినా అశాంతి లేదు.’’
‘‘అదేమిటే?’’
‘‘అవన్నీ ఇప్పుడు ఎందుకు? నీ కబుర్లు చెప్పు? ఎలాఉన్నావ్?’’
‘‘నాకేం బాగానేఉన్నా.’’
‘‘ఇంకేంటి సంగతులు!’’
‘‘ఐశ్వర్య పెళ్ళిచేసుకుంది. తెలుసా?’’
‘‘లేదే! నాకేం శుభలేక రాలేదు.’’
‘‘నాకూ రాలేదు. ఎవరో చెబితే విన్నాను.’’
‘‘ఏమని?’’
‘‘అది డబ్బుకోసం ఏమాత్రం బాగోని వ్యక్తిని పెళ్ళికి ఎంచుకుందట’’
‘‘అవునా?’’
‘‘అవును. అప్పటికే వాళ్ళ అమ్మానాన్నా ఇప్పటికి రెండేగా సంబంధాలు చూసింది. ఇంకా చూద్దామన్నారట.’’
‘‘మరి’’
‘‘అక్కర్లేదు. నేను అతనే్న చేసుకుంటానని గట్టిగా చెప్పిందట’’
‘ఎందుకలా?’’
‘‘అమెరికాలో గవర్నమెంట్ ఉద్యోగం అట. ఒక్కడే కొడుకు, బోలుడు ఆస్థి ఉందట.’’
‘‘ఉంటే చేసేసుకుంటుందా? అదెంత అందంగా ఉంటుంది?’’
‘‘పెళ్ళికి వెళ్ళిన వాళ్ళంతా అలా ఉన్న ఆ జంటను చూడలేక పోయారట తెలుసా?’’
‘‘అంత బాగాలేడా పెళ్ళికొడుకు?’’
‘‘నల్లగా ఉన్నాడట. పైగా బట్టతల. పెద్దవాడిలా కనిపిస్తున్నాడట.
దీని ముందు.’’
‘‘అయ్యో!’’
‘‘అమాయకంగా ఇది, రాక్షసుడిలా అతను. వింటుంటేనే బాధగా ఉంది. చూస్తే ఇంకెలా ఉంటుందో?’’
‘‘ఎందుకలాంటి నిర్ణయం తీసుకుంది? మనిషికి డబ్బే ముఖ్యమా?’’
‘‘అదేమోగానీ పెళ్లికి వెళ్లినవాళ్ళు ఆ జంటను మాత్రం చూడలేకపోయారట’’
‘‘అంతే కదా! ప్రేమ పెళ్లి అయితే అది వేరొకలా ఉండేది’’
‘‘ఇప్పుడందరూ అం తేనే. డబ్బునే చూస్తున్నారు. ఆ డబ్బుతో వచ్చే సుఖాలనే కావాలనుకుంటున్నారు. మనుషులను, మనసులను ఎవరూ పట్టించుకోవటంలేదు’’.
‘‘అది నేను ఒప్పుకోను’’
‘‘నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్నది ఇదే!’’
‘‘దాని ముగ్ధ మనోహర రూపం గుర్తుకొస్తుంటే చాలా బాధ వేస్తోందే’’
‘‘అవునే! దాని కళ్ళు ఎంత బాగుంటాయ్. నువ్వు మరీనూ..’’
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ