డైలీ సీరియల్

విలువల లోగిలి-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా!’’
కప్పుకున్న దుప్పటిని ఒక్కలాగు లాగి అవతల పారేశాడు. ఒక్క ఉరుకు ఉరికాడు మంచంమీదనుంచీ క్రిందకు. పరుగెత్తినట్లే భువనేశ్వరి దగ్గరకు వెతుక్కుంటూ వెళ్లాడు.
ఆవిడ ఏదో కుట్టుకుంటున్నారు.
‘‘అత్తయ్యా! అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకున్నాడు’’
‘‘ఏమయ్యిందిరా?’’
అమృత చెప్పిన విషయమంతా వివరించాడు ఆమెకు.
‘‘చాలా సంతోషంరా చందూ. ఉండు స్వీటు పెడతానునీ నీ నోట్లో’’ అంటూనే వంటింట్లోకి వెళ్లి అతనికిష్టమైన ‘నల్లహల్వా’ తెచ్చిపెట్టింది.
‘‘ఇదెప్పుడు చేసావు అత్తయ్యా!’’
‘‘ప్రొద్దునేలే.. నీ కిష్టం కదా అని. విశ్వ ఓకె చెప్పాక పెడదామనుకున్నా. మళ్లీ ఆ విషయమే మరిచిపోయా’’
‘‘ఈ నల్ల హల్వా నీకంటే బాగా ఎవ్వరూ చెయ్యలేరు. అసలు నీకు రాని విద్య ఏమైనా ఉందా అని అనిపిస్తుంటుంది నాకు’’.
‘‘పోరా! మరీ ములగచెట్టు ఎక్కించేస్తున్నావ్. అసలే పీలగా ఉంటాను ములక్కాడలా. పడ్డానంటే మళ్లీ లేచే పనే లేదు’’.
‘‘నేనుండగా నినె్నలా పడనిస్తాననుకున్నావ్? అది సరేగానీ విశ్వ వాళ్ళింటికి వెళ్లి ఈవిషయం చెప్పిరానా?’’
‘‘వెళ్ళు.. వెళ్ళు. ఈ సంతోషంలో పడి ఆ విషయమే మర్చిపోయాను. వాళ్ళు కూడా ఇది విన్నారంటే చాలా సంతోషిస్తారు’’ అందావిడ.
చందూ గబగబా చెప్పులేసుకుని బయటపడ్డాడు.
వీళ్ళంతా ఎంత మంచివాళ్ళు? అమ్మాయి ఇంటికి మనం వెళ్ళటం ఏమిటి? వాళ్ళే మనింటికి రావాలి అనుకునే రోజుల్లో ఇంత మంచి భావాలున్న కుటుంబంలో పుట్టడం తన అదృష్టమే.
విశ్వ తనను చూసి ఏమనుకుంటుంది?
ఆపుకోలేని ఉద్వేగంతో తలుపు తట్టాడు.
‘‘ఈ టైమ్‌లో తమింటికి ఎవరొస్తారబ్బా’’ అనుకుంటూ వచ్చి తలుపు తీసింది విశ్వ.
‘‘మీరా?’’ అంది ఆశ్చర్యంగా.
‘‘నన్ను కాస్త లోపలికి రానిస్తారా?’’ అన్నాడు కొంటెగా.
కనీస మర్యాద మర్చిపోయానే అనుకుంటూ ‘‘రండి! కూర్చోండి’’ అంటూ అక్కడే వున్న కుర్చీని ముందుకు జరిపింది.
ఎందుకు వచ్చి ఉంటారు ఈయన అని మనసు ప్రశ్నలతో చంపేస్తోంది. సరిగ్గా సమయానికి అమ్మ నిద్రపోతోంది.
‘‘అమ్మ నిద్రపోతోంది. లేపమంటారా?’’ అని అడిగింది.
‘‘వద్దు.. వద్దు.. నేను మీతోనే మాట్లాడదామని వచ్చాను’’.
‘‘అవునా.. ప్రొద్దున అలా అన్నానని ఏమీ అనుకోకండి. మనసులో ఒకమాట, బయట ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు’’.
‘‘అదే మంచి పద్ధతి. నేనలాగా ఇష్టపడతాను కూడా. ప్రొద్దున మీరా మాట అన్నపుడు నాకేం చెప్పాలో తోచలేదు. కంపెనీని ఎవరికో ఒకరికి అప్పగించలేంగా. అలాగని మిమ్మల్నీ వదులుకోవాలని లేదు. ఇదే ఆలోచనతో నా బుర్ర వేడెక్కిపోయిందనుకోండి. ఇంతలో అమ్మ ఫోనుచేసింది. ఇక్కడ బ్రాంచి ఒకటి పెట్టుకోమంది. అక్కడ దాన్ని మా ‘అనిరుధ్’కి అప్పచెప్పమంది. ఇపుడు మీకేమీ అభ్యంతరం ఉండదు గదా!’’
అతనలా సూటిగా చూస్తూ ప్రశ్నిస్తుంటే సిగ్గుతో ఆమె కళ్ళు వాలిపోయాయి. ఉదయాన్నుంచీ అతనికయితే అలా సమాధానం చెప్పేసి వచ్చేసింది కానీ అతన్ని మరిచిపోవటం తనవల్ల కాదని మనసు పదే పదే పోరుతంది. శాంతి రావటంతో దాని బారి నుంచి కాస్త తప్పుకుంది. అది అటు వెళ్ళగానే మళ్లీ సతాయింపు ప్రారంభించింది. బుజ్జగించే నేపథ్యంలో తను అల్లాడిపోతోంది. ఈ సమయంలో ఇతని రాక, అతని మాట పెదాలపైన అమృతాన్ని చిలికినట్లుంది.
‘‘ఏమిటి? మీరేం మాట్లాడటంలేదు. ఇంకా నన్ను సస్పెన్స్‌లో పెడతారా, గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకుండా!’’
‘‘నాకు.. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే నిమ్మరసం కలుపుకొని వస్తానుండండి’’ అంటూ వెళ్లింది పెరట్లోకి అతను వద్దని వారిస్తున్నా!
ఉదయం నుంచీ అమ్మ ఎంతో బాధపడుతోంది. లేపి ఈ విషయం చెప్పెయ్యనా అనుకుంది ఒక క్షణం చెట్టునున్న నిమ్మకాయని కోస్తూ.
అక్కడే వున్న వారపత్రికను అతని చేతిలో పెట్టి లోపలికి వెళ్లింది.
చల్లగా, హాయిగా వున్న ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆమె రాకకోసం ఎదురుచూస్తూ.
‘‘తీసుకోండి’’ అంది గ్లాసు అందిస్తూ.
‘‘వద్దంటే వినరేం! మీ మాటతోనే నా కడుపు నిండిపోయింది’’.
‘‘ఇంకేం అంతా ఆదానే. తిండి ఖర్చు తగ్గిపోయినట్లే’’ అంది కిలకిలా నవ్వుతూ.
సరిగమలు జత కట్టినట్లనిపించింది అతనికి ఒక క్షణం.
‘‘చాలా బాగుంది నిమ్మరసం’’
‘‘తీపి సరిపోయిందా?’’
‘‘కాస్త ఎక్కువయింది. మీ మాటల మధురిమ తోడయ్యిందిగా’’
‘‘్ఫర్వాలేదు. ఏకవచనంతో పిలవవచ్చు’’
‘‘నన్ను కూడా విశ్వా!’’ అన్నాడు ఆనందంగా.
‘‘రండి.. మా ఇల్లు చూపిస్తాను. మీలా పెద్ద భవనం కాదనుకోండి’’.
‘‘అక్కడకంటే ఇక్కడే నాకు బాగుంది. నాకు సలహా ఇచ్చి నువ్వు పాటించటంలేదే?’’’
‘‘‘ఏమిటది? అని ఒక్క క్షణం ఆలోచించి ఓ.. అదా.. కాస్త అలవాటు అవ్వాలిగా’’.
‘‘
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206