డైలీ సీరియల్

ఒయాసిస్ 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాకే అనుకోండి. ఇవాళ మా ప్రిన్సిపాల్ రిజైన్ చేశాడు. కాశీలో వున్న అహోబలరావుగారికి ఫోన్ చేసి చెప్పాను. నన్ను ప్రిన్సిపాల్‌గా ఛార్జి తీసుకోమని చెప్పాడు. ఆయన రాగానే ఆర్డర్స్ ఇస్తానన్నారు..’’ అన్నది ఛాయ.
‘‘కంగ్రాట్స్.. మరి పార్టీ ఎప్పుడు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘దానికేం భాగ్యం.. రాత్రికి రండి..’’ అన్నది ఛాయ.
రాత్రి ఎనిమిదింటికి రణధీర్ వెళ్ళగానే ఛాయ నవ్వుతూ ఆహ్వానించింది.
ఉల్లిపొరలాంటి తెల్లని కుర్తా పైజమా ధరించింది. శరీర సౌష్టవం కనిపించీ కనిపించకుండా ఉంది.
‘‘ప్రిన్సిపాల్‌గారికి అభినందనలు..’’ అన్నాడు రణధీర్. ఛాయ షేక్ హ్యండిచ్చింది.
‘‘మొత్తానికి సాధించావు..’’ అన్నాడు రణధీర్ సోఫాలో కూర్చుంటూ.
‘‘నేను ఎవరినీ ఏమీ సాధించలేదండీ బాబూ.. ఆయన ఎప్పటినుంచో రిజైన్ చేయాలనుకుంటున్నారు. ఇంతకుముందే రిటైర్ అయి ఈయన బలవంతం వల్ల చేరారు. ఇప్పటికే ఆయనకు చాలా వ్యాపకాలు, వ్యవహారాలు ఉన్నాయి.. రోజూ ఏదో పనిమీద బైటికి పోయి వస్తూనే ఉంటారు..’’ అన్నది ఛాయ.
‘‘అంటే ఆ కాలేజీకి ముసలి ప్రిన్సిపాల్ పోయాడు, వయసు ప్రిన్సిపాల్ వచ్చిందన్నమాట..’’ అన్నాడు రణధీర్ నవ్వుతూ.
‘‘మీరేమన్నా అనుకోండి..’’ అన్నది ఛాయ కూడా నవ్వేస్తూ.
‘‘రోజురోజుకీ వయసు తగ్గిపోతోంది.. యూ ఆర్ బికమింగ్ యంగ్..’’
ఛాయ నవ్వింది.
‘‘వయసునీ, ప్రేమనీ, దగ్గునీ దాచలేమంటారు..’’ అన్నది.
‘‘అమ్మాయికి ఇరవై ఏళ్లదాకా మంచి తల్లిదండ్రులు కావాలి. యాభైఏళ్ళదాకా మంచి పర్సనాలిటీ కావాలి.. ఆ తర్వాత మంచి పర్సు ఉండాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘ఊ.. బాగానే స్టడీ చేశారు.. ఇంతకీ ఏం తీసుకుంటారు?’’ అని అడిగింది.
‘‘ఏమ్చినా తీసుకుంటాను?’’
‘‘ఎప్పుడూ అదే మాట.. కూల్‌డ్రింక్.. హాట్‌గా డ్రింక్.. హాట్ డ్రింక్..’’
‘‘కూల్‌డ్రింక్ ఇవ్వు.. శ్రమ పడొద్దు..’’ అన్నాడు రణధీర్.
‘‘మీరు అంత దూరం నుంచి శ్రమపడొస్తే లేదు కానీ, కూల్‌డ్రింక్ ఇస్తే శ్రమపడతానా?’’ అన్నది ఛాయ లేచి ఫ్రిజ్ దగ్గరకు వెళ్తూ...
‘‘నీతో మాట్లాడాలని వచ్చా.. సరదాగా కాసేపు ఏవన్నా కబుర్లు చెప్పు.. వింటాను’’ అన్నాడు రణధీర్.
‘‘ఏం కబుర్లు చెప్పమంటారు.. ఎలాంటి కబుర్లు కావాలి?’’ అని అడిగింది ఛాయ అతనికి కోక్ ఇస్తూ..
‘‘సరదాగా జోక్స్.. ఏదన్నా కథ..’’
‘‘పోలీస్ ఇన్స్‌పెక్టర్‌కి జోక్స్ ఇష్టమా.. ఇదే పెద్ద జోక్..’’ నవ్వింది ఛాయ.
‘‘నాకు జోక్స్ చాలా ఇష్టం..’’ అన్నాడు రణధీర్.
‘‘ఏదన్నా ఒకటి చెప్పండి..’’
‘‘మావాడు చాలా గొప్పవాడు.. శాస్త్రాలు వల్లెవేశాడూ అంటే గొప్ప పండితుడు కదాని పిల్లనిచ్చి పెళ్లి చేశారట.. తీరా పిల్ల పెళ్లి అయ్యాక విచారిస్తే అతను చదివింది కొక్కోక శాస్తమ్రట..’’ అని నవ్వాడు.
ఛాయ నవ్వింది.. ‘‘మంచి అభిరుచి వున్నవాళ్ళే.. నామీద జోక్ చెప్పండి చూద్దాం..’’
‘‘నువ్వు ప్రొఫెసర్ కదా.. నీ మీద జోక్ చెబుతాను.. ఒక కాలేజీ కుర్రాడు వాళ్ళమ్మతో- మా క్లాస్‌లోని అమ్మాయిలు, అబ్బాయిలందరం కల్సి పడుకుంటున్నాం అమ్మా.. అన్నాడట. వాళ్ళమ్మ అదిరిపోయి.. మీ దుంపలు తెగా.. ఎక్కడ పడుకుంటున్నార్రా.. అని ఆత్రంగా అడిగిందట.. ఛాయా మేడం క్లాసులో పడుకుంటున్నాం..’’ అన్నాడట.. అని నవ్వాడు.
‘‘జోక్ వరకు ఓ.కె. కానీ.. నిజానికి మా క్లాసులో పిల్లలందరూ నా క్లాస్ అంటే చాలా లైక్ చేస్తారు..’’
‘‘ఎందుకని?’’
‘‘వాళ్ళకి సబ్జెక్ట్‌తోపాటు చివర్లో ఓ అయిదు నిముషాలపాటు ఏదో ఒక పద్యమో, కథో, కవితో, జనరల్ టాపిక్ గురించి చెబుతాను.. చివర్లో చెప్పబోయే ఆ అంశం కోసం ఆసక్తిగా క్లాసులో పాఠాలు వింటారు..’’
‘‘నాక్కూడా ఏదన్నా పాఠం చెప్పి చివర్లో కథ చెప్పు..’’ అన్నాడు రణధీర్.
‘‘మీకు పాఠం అక్కర్లేదు. మీరే అందరికీ పాఠాలు, గుణపాఠాలు చెబుతారు.. అందుచేత మీ టేస్ట్‌కి తగిన కథ చెబుతాను.. అన్నది ఛాయ చిరునవ్వుతో.
‘‘చెప్పు.. చిన్నపిల్లాడిలా కథ వింటూ నిద్రపోతాను’’ అన్నాడు రణధీర్.. కళ్ళుమూసుకుని సోఫాలో వెనక్కి వాలి..
‘‘మీరు నిద్రపోతే కథ ఎవరు వింటారు?.. వింటున్నట్లు ‘ఊ’ కొట్టండి చాలు..’’
‘‘ఊ..’’
‘‘అనగనగా.. ఒక రాజుగారుండేవారు. దైవభక్తి ఎక్కువ. ఎన్నో యజ్ఞాలు, యాగాలు, క్రతువులూ చేశాడు. బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు.. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. మీ కొలువులో ఉంటూ, నిత్యం మీ సేవ చేసుకొనే భాగ్యం కలిగించమన్నాడు.. ‘ఊ’ కొట్టండి..’’
‘‘ఊ..’’
‘‘ఒక రోజు వాయుదేవుడు బ్రహ్మదేవుడి ముందు ఆనంద తాండవం చేస్తున్నాడు. సభలోనివారంతా ఏ మాత్రం దృష్టి మరల్చకుండా బ్రహ్మపాదాలనే తదేకంగా చూస్తున్నారు. ఆయనే్న మనసులో ధ్యానిస్తున్నారు. రాజుగారు కూడా బ్రహ్మపాదాలనే చూస్తూ ఆయనే్న ధ్యానిస్తున్నాడు. ఇంతలో ఒక దేవకన్య సభలోకి వచ్చింది బ్రహ్మను ధ్యానించాలని. ఉధృతంగా వాయుదేవుడు విజృంభించినందువల్ల ఆమె కేశాలు గాలికి చెదిరిపోతున్నాయి. అయినా ఎవరూ దృష్టి మరల్చలేదు కానీ రాజుగారు మాత్రం ఆమె వైపు దృష్టి మళ్లించాడు. ఆమె మరికొంచెం దగ్గరకొచ్చింది. గాలి తాకిడికి స్తనద్వయం మీది వస్త్రం ఎగిరిపోయింది. అయినా ఎవరూ దృష్టి మర్చలేదు. రాజుగారు ఆమె స్తనాలనే చూస్తున్నాడు.

- ఇంకా ఉంది

శ్రీధర