రాష్ట్రీయం

దానం తెరాస‘గానం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు రోజులుగా హైడ్రామా ఇంటికెళ్లి చర్చించిన షబ్బీర్ అలీ
పార్టీ మారబోనని ఫోన్‌లో దిగ్విజయ్ సింగ్‌కు స్పష్టీకరణ
అయినా తొలగని సందిగ్ధత 7న టిఆర్‌ఎస్‌లో చేరవచ్చని ప్రచారం

హైదరాబాద్, డిసెంబర్ 4: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ (జిహెచ్‌సిసి) అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దానం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు వీస్తున్నప్పటికీ, రెండు రోజులుగా ఆయన ఒకసారి పార్టీ మారడం లేదని ప్రకటించడం, మరోసారి పార్టీ మారాలా? వద్దా? అని తన సన్నిహితులతో చర్చించడం అనుమానాలకు తావు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ శుక్రవారం దానం నాగేందర్ నివాసానికి వెళ్ళి కొంత సేపు మంతనాలు జరిపారు. పార్టీ మారవద్దని, చేరిన తర్వాత అక్కడ గుర్తింపు ఉండదని, అప్పుడు పశ్చాత్తాపపడినా ఉపయోగం ఉండదని షబ్బీర్ అలీ ఆయనకు నచ్చజెప్పారు. కాంగ్రెస్, టిడిపిల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన అనేక మంది తమ వ్యధను వ్యక్తం చేస్తున్నారని ఆయన నాగేందర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
ఇలాఉండగా షబ్బీర్ అలీ దిగ్విజయ్‌కు ఫోన్ చేసి దానంతో మాట్లాడించినట్లు సమాచారం. తాను పార్టీ మారాలన్న ఆలోచన చేయడం లేదని నాగేందర్ దిగ్విజయ్ సింగ్‌కు వివరించారు. దానం తన ముఖ్య అనుచరులతో, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పార్టీ మాజీ కార్పొరేటర్లతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. పార్టీని వీడే ఆలోచన లేనప్పుడు పార్టీ మారాలా? వద్దా? అనే అంశంపై పార్టీ నగర నాయకులతో ఎందుకు చర్చిస్తున్నారని దిగ్విజయ్ ప్రశ్నించగా, రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహంగా నడిపించేందుకు చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
షబ్బీర్ అలీ దానం నాగేందర్ నివాసానికి వెళ్ళిన విషయం తెలియగానే విలేఖరులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దానం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ మారనని తాను ఇదివరకే చెప్పానని అన్నారు.
గందరగోళంలో కాంగ్రెస్ శ్రేణులు
దానం పార్టీ మారుతారా? లేదా? అనే అంశం కాంగ్రెస్ నాయకుల్లో ఎవరికీ అంతుచిక్కక గందరగోళం నెలకొన్నది. పార్టీ మారనని దానం స్పష్టంగా చెబుతున్నా, ముఖ్య అనుచరులతో, సన్నిహితులతో పార్టీ మారితే ఎలా ఉంటుందని చర్చించడంలో మతలబు ఏమిటని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ నెల 7న (సోమవారం) దానం టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
గ్రేటర్ ఎన్నికల ముందు..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు దానం టిఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్‌కు పెద్ద నష్టమే జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దానం బలమైన నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. పైగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. ఆయన పార్టీ మారితే పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు నీరసపడతారు. (చిత్రం) శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నేత దానం నాగేందర్ నివాసానికి వచ్చి ఆయనతో చర్చిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ