దటీజ్ దన్సిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దన్సికని తెలుగువారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనే లేదు. కబాలి సినిమాతో ఈ అమ్మడు తెలుగులోనూ పాపులర్ అయింది. ఆ సినిమాలో లేడీ డాన్‌గా ఫైరింగ్ చేసే దన్సిక స్టైల్ ఇప్పటికీ కుర్రాళ్ళ కళ్ళల్లో అలాగే కనిపిస్తుంటుంది. అంతటి స్టైలిష్, క్రేజీ గాళ్ ధన్సిక. ఈ అమ్మడు అంతకంటే ముందే పలు చిత్రాల్లో తెలుగువారిని పలకరించింది. అందానికి అందం.. పెర్ఫామెన్స్‌కి పెర్ఫామెన్స్.. విలక్షణత ఈ అమ్మడికే చెల్లింది. అందుకే ధన్సిక సౌత్ ఇండస్ట్రీలో వెరీ స్పెషల్. కోలీవుడ్‌లో క్షణం తీరిక లేకుండా గడిపేసే ఈ అమ్మడు ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ ఓ వేశ్య పాత్రలో నటిస్తోందని సమాచారం. ‘మా వీరన్ దిలీపన్’ ఫేం, జాతీయ స్థాయి పురస్కారాల సినిమాలతో ఆకట్టుకున్న ఆనందమూర్తి దర్శకత్వంలో ‘సినమ్’ అనే లఘు చిత్రంలో ధన్సిక నటించింది. ముంబై రెడ్‌లైట్ ఏరియా సెక్స్‌వర్కర్‌గా ధన్సిక కనిపిస్తుందని సమాచారం. ఫీచర్ ఫిలిం తీసే రేంజ్ సినిమా.. పైగా కానె్సప్టు తనకి విపరీతంగా నచ్చడంతో ధన్సిక రూపాయి కూడా తీసుకోకుండా ఈ చిత్రంలో నటించిందట.