రాష్ట్రీయం

యాభైకి పెరిగిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఓ బస్సు బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 50కి పెరిగింది. బస్సులో దాదాపు 70మంది ప్రయాణిస్తున్నారు. మృతిచెందినవారిలో 25మంది మహిళలు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందగానే కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందినవారిలో ఇప్పటివరకు 35మందిని గుర్తించారు. డ్రైవర్ మృతిచెందగా కండక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు ఆపద్ధర్మ సీఎం ఐదు లక్షల పరిహారం ప్రకటించారు.