రాష్ట్రీయం

14 నుంచి డిఈసెట్ వెబ్ ఆప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17 నుంచి సీట్ల కేటాయింపు
హైదరాబాద్, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో డిఈసెట్ రెండోవిడత వెబ్ ఆప్షన్ల ప్రకియను ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకూ కొనసాగుతుందని సెట్ కోకన్వీనర్ పి పార్వతి పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు 17 నుండి 19వ తేదీ వరకూ జరుగుతుందని, అభ్యర్ధులకు కళాశాలల కేటాయింపు 20వ తేదీన చేస్తామని ఆమె చెప్పారు. ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్ట్ఫికేట్ల పరిశీలన 21వ తేదీ నుండి 23వ తేదీ వరకూ జరుగుతుందని , అభ్యర్ధులు 26వ తేదీలోగా కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని అన్నారు. అర్హత ఉన్న అభ్యర్ధులు రెండో విడత కౌనె్సలింగ్‌లో అధిక సంఖ్యలో కాలేజీలకు ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ డీసెట్ డాట్ ఎపి డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ ను సందర్శించాలని పేర్కొన్నారు. తొలి విడత కౌనె్సలింగ్‌లో పాల్గొనని అభ్యర్ధులు సైతం రెండో విడతలో పాల్గొనవచ్చని ఆమె సూచించారు.