రాష్ట్రీయం

ఏపి ప్రెస్ అకాడమి చైర్మన్‌గా వాసుదేవ దీక్షితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా వి వాసుదేవ దీక్షితులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం ప్రెస్ అకాడమి చైర్మన్ పదవికి క్యాబినెట్ హోదా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిట్టచివరిగా సత్యారావు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా కొనసాగారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా అల్లం నారాయణను నియమించారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. తాజా నియామకంతో ప్రెస్ అకాడమి కార్యకలాపాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. చైర్మన్‌తో పాటు త్వరలో సభ్యుల నియామకం కూడా జరగనుంది. ఇప్పటికే ప్యానల్ జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. వాసుదేవ దీక్షితులు సీనియర్ పాత్రికేయులు, ఆంధ్రప్రభ సంపాదకుడిగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం నేడు టివి చర్చల్లో విశే్లషకుడిగా వ్యాసకర్తగా ప్రసిద్ధి చెందారు. చాలాకాలంగా వాసుదేవ దీక్షితులు పేరు వినిపిస్తున్నా నియామకానికి ఇన్నాళ్లు పట్టిందని చెబుతున్నారు. దీక్షితులు అమలాపురం ఎస్‌కెబిఆర్ కాలేజీలో పట్ట్భద్రుడయ్యారు. కొత్త ప్రెస్ అకాడమి విజయవాడలో కొనసాగిస్తారా లేదా వేరే ఇతర పట్టణంలో ఏర్పాటు చేస్తారా అనే దానిపై కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.