రాష్ట్రీయం

జింకను వేటాడిన ఎర్రచందనం కూలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాస్క్ఫోర్క్‌కు చిక్కిన ఇద్దరు
ఏడుగురు పరార్

తిరుపతి, జనవరి 2 : శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీలు చెట్లను నరకడమే కాకుండా జంతువులను కూడా వేటాడి మాంసాన్ని భక్షిస్తున్నారని శనివారం జూ పార్కు సమీపంలోని శేషాచల అడవుల్లో కార్యదళ సిబ్బంది దాడుల్లో తేటతెల్లమయింది. 9 మంది ఎర్రకూలీలు ఓ జింకను వేటాడి దానిని కోయడానికి మోసుకొస్తున్న సమయంలో కూంబింగ్‌లో ఉన్న కార్యదళం సిబ్బంది కంట పడ్డారు. దీంతో చనిపోయిన జింకను అక్కడే వదిలి పారిపోయారు. ఈ క్రమంలో కార్యదళ సిబ్బంది వారిని వెంటాడతంతో ఇద్దరు పట్టుబడ్డారు. మరో ఏడుగురు పారిపోయారు. పారిపోయిన వారికోసం టాస్క్‌పోర్స్ అధికారులు గాలిస్తున్నారు. కాగా మరణించిన జింకను పంచనామ చేసిన అధికారులు ఖననం చేశారు. ఎర్రకూలీల పై జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసారు.