రాష్ట్రీయం

శాంతిభద్రతలతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో నేరాల రేటు 4.23 శాతం తగ్గింది
పోలీసులు పనితీరు మెరుగుపరుచుకోవాలి
ఆంధ్రప్రదేశ్ డిజిపి జెవి రాముడు

హైదరాబాద్, జనవరి 2: పోలీసులు ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనైనా తట్టుకుని పనిచేయాలని, సమాజంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ డైరక్టెర్ జనరల్ ఆఫ్ పోలీసు జెవి రాముడు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల పోలీసు బలగాల సంఖ్య తగ్గినా ఆంధ్ర పోలీసులు బాగా పనిచేసి నేరాలను గణనీయంగా తగ్గించారని, శాంతి భద్రతలను చక్కగా నియంత్రిస్తున్నారని ఆయన ప్రశంసించారు. పోలీసులు పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలన్నారు. శనివారం ఆయన ఇక్కడ ఏపి డిజిపి కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది కొరతను ఎదుర్కొంటూ పనిచేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015లో కాగ్నిజబుల్ నేరాల శాతం 4.23 శాతం తగ్గిందని, మొత్తం 95వేల కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం 96 మంది వామపక్షతీవ్రవాదులను అరెస్టు చేయగా, వంద మంది లొంగిపోయారని చెప్పారు.
మావోయిస్టులు 24 నేరాలకు పాల్పడ్డారని, నలుగురు పౌరులను హత్య చేశారని,13 పరస్పర ఎదురుకాల్పుల సంఘటనలు జరిగితే, ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి 2710 మంది స్మగర్లను అరెస్టు చేశామని, ఇందులో 40 మంది అంతరాష్ట్ర స్మగ్లర్లు ఉన్నారన్నారు. పిడి చట్టం కింద 51 కేసులు నమోదు చేశామన్నారు. ఆర్ధిక నేరాలు 2015తో పోలిస్తే పెరిగాయని, 2014లో 105 నేరాలు, 2015లో 148 నేరాలు నమోదైనట్లు చెప్పారు. 2015లో 750.72 కోట్ల విలువ చేసే ఆర్ధిక నేరాలు జరిగితే, అంతకు ముందు ఏడాది 398.35కోట్ల విలువ చేసే నేరాలను నమోదు చేశామన్నారు.
మహిళలపై నేరాలు 7.53 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. 2014లో 12671 కేసులు, 2015లో 11667 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు డిజిపిలు ఆర్‌పి ఠాకూర్, కౌముది, సురేంబ్రాబు, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.