ధర్మసందేహాలు

చిరంజీవుల ఆయుఃప్రమాణం ఎంత ఉంటుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*చిరంజీవుల ఆయుఃప్రమాణం ఎంత ఉంటుంది? - కె. మధుసూదన్ హన్మకొండ
సామాన్యంగా చిరంజీవి అంటే ఒక కల్పాంతం వరకు జీవించి ఉండేవాడు అని అర్థం. కానీ మార్కండేయుడు, కాకభుశుండి, బకదాల్బ్యుడు మొదలైన వారు బ్రహ్మ కల్పాంతం వరకు ఆయష్యాన్ని సంపాదించారు. అందుకనే వారు అనేక కల్ప ప్రళయాలను దర్శించినట్లుగా పురాణాలలో ఉంది.
*ఒకానొక అభ్యర్థి దుర్మార్గుడని తెలిసి గూడా అతనికే అండగా ఉంటే అతడు చేసే పనులవల్ల వచ్చే పాపం అండగా ఉన్నవారికి వస్తుందా?
- పి.వి.నరసింహారావు, రాజమండ్రి
కర్తా కారయితా చైవ ప్రేరక శ్చాను మోదకః అన్నారు. పాపం చేసేవాడ్ణి ఆమోదించినవారికి గూడా పాపం అంటక తప్పదు. ఈ విషయాన్ని ప్రతినిమిషమూ గుర్తుంచుకోవాలి. తప్పు చేయకూడదు. చేసేవారికి అండగాను ఉండకూడదు అనే ధర్మశాస్త్రం చెబుతుంది.

కుప్పా వేంకట కృష్ణమూర్తి