ఆంధ్రప్రదేశ్‌

డిజిటల్ ఆంధ్ర కల సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత అందిపుచ్చుకునేందుకు నిర్ణయం

విశాఖపట్నం, మార్చి 17: నవ్యాంధ్రను డిజిటల్ ఆంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, సిస్కో సిస్టమ్స్ మధ్య పలు కీలకు ఒప్పందాలు జరిగాయి. ఫైబర్‌గ్రిడ్ తొలి దశ ప్రారంభంలో భాగంగా గురువారం విశాఖలో సిస్కో చైర్మన్ జాన్ టి చాంబర్స్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సమక్షంలో పలు అంశాలపై అధికారులు సంతకాలు చేశారు. డిజిటల్ ఆంధ్రలో జిడిపి వృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల సృష్టి, నూతన ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పరిశోధన విద్య వృద్ధి, ఔత్సాహికులను ప్రోత్సహించడం, వ్యాపార ఆవిష్కరణలు, ఆర్థిక క్లస్టర్ కార్యక్రమాల అభివృద్ధి, వౌలిక వసతులకు సహకారం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం, సిస్కో మధ్య మరింత అవగాహనతో కూడిన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
డిజిటల్ అర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నైపుణ్యాభివృద్ధి, నెట్ వర్కింగ్ అకాడెమీ విస్తరణ, ఇన్నోవేటివ్ స్టార్టప్స్‌లో పెట్టుబడులు, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ (ఐఓఈ), విశాఖలో ఇన్నోవేటివ్ సెంటర్ ఏర్పాటు, తిరుపతిలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, కస్టమైజ్డ్ డిజిటల్ టెక్నాలజీ, పరిష్కారాలని గ్రామీణ ప్రాంతాలకు చేరవేసేందుకు ఆంధ్రాయూనివర్శిటీతో పరిశోధనా కార్యక్రమాల ప్రాయోజితంతో పాటు గోల్డెన్‌మైల్ ప్రాజెక్టు విస్తరణ వంటి అంశాల్లో సిస్కో, రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ (ఐఓఈ) సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ ఆవిష్కరణలను వేగవంతం చేస్తారు. ఐఓఈ పరిసరాల్లో స్టార్టప్, భాగస్వామ్య పరిష్కారాలను ఆవిష్కరించేందుకు ప్రోత్సహిస్తారు. యాక్సలరేట్లు, డెవలపర్లు, పరిశోధకులు, ఎకో సిస్టమ్స్ పార్టనర్స్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఇది వేదికగా నిలుస్తుంది. డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్య శిక్షణను సిస్కో అందిస్తుంది. పరిశోధనలను వేగవంతం చేసేందుకు ఆంధ్రాయూనివర్శిటీని సిస్కో ప్రాయోజితం చేస్తుంది. ఏడాది కాలంలో పరిశోధనకు సంబందించి కస్టమైజింగ్ డిజిటల్ టెక్నాలజీని అనే్వషించడంతో పాటు సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా సిస్కో నెట్‌వర్కింగ్ అకాడెమీ విస్తరించి 70 కళాశాలల్లో సుమారు 10వేల మంది విద్యార్థులకు వచ్చే మూడేళ్లలో పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. గోల్డెన్‌మైల్ ప్రాజెక్టులో భాగంగా అత్యంత కీలకమైన సాంకేతికతలను 5 కిలోమీటర్ల పరిధిలో అమర్చుతుంది. స్మార్ట్ వైఫై, స్మార్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, స్మార్ట్ లైటెనింగ్, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్టు, స్మార్ట్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ టి చాంబర్స్ మాట్లాడుతూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌కి తమ సహకారం ఉంటుందన్నారు. జిడిపి వృద్ధి, ఉద్యోగ సృష్టి, వర్క్ఫోర్స్ నాలెడ్జ్‌లో డిజిటలైజేషన్ అత్యంత కీలకమని, దీనికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం కావాలన్నారు. ఇందుకు అవసరమైన వౌలిక వసతులను సిస్కో అందిస్తుందని జాన్ హామీ ఇచ్చారు. సిస్కో ఆసియా, ఫసిఫిక్, జపాన్ ప్రెసిడెంట్ ఇర్వింగ్ టాన్, సిస్కో ఇండియా అండ్ సార్క్ ప్రెసిడెంట్ దినేష్ మల్కానీ పాల్గొన్నారు.