రాష్ట్రీయం

ఎపి అభ్యంతరాలు బేఖాతర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిండి రీడిజైన్‌తో జలజగడం జటిలం
30టిఎంసిలకు బదులుగా 60టిఎంసిల వినియోగం
ముంపు విస్తీర్ణంపై ఆందోళన
సొరంగానికి స్వస్తి..పెరిగిన రిజర్వాయర్లు

నల్లగొండ, నవంబర్ 21: నల్లగొం డ, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగు, తాగు నీరందించేందుకు చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంలో సిఎం కెసిఆర్ మరోసారి మార్పులు చేస్తు రీడిజైన్ చేయడం తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదాలకు మరింత ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా నీటిని గతంలో రోజుకు అర టిఎంసి చొప్పున 60రోజులకు 30 టిఎంసిలను డిండి ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవాలని పథకాన్ని రూపొందించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ తాజా సమీక్ష పిదప రోజుకు ఒక టిఎంసి చొప్పున 60టిఎంసిలు తీసుకోవాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవంటూ ఈ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభు త్వం అక్రమంగా నిర్మిస్తుందంటూ ఎపి ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తు కృష్ణా నది యాజమాన్య బోర్డు కు, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వివాదం పెండింగ్‌లో ఉండగానే డిండి ఎత్తిపోతల నీటి వినియోగాన్ని 30నుండి 60టిఎంసిలకు పెంచడం వివాదాన్ని మరింత జఠిలం చేసినట్లయింది. పొతిరెడ్డిపాడుతో ఎ పి ప్రభుత్వం నాలుగు టిఎంసిలు తరలించుకోపోతుందని, అదే తెలంగాణ కేవలం పాలమూరు, డిండి ఎత్తిపోతలల ద్వారా రెండున్నర టిఎంసిలు మాత్రమే తీసుకుంటుందంటూ తెలంగాణ ప్రభుత్వం వాదన. అయితే పెంచిన నీటి వినియోగ సామర్ధ్యం మేరకు శ్రీశైలం నుండి తగిన కృష్ణా జలాల లభ్యత సాధ్యాసాధ్యాలపై సందేహాలు వినిపిస్తున్నాయి. వరద జలాలు తగినంత లేకపోతే రెండు రాష్ట్రాలకు నీటి కొరత తలెత్తవచ్చు. అలాగే కాలువ పొడిగింపు, రిజర్వాయర్ల సంఖ్యలో పెంపుతో నల్లగొండ జిల్లాలో ముంపు విస్తీర్ణం మరో 1500ఎకరాల మేరకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిల్వ సామర్ధ్యం కుదింపుతో ముంపు తగ్గించేందుకు కసరత్తు సాగుతోంది. గత డిజైన్ మేరకు 11,645ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా ఇప్పటికే తొమ్మిది వేల ఎకరాల సేకరణ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు డిండి ఎత్తిపోతల పథకం రీడిజైనింగ్‌తో అంతకుముందున్న 7.2కిలోమీటర్ల సొరంగ మా ర్గం పూర్తిగా రద్దవుతుంది. ప్రధాన కాలువ మరో 15కిలోమీటర్లు అదనం గా పెరుగనున్నప్పటికీ 10నుండి 15మీటర్లకు కటింగ్ తగ్గనుంది. పెంచిన 30టిఎంసిలలో జంటనగరాలకు 20టిఎంసిలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్ (మహబూబ్‌నగర్) ప్రాంతాల్లో అదనంగా నిర్ధేశించిన లక్ష ఎకరాలకు సాగుకు 10టిఎంసిలు అందించనున్నారు. రీడిజైన్‌తో గతం లో నిర్ధేశించిన మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కాస్తా నాలుగున్నర లక్షలకు పెరుగనుంది. గతంలో డిండికి ఎగువన నార్లపూర్, ఆలేరు రిజర్వాయర్లు మాత్రమే ఉండగా కొత్తగా ఎనిమిది కిలోమీటర్ల పైన మరో రిజర్వాయర్‌ను రీడిజైన్‌లో ప్రతిపాదించారు. అలాగే చారకొండ, ఇద్దంపల్లి, అరకపల్లి, కిష్టంరాపల్లి, శివన్నగూడెం రిర్వాయర్లకు తోడు కొత్తగా చింతపల్లి, పసునూర్, ఎస్. లింగోటం రిజర్వాయర్లను కొత్త గా ప్రతిపాదించారు.