రాష్ట్రీయం

కాచిగూడ- గుంటూరు మధ్య ప్రత్యేక డబుల్ డెక్కర్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-గుంటూరు మధ్య ప్రత్యేక డబుల్ డెక్కర్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.02118 కాచిగూడ నుంచి ఈ నెల 8,9,10,12,13 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 5.50 గంటలకు గుంటూరు చేరుకుంటుందని రైల్వే వెల్లడించింది. అలాగే తిరుగు ప్రయాణంలో నెం.02117 ప్రత్యేక డబుల్‌డెక్కర్ రైలు ఈ నెల 9, 10, 11, 13, 14 తేదీల్లో ఉదయం 7 గంటలకు గుంటూరులో బయలుదేరి అదే రోజు మధ్యాహ్నాం 1.45కి కాచిగూడ చేరుకుంటుందని రైల్వే వెల్లడించింది. అలాగే నెం.02120 కాచిగూడ-గుంటూరు డబుల్‌డెక్కర్ స్పెషల్ రైలు కాచిగూడ నుంచి జనవరి 11న రాత్రి 11 గంటలకు బయలుదేరి తర్వాత రోజు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో నెం.02119 జనవరి 12వ తేదీన ఉదయం 7 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 1.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని రైల్వే తెలిపింది. కాగా కాచిగూడ-గుంటూరు మధ్య నెం.22118 డబుల్‌డెక్కర్ రైలు జనవరి 8, 12, 15, 16 తేదీల్లో, నెం.22117 గుంటూరు-కాచిగూడ డబుల్‌డెక్కర్ రైలు 8, 12, 15 తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే వెల్లడించింది. అలాగే 9, 13, 16 తేదీల్లో నడిచే నెం.22120 కాచిగూడ-తిరుపతి డబుల్‌డెక్కర్ రైలును రద్దు చేసినట్లు తెలిపింది. నెం.22119 డబుల్ డెక్కర్ రైలు తిరుపతి నుంచి కాచిగూడకు జనవరి 10, 14, 17 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించింది.