ఆంధ్రప్రదేశ్‌

తాగునీటి అవసరాలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో గళమెత్తిన విశాఖ నగర ఎమ్మెల్యేలు
హైదరాబాద్, మార్చి 17: విశాఖ నగరం మరికొన్ని రోజుల్లో తాగునీటి సమస్యను ఎదుర్కోబోతోందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, ఈ సమస్యను పరిష్కరించాలని విశాఖ నగర ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు గురువారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఈ అంశంపై మాట్లాడారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ నీటిని విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం మళ్లించాలని కోరారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ కింద 35 వేల ఎకరాల సాగుభూమి ఉందని, ఈ సంవత్సరం రెండో పంటకు నీరందే పరిస్థితి లేదని, ఇటువంటి సమయంలో విశాఖకు ఏవిధంగా నీరు ఇస్తారని ప్రశ్నించారు.
సాగుకు సరిపడా నీరు ఉంచి, మిగిలిన నీటిని తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖ నగరంలో ప్రతి వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత జివిఎంసిపై ఉంటే, ప్రస్తుత 115 లీటర్ల నీటిని మాత్రమే ఇస్తోందని అన్నారు. రైవాడ, ఏలేరు రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిని నిల్వ చేసే అవకాశం లేదని, అలాగే నగరానికి వస్తున్న నీరు మధ్యలో చౌర్యానికి గురవుతోందని అన్నారు. వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీటిని విశాఖకు పంపిస్తున్నా, 70 క్యూసెక్కుల నీరు మాత్రమే నగరానికి చేరుకుంటోందని అన్నారు. నగరానికి తాగునీరు అందించే తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ రిజర్వాయర్లలో 2009 నుంచి పూడిక తీయలేదని అన్నారు.
ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉన్న ఈ రిజర్వాయర్లను జివిఎంసికి అప్పగిస్తే, మరమ్మతులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ఏలేరు నుంచి నీరు పూర్తి స్థాయిలో విశాఖకు చేరేందుకు 1700 కోట్ల రూపాయలతో పైపులైన్ ఏర్పాటు చేయాలని చాలా కాలం కిందటే ప్రతిపాదించారని, దానికి అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలకు 85 ఎంజిడి నీరు అవసరం ఉండగా, 64 ఎంజిడిల నీటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే జిఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ ఏలేరు నీటిని జివిఎంసి విక్రయిస్తోందని, ఇందులో సుమారు 100 కోట్ల రూపాయలను ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్ అభివృద్ధికి ఇవ్వాల్సి ఉందని, దీన్ని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.