ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల ఆందోళనకు తాత్కాలిక విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్య పరిష్కారానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే హామీ బాధితుడికి మంత్రి మాణిక్యాలరావు పరామర్శ
విజయవాడ, మార్చి 11: ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గగుడి అర్చకుడు ఎం సుబ్బారావును రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం దేవాదాయ శాఖ మల్టీజోన్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్‌ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ కమిషనర్ ఆదేశాల మేరకు దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవోగా బాధ్యతలు స్వీకరించారు. కాగా దుర్గగుడి ఇవో నరసింగరావును సస్పెండ్ చేయాలంటూ అర్చకులు, ఆలయ సిబ్బంది చేపట్టిన అందోళన కార్యక్రమాన్ని శుక్రవారం తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, తదితరులు శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రికి వచ్చి ఆందోళన చేస్తున్న వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించించారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో నరసింగరావు దుర్గగుడి ఇవోగా చార్జ్ తీసుకుంటే మరోసారి ఆందోళనకు దిగుతామని అర్చకులు, సిబ్బంది హెచ్చరించారు. నరసింగరావు మరలా ఇవోగా వస్తే మీతో పాటు మేము కూడా ఆందోళన చేపడతామని వెంకన్న, ఉమా చెప్పటంతో రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనను శుక్రవారం సాయంత్రం తాత్కాలికంగా వాయిదా వేసి ఉద్యోగులు, అర్చకులు విధులకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి అమ్మవారి నివేదన కోసం ఒక అర్చకుడు మాత్రమే అంతరాలయంలో విధులు నిర్వహించారు. ఇన్‌చార్జ్ ఇవో ఆజాద్ మాట్లాడుతూ సుబ్బారావు వివాదం నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా పుష్కరాలను విజయవంతంగా పూర్తిచేయటానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళతామన్నారు. అమ్మవారి సన్నిధిలో తలెత్తిన ఆందోళనలు తాత్కాలికమేనన్నారు. అటెండర్ నుండి ఇవో వరకు అందరూ సమష్టిగా పుష్కర మహోత్సవాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండటంతో ఉద్యోగులందరి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. (చిత్రం) ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శిస్తున్న మంత్రి మాణిక్యాల రావు