రాష్ట్రీయం

ఇద్దరు చిన్నారులకు ఉరివేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వెంగళ్‌పాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాటితండాలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దర్పల్లి మండలంలోని దొన్కల్‌తండాకు చెందిన అరుణ (26)కు ఏడేళ్ల క్రితం పాటితండావాసి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు శ్రీకాంత్, ఏడాది వయస్సు గల కుమార్తె సుచిత్ర ఉన్నారు. అయితే శ్రీనివాస్ తన మరదలిపై కనే్నసి ఆమెను కూడా వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్ని భార్య వద్ద ప్రస్తావిస్తూ, నీ చెల్లిలిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలా తల్లిదండ్రులను ఒప్పించాలంటూ ఒత్తిడి తీసుకురాగా, అరుణ ఎంతమాత్రం అంగీకరించలేదు. ఎంత చెప్పినా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన అరుణ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, ఆ తర్వాత తాను కూడా దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చాలాసేపటి నుండి అరుణ ఇంటి నుండి బయటకు రాకపోవడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు తలుపులు తెరుచుకుని లోనికి వెళ్లి చూడగా, ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, డిచ్‌పల్లి సిఐ వెంకటేశ్వర్లు, దర్పల్లి ఎస్‌ఐ మురళి తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మృతురాలి తండ్రి రాజునాయక్, ఇతర కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాటితండాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు అతని ఇంటి ముందు బైఠాయించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించనివ్వకుండా అడ్డుకోవడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తల్లీ, పిల్లల మృతికి కారకుడైన శ్రీనివాస్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ వినిపించుకోకుండా రాత్రి 8గంటల వరకు కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.