రాష్ట్రీయం

అందుబాటులోకి వాహన ఈ-బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రారంభించిన టి.మంత్రి కెటిఆర్

హైదరాబాద్, జనవరి 2: ఎలక్ట్రానిక్ విధానం ద్వారా వాహన యజమానులకు ఆర్‌సి, డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీచేసే ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రవేశపెట్టి అమలు చేయాలని రాష్ట్ర ఐటి, పంచాయితీ రాజ్ మంత్రి కె తారకరామారావు అన్నారు. శనివారం ఇక్కడ ఆయన వాహన ఈ-బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ-బీమాతో వాహనదారులు మొబైల్ ఫోన్లద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాల్లో మరణించిన వారికి వాహన ఈ-బీమా పథకం ఎంతో ఉపయుక్తమన్నారు. దేశం మొత్తమీద వాహన ఈ-వాహన బీమా పథకాన్ని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామన్నారు.
ఐఆర్‌డిఏ సమన్వయంతో ఐటి, రవాణా, పోలీసు శాఖలు కలిసి ఈ-వాహన బీమా పథకాన్ని అమలు చేస్తాయన్నారు. సురక్షితం, భద్రత కోసం వాహనదారులు బీమా చేయించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వాహన యజమానులు బీమా సదుపాయం కల్పించుకోవాలన్నారు. ఈ-వాహన బీమా సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకునేలా చైతన్యం తీసుకొస్తామన్నారు. ఇన్స్యూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ ఏజన్సీలు ఈ పథకం అమలుకు తెలంగాణను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఎలక్ట్రానిక్ మోటార్ ఇన్సురెన్స్ విధానం వల్ల బీమా సదుపాయాన్ని వాహన యజమానుల ఇంటి వద్దే డెలివరీ చేసేందుకు వీలవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కూడా స్వీకరించవచ్చన్నారు. కార్యక్రమంలో రవాణా మంత్రి పి మహేందర్ రెడ్డి, ఐఆర్‌డిఏఐ చైర్మన్ టిఎస్ విజయన్, ఐటి మంత్రి జయేష్ రంజన్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ పాల్గొన్నారు.