ఎడిట్ పేజీ

ఏది అసలు జాతీయత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ మాతా కీ జై నినాదంపై సెక్యులరిస్టులు చేస్తున్న మరో ‘కృత్రిమ’ వాదం ఇలా ఉంది: ‘‘ సెక్యులర్ రాజకీయాలను, అణచివేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నందువల్ల, ఆ నినాదం చేయాలని మాపై ఒత్తిడి తీసుకొని రావద్దు. అటువంటి నినాదాలు చేయాలని దేశ ప్రజలపై ఎవ్వరూ వత్తిడి తీసుకొని రాలేదు.’’ అన్నింటికీ మించి ఈ నినాదం ఆర్‌ఎస్‌ఎస్ స్వకపోల సృష్టి కాదు. స్వాతంత్రోద్యమ కాలంలో లక్షలాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన నినాదం అది. ఇంకా మనం ఏది జాతీయత, ఏది జాతీయత కాదు అనే అంశాలపై చర్చలు జరుపుతున్నామంటే అందుకు కారణం మన రాజకీయాల్లో దట్టంగా అలుకుపోయిన కుళ్లు వల్ల మాత్రమే!

భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా విసిరిన 3జాతీయతావాద2 పాచిక లౌకికవాదుల్లో కలవరం రేపింది. జాతీయతావాదంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఘనత వహించిన సెక్యులర్ పార్టీలు, వామపక్ష పార్టీల పరిస్థితి బిజెపి వ్యూహంతో కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఇప్పుడవి 3్భరత్ మాతా కీ జై2 అని నినదించలేవు..అలాగని మతతత్వ2 బిజెపితో అంటకాగనూ లేవు. మరిప్పుడు ఆ పార్టీలు ఏం చేయబోతున్నాయి?
అందుకు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం మన జిత్తులమారి రాజకీయవేత్తలకు వెన్నతోపెట్టిన విద్యనే! ‘జాతీయత అనేది కేవలం భాజపా/ఆర్‌ఎస్‌ఎస్ స్వంత ఆస్తి కాదు’, ‘జాతీయత గురించి ఆర్‌ఎస్‌ఎస్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు’, ‘గాంధీ హంతకులు జాతీయత గురించి ఎట్లా మాట్లాడతారు?’, ‘్భరత్ మాతా కీ జై అంటూ నినదించమని ఒకరిపై ఏవిధంగా వత్తిడి తెస్తారు?’, ‘మరి అట్లా నినదించనివారు దేశభక్తులు కాకుండా పోతారా?’, ‘త్వరలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో భాజపా దీన్ని నెత్తికెత్తుకుంది’, ‘జాతీయతను గురించి మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ఎస్ వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారా?’..ఈ రకంగా వారి వాదన సాగుతోంది.
మనం ఇక్కడ ఒకటి అర్ధం చేసుకోవాలి. బూజు పట్టిన, వర్తమాన కాలానికి ఏమాత్రం పనికిరాని సిద్ధాంతమే వీరికి దేశంకంటే ముఖ్యం. నిజంగా వారికి దేశమే ప్రధానమైనట్లయితే వారు స్టాలిన్ లేదా మావోలను అనుసరించరు. చైనా దురాక్రమణ సమయంలో ఆ దేశాన్ని సమర్థించి ఉండేవారు కాదు. మనదేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు వల్ల మాత్రమే చైనాతో సరిహద్దు వివాదం ఏర్పడిందనేది కమ్యూనిస్టుల అభిప్రాయం. అంతేకాదు దేశీయంగా నెహ్రూ అనుసరించిన ప్రతిక్రియాత్మక విధానం, ముఖ్యంగా కేరళలో అనుసరించిన విధానం కూడా అందుకు కారణమని వీరి విశ్వాసం. చైనా యుద్ధాన్ని.. నెహ్రూ స్థానిక సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే కా కుండా, తమను ఏకాకులను చేయడానికి, చట్టవ్యతిరేకులుగా చిత్రీకరించడానికి య త్నించారని కమ్యూనిస్టుల గట్టి నమ్మకం.
యుద్ధ సమయంలో భారత్‌ను, చైనాను ఒకేగాటన కట్టడానికి జ్యోతిబసు యత్నించారు. ముఖ్యంగా ఊహాజనిత మక్‌మోహన్ రేఖపై భారత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయ డం ద్వారా, చైనాను రెచ్చగొట్టిందని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ‘చైనా ఛైర్మనే మన ఛైర్మన్’ అనే నినాదాలు కోల్‌కతా గోడలపై కనిపిస్తాయి. అప్పట్లో నెహ్రూను ఏవిధంగా విమర్శించారో ఇప్పుడు నరేంద్ర మోదీని కూడా అదేవిధంగా వామపక్షీయులు విమర్శిస్తున్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ‘జాతీయత’ అనే అంశాన్ని వెలికి తీసి అనవసర చర్చలు కొనసాగిస్తున్నారంటూ వారు విమర్శిస్తున్నారు.
ఎంతో మృదుభాషి అయిన మహాత్మా గాంధీ కూడా కమ్యూనిస్టులపై కఠిన పదజాలానే్న ప్రయోగించారు. ఆయన తన లేఖల్లో ఈవిధంగా రాశారు. ‘‘ఎంతోమంది కాంగ్రెస్ పెద్దలు వివిధ ప్రావెన్స్‌లనుంచి కమ్యూనిస్టుల గురించి నాకు సుదీర్ఘమైన లేఖలు రాస్తున్నారు. కమ్యూనిస్టులకు తమ పార్టీని సజీవంగా ఉంచడానికి వీలైన ఏ సిద్ధాంతాలు లేకపోవడంతో, వారు తమ చేతికి దొరికిన కర్రలతో ప్రత్యర్థులను బాదే కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు.’’ 1942లో కాంగ్రెస్ ప్రతిపాదించిన క్విట్ ఇండియా తీర్మానాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారనడంతో ఏవిధమైన రహస్యం లేదు. హిట్లర్, రష్యాపై దాడి చేసిన తర్వాత సామ్రాజ్యవాదం, పీపుల్స్ వార్ (ప్రజాయుద్ధం)గా ఎట్లా మారిందీ అందరికీ బాగా తెలిసిందే. అందువల్ల జాతీయత గురించి ఎవరికైనా బోధించాల్సి ఉంటే వారు వారు కమ్యూనిస్టులు మాత్రమే!
త్వరలో వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి కనుక భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకోసం జాతీయతను భాజపా నెత్తికెత్తుకున్నదని అనడమంత హాస్యాస్పదం మరోటుండబోదు. అస్సాంలో తప్ప మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ, భాజపా తన 2014 నాటి ఓట్ల షేరును పెంచుకోవడానికి కూడా పోరాటం సలిపే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఇక అధికారం గురించి మాట్లాడటానికి ఏముంది? అయితే సమస్యల్లా ఎక్కడుందటే, వామపక్షాలు, సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్నవారు ఇప్పుడు భయంతో వణికిపోతున్నాయి. ఇక జెఎన్‌యులో మహిషాసురుణ్ణి పొగడటం, కాళిని సెక్క్ వర్కర్‌గా చిత్రీకరించడం వంటి పనుల వల్ల, వామపక్షీయులు తమకు అత్యంత ప్రియమైన పశ్చిమ బెంగాల్‌లో భారీగా మూల్యం చెల్లించబోతున్నారు. ఇక ఇప్పుడు జాతీయతపై దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభం కావడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన లెఫ్ట్ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
భారత్ మాతా కీ జై నినాదంపై సెక్యులర్ పార్టీల్లో నెలకొన్న సందిగ్ధత ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో చాలా స్పష్టంగా కనిపించింది. భారత్ మాతా కీ జై అని నినదించడానికి అంగీకరించని ఏఐఎంఐఎం ఎమ్మెల్యేను, భాజపా,శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిలు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి బహిష్కరించాయి. మరి ఈ ఎఐఎంఐఎం ఎమ్మెల్యేను సమర్ధిస్తే జాతీయత విషయంలో తాము విశ్వసనీయత కోల్పోవాల్సి వస్తుందని, భాజపా తమను ఆధిక్షేపిస్తుందని సెక్యులర్ పార్టీలు భయపడ్డాయి. కానీ మళ్లీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ ప్రజలపై బలవంతంగా జాతీయతను ఎందుకు రుద్దుతున్నదంటూ యధావిధి ప్రేలాపనలు! ఇంతకు మించిన నయవంచన ఇంకేముంటుంది?
భారత్‌ను ముక్కలుగా చేస్తామంటూ దేశ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్థులను సమర్ధిస్తూ వీరు చేసే వాదనలు మరీ దారుణం. కేవలం నినాదాల వల్లనే భారత్ విధ్వంసమవుతుందా? అంటూ వీరు అడ్డంగా వాదించడమంత దౌర్భాగ్యం మరోటి ఉంటుందా? మరి ఈ సెక్యులర్ ‘ప్రవక్తలు’ ఒక్కటి మరచిపోతున్నారు. స్వాతంత్య్రానికి ముందు, ముస్లింలీగ్ కూడా సరీగ్గా ఇటువంటి నినాదాలతోనే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది! నిసిద్‌హజారి తన పుస్తకం ‘‘మిడ్‌నైట్ ఫ్యూరీస్’’ అనే పుస్తకంలో ఈవిధంగా రాశారు. ‘‘...చాలామంది ప్రముఖ ముస్లింలకు బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టడం ఇష్టం లేదు. సంఖ్యాబలంతో హిందువులు ప్రజాస్వామిక భారత్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు. అందువల్ల కేవలం బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే తమ ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఈ ముస్లింలు భావించారు.’’ ఇదే మార్గాన్ని ముస్లింలీగ్ కూడా అనుసరించింది. హిందువుల ఆధిపత్యం కింద ఉండే భారత్ కంటే, బ్రిటిష్ రాజ్ కొనసాగడమే ఉత్తమమని ముస్లింలీగ్ భావించింది. వారిలో హిందువులంటే ఎంతటి ద్వేషమున్నదంటే..కనీసం వందేమాతరం లేదా భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేయడానికి వారు ఎంతమాత్రం అంగీకరించలేదు.
తన గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అని నినదించబోనని అసదుద్దీన్ ఒవైసీ అనడాన్ని చూస్తుంటే, స్వాతంత్య్రానికి ముందు ముస్లింలీగ్ చేసిన ప్రచారం గుర్తుకు వస్తోంది. నాటి ముస్లింలీగ్ ప్రచారమే తర్వాత దేశ విభజనకు, పెద్ద ఎత్తున జాతి విధ్వంసానికి దారితీసింది. ముస్లిం లీగ్ చివరకు గాంధీజీని కూడా వదిలిపెట్టలేదు. ఆయన్ను కేవలం హిందువులకు మాత్రమే నాయకుడిగా పరిగణించింది. నిసిహజారి ఇంకా ఇలా రాశారు: ‘‘గాంధీజీ మరణం తర్వాత ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారి వౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించింది. తర్వాత వివిధ దేశాలు వరుసగా, ఈ విషాదం క్రమంగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య సర్దుబాటుకు దారితీస్తుందని భావిస్తున్నామంటూ తమ సందేశాల్లో పేర్కొన్నాయి. కానీ జిన్నా ఇచ్చిన సందేశంలో ఏవిధమైన భావోద్వేగం లేదు. కేవలం ‘‘హిందూ సమాజం నుంచి ఉద్భవించిన గొప్ప నేత’’అని మాత్రమే పేర్కొన్నాడు.
కొంతమంది గుర్తు తెలియని బయటి వ్యక్తులతో పాటు, జెఎన్‌యు విద్యార్థులు, కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతం త్య్రం ఇవ్వాలని, భారత్‌ను ముక్కలు చేయాలంటూ చేసిన నినాదాలు కేవలం నినాదాలకే పరిమితం కాదు. గాఢంగా నాటుకుపోయిన భావం, కుట్రలకు సంకేతం. భగత్‌సింగ్‌తో పోలుస్తున్న కన్హయ్య కుమార్ అటువంటి దేశ వ్యతిరేక నినాదాలు చేసి ఉండకపోవచ్చు. కానీ అతను దుష్కృత్యానికి ప్రోత్సాహకుడు. అతను ‘బయటివారిని’ క్యాంపస్‌లోకి అనుమతించాడు. జెఎన్‌యుఎస్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడి హోదాలో ఆ సమావేశం వద్ద ఉన్నాడు. అదే సమావేశంలో అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌లను బలిదానం చేసిన వారుగా పేర్కొన్నారు. బయటి వారి ఉద్దేశాలు స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా వారికి జెఎన్‌యులో వేదికను కల్పించాడు. మరి వారు చేస్తున్న నినాదాలను అతను అడ్డుకోలేదు సరికదా కనీసం విశ్వవిద్యాలయ అధికార్లకు ఫిర్యాదు కూడా చేయలేదు. మరి ఇటువంటి శక్తులకు ‘్భవ ప్రకటనా స్వేచ్ఛ’ పేరుతో మద్దతిస్తున్న రాజకీయ నాయకులను జాతి అనుకూలురు అనాలా? లేక జాతి వ్యతిరేకులు అనాలా?
భారత్ మాతా కీ జై నినాదంపై సెక్యులరిస్టులు చేస్తున్న మరో ‘కృత్రిమ’ వాదం ఇలా ఉంది: ‘‘ సెక్యులర్ రాజకీయాలను, అణచివేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నందువల్ల, ఆ నినాదం చేయాలని మాపై ఒత్తిడి తీసుకొని రావద్దు. అటువంటి నినాదాలు చేయాలని దేశ ప్రజలపై ఎవ్వరూ వత్తిడి తీసుకొని రాలేదు.’’ అన్నింటికీ మించి ఈ నినాదం ఆర్‌ఎస్‌ఎస్ స్వకపోల సృష్టి కాదు. స్వాతంత్రోద్యమ కాలంలో లక్షలాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన నినాదం అది. ఇంకా మనం ఏది జాతీయత, ఏది జాతీయత కాదు అనే అంశాలపై చర్చలు జరుపుతున్నామంటే అందుకు కారణం మన రాజకీయాల్లో దట్టంగా అలుకుపోయిన కుళ్లు వల్ల మాత్రమే!