మెయన్ ఫీచర్

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న అనైతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు ఉంది. దానిని అబ్దుల్‌కలాం రోడ్‌గా మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కొందరు వ్యతిరేకించారు. ఇందుకు కారణం ఏమిటి? ఔరంగజేబు రోడ్డును ఛత్రపతి శివాజీరోడ్‌గా మారిస్తే అభ్యంతరం చెప్పేవారు ఉండవచ్చు కాని కలాంరోడ్డుగా మారిస్తే తప్పేమిటి? అంటే కలాం దేశభక్తుడైన ముస్లిము. ఔరంగజేబు ఈ దేశాన్ని దోచుకున్నవాడు. సూడో సెక్యులరిస్టులు వ్రాసిన చరిత్రలో ఔరంగజేబు నిరాడంబర జీవితాన్ని గడిపేవాడు. తన బట్టలు తానే కుట్టుకునేవాడు- వంటి వాక్యా లు చిన్నప్పటినుండి మనం పాఠ్యాంశాలుగా చదువుకుంటూనే ఉన్నాము. అంటే విద్యార్థుల మనస్సులను బాల్యదశనుండే కలుషితం చేసే విద్యావిధానాన్ని ఆంగ్లేయులు సోకాల్డ్ సెక్యులరిష్టులు రూపొందించారు. తత్ఫలితంగా జాతీయ చైతన్యం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంతరించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో అందరి లక్ష్యం బ్రిటీషువారిని పంపివేయటం. దీనిని నెగిటివ్ పేట్రియాటిజం అంటారు. 1947 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పాజిటివ్ పేట్రియాటిజం నిర్మించడానికి ప్రయత్నించలేదు. జీరోలను హీరోలుగా చిత్రిస్తూ దేశ చరిత్రలు నిర్మించారు. అప్రాధాన్యతా రంగాలను ముందుకుతెచ్చి ప్రాధాన్యతలను వెనుకకు నెట్టారు. కావాలని బుద్ధిపూర్వకంగా మన పూజనీయ శ్రద్ధాకేంద్రాలను కించపరిచి పాశవికానందం అనుభవించారు. ఇవన్నీ ప్రజాస్వామ్యం పేరుమీదనే జరిగాయి.
సెప్టెంబరు 23 బుధవారం 2015 దినపత్రికలోని ఈ వార్త చూడండి. మద్యం షాపులకోసం తెలంగాణాలో దరఖాస్తుల వరద- 2216 షాపులకోసం 15వేల దరఖాస్తులు-ఒక్కో దరఖాస్తుకు 50వేల ఫీజు నిర్ణయించగా మొత్తం 100 కోట్ల దరఖాస్తు ఫీజుల ఆదాయం వచ్చింది. ఇది కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగమే. భారత ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రధాన లోపం ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఏ చట్టమైనా చేయవచ్చు. అతి తక్కువ ఓట్లతో అధికారంలోకి రావచ్చు. నూటిలో యాభైశాతం పోల్ కావు. తక్కిన వాటిలో ఒకనికి పాతిక ఓట్లు మరొక ఇద్దరికి పదిహేను, పది వచ్చాయనుకోండి- పాతిక ఓట్లు వచ్చినవాడు ఎన్నిక అవుతున్నాడు. అంటే దాదాపు డెబ్బది ఐదుశాతం ఓటర్లు అతన్ని ఎన్నుకోలేదనే సత్యాన్ని ఈ ప్రజాస్వామ్యం దాచిపెడుతున్నది. ఇలా భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా జరుగుతున్నది. అలాగే అభ్యర్థికి నైతిక విలువలు ఆర్థిక పవిత్రత, విద్యార్హతలు కూడా ప్రత్యేకంగా ఉండనక్కరలేదు. జైలునుండి నామినేషన్ వేసి ఎన్నికైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉగ్రవాదులు ఎన్నికలలో పోటీచేసి నెగ్గుతున్నారు. కలర్ టి.వి.- లాప్‌టాప్‌లు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. అసంభవమైన ఎన్నికల హామీలు ఎరగావేసి ఓట్లు గెలుచుకుంటున్నారు. ఇదంతా చట్టబద్ధంగానే జరుగుతున్నది.
ఒక పార్టీ గుర్తుతో గెలిచి ఎన్నికల తర్వత మరో పార్టీలోకి మారటం సర్వసామాన్యమయింది. ఇది అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధంకూడా. ఐనా తమకుగల విశేషాధికారాలను ఉపయోగించుకొని స్పీకర్లు వీరిపై చర్యలు తీసుకోవటంలేదు. కారణం సామాన్యంగా స్పీకర్ అధికార పార్టీనుండే ఎన్నుకోబడతాడు. మన ఎన్నికల ప్రక్రియలోగల వౌలిక లోపాలను కొందరు మేధావులు ఎత్తిచూపారు. దేశం లో ఒక పార్టీని నూటికి నలభైశాతం ఓట్లువచ్చినా వారికి అధికారం దక్కకపోవచ్చు. ముప్పది శాతం ఓట్లు వచ్చినా వారు పాలకులు కావచ్చు. కారణం సమిష్టిదామాషా మీద ఆధారపడి కాక వ్యక్తుల ఓట్ల సంఖ్యమీదనే జయాపజయాలు నిర్ణయింపబడుతాయి. అలాగే ఓట్లుచీల్చే (స్పాయిల్డ్ కాండిడేట్స్) సంఖ్య నాన్ సీరియస్ అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంది. వీటన్నింటినీ అధిగమింపవలసి ఉంది. ఒక అభ్యర్థి నామినేషన్ వేసి తాను విత్‌డ్రా చేసుకోవటానికి మరొకరి నుండి డబ్బు ఆశించటం సర్వసామాన్యంగా జరుగుతున్నది.
వర్తమాన ప్రజాస్వామ్యాన్ని శ్రేష్టప్రజాస్వామ్యంగా మార్చడానికి సామాజిక సమరసత చాలా ముఖ్యం. ఎన్నికల సమయంలో వర్గ చైతన్యంవలెనే కుల చైతన్యం పడగవిప్పుతున్నది. ఇటీవల ఒకరు మాట్లాడుతూ ఆరక్షణ విధానంలో తేడాలు వస్తే భౌతిక దాడులకు సిద్ధంగా ఉన్నాము అని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి విజయాలు మొత్తం కుల చైతన్యంమీద ఆధారపడినట్టివే. ప్రత్యేకంగా ఏ ప్రాంతంలో ఏ కులస్థుల ఓట్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆ కుల అభ్యర్థిని నిలబెట్టడం అందరికీ తెలుసు. అంతేకాదు సికిందరాబాదులో క్రైస్తవుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి కాబట్టి మేరీరవీంద్రనాథ్, జయసుధ వంటివారిని నిలబెడితే లోగడ విజయం సాధించారు.
ప్రజాస్వామ్యంలో నూటికి యాభై ఒక్క మంది ఏదిచెపితే అది నిజం- నలభై తొమ్మి ది మంది చెప్పినది అబద్ధం అవుతుంది- దీనికి పరిష్కారం ఏమిటి?? ఎన్నికలలో మేధావులూ నిజాయితీపరులు నిలువగలిగే ఆర్థిక స్తోమత అవసరం అవుతున్నది. అంటే ఇదొక భారీ పరిశ్రమవలె మారింది. ప్రపంచంలోని అతి పెద్దప్రజాస్వామ్యాలల్లో మొదటిది భారత్, రెండవది అమెరికా- భారత్‌లో ఉన్నన్ని సమస్యలు అమెరికాలో లేవు. అక్కడ శ్రమించి పనిచేసే మనస్తత్వం ఉంది. ఇక్కడ సోమరిపోతులకు గౌరవమూ శ్రామికులకు పేదరికమూ మిగులుతున్నది. ఇది వ్యవస్థాలోపమే. ఇందుకు తగిన రీతిలో ఎన్నికల ప్రక్రియను రాజ్యాంగ వ్యవస్థను మార్చవలసి ఉంటుంది.
శ్రేష్టప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన బాధ్యత తక్కిన అంగాల మీద కూడా ఉంది. పార్లమెంటు, న్యాయస్థానం, నిర్వహణ సంస్థ, ఫోర్త్ ఎస్టేట్ అన్నీ సరిగ్గా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలుగుతుంది. భారత న్యాయస్థానాల మీద ప్రజలకు విశ్వాసం ఉంది. ఐతే న్యాయ కోవిదులు కాకిని కొంగగా భ్రమింప జేయగలిగిన వారున్నారు. ఉదాహరణకు సల్మాన్‌ఖాన్‌కు ట్రైల్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. హైకోర్టు విడుదల చేసింది. కేసు తిరిగి సుప్రీంకోర్టు చేరింది. ఇలా చాలాసార్లు జరిగాయి. ఇందులో ఎవరినీ తప్పుపట్టలేము. నిర్భయపై అత్యాచారం జరిగిన కేసులో దోషిని ‘మైనర్’ అనే సాంకేతిక కారణం చూపి విడుదలచేశారు. అందుకోసం రాజ్యసభలో కొత్త చట్టం తెచ్చి మైనర్ శబ్దానికి నిర్వచనం మార్చారు. యూనియన్ కార్బైడ్ కేసు దాదాపు ముప్పది సంవత్సరాలు సాగింది. ఇవన్నీ దేనికి సంకేతాలు? న్యాయవ్యవస్థ గొప్పదే కాని దాని అమలుచేసే విధానంలో రాజకీయ జోక్యం ఉండకూడదు అని కదా? ఇక పాలనా నిర్వహణ బ్యూరోక్రసీ చేతుల్లో ఉంటుంది. డెమోక్రసీకి బ్యూరోక్రసీ కన్నులు- కాళ్లు. అలాంటప్పుడు మన బాబులు బాధ్యతాయుతంగా ఉండాలి. ఆప్ పార్టీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్ గూర్చి పత్రికలలో వార్తలు వచ్చాయి. సిబిఐ ఆయన ఆఫీసుమీద దాడిచేయటం సంచలనం సృష్టించింది. కాబట్టి సారాంశం ఏమంటే ఒక శ్రేష్ట వ్యవస్థ నిర్మింపబడాలంటే శరీరానికి అంగాల వలె అన్ని విభాగాలు సక్రమంగా పనిచేయవలసి ఉంటుం ది.
ఐతే భారతదేశంలో అధిక జనాభా అవిద్య- అవినీతి- ప్రజాస్వామ్యాన్ని సర్వశ్రేష్టంగా ఉంచడానికి దోహదం చేయలేకపోతున్నాయి. ఒక ప్రతిపక్షం బాధ్యత ఏమిటి? పాలకపక్షం అపమార్గంలో పోతుంటే చెక్ పెట్టడం. కాని మన దేశంలో కక్షతో పార్లమెంటునే సాగనివ్వటం లేదు. అంటే దేశంకన్నా పార్టీ రాజకీయాలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇది కీలకమైన అంశం. మనం ఎక్కువగా బ్రిటన్‌మీద ఆధారపడి పార్లమెంటరీ వ్యవస్థను నిర్మించుకున్నాం. బ్రిటన్‌లో కూడా డెమొక్రాట్లు కన్సర్వేటివ్‌లు- పూర్వం విగ్గులు-టోపీలు పరస్పరం కలహించుకునేవారు. కాని అందరూ దేశభక్తులే. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు పార్టీలకతీతంగా అంతా కలిసి దేశాన్ని రక్షించుకున్నారు. కాని మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు. అధికార దాహంతో పాలకపక్షాలను ఇబ్బందిపెట్టాలని ప్రతిపక్షాలు- ఆలోచిస్తుంటాయి. అంతేకాదు అనువంశిక రాజకీయాలు రాచరికపు పోకడలు మన ప్రజాస్వామ్యంలో పోలేదు. అందువలన శ్రేష్ట ప్రజాస్వామ్య నిపుణుల ఉటోపియాగా మిగిలిపోతున్నది.
చట్టసభలలోకి స్థాయి సభ్యత లేని వ్యక్తులను ప్రజలు పంపితే దేశం నష్టపోతుంది. ఐదు నిమిషాలపాటు ఓటరు వివేకం ప్రదర్శించకపోతే ఐదేళ్లపాటు దేశం బాధపడవలసి వస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లు పరిపాలనా సంస్కరణలలో భాగంగా పార్లమెంటులో ఆమోదింపబడింది. కాని రాజ్యసభ సభ్యులు దానిని నిలిపివేశారు. అందుకు వారు చూపిన కారణాలు చాలా పేలవమైనవి. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు జారీచేయటం ఒకరోజు కారణంగా చెప్పారు. ఆప్ పార్టీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌గుప్త ఆఫీసుపై సిబిఐ దాడి మరొకరోజు కారణంగా చూపారు. అయోధ్యలో విహెచ్‌పి వాళ్లు రాతి శిల్పాలు మొదలుపెట్టారు అని మరొకరోజు కారణం చూపారు. వీటికి జి.ఎస్.టి. బిల్లును నిలిపివేయడానికి ఏమైనా సంబంధం ఉందా? సుమారు పది సంవత్సరాలకు పూర్వం నేను అయోధ్య వెళ్లినప్పుడు అక్కడ రాతి చెక్కడాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. జి.ఎస్.టి బిల్లును ఆపటంవల్ల అయోధ్య సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? అంటే ప్రధాన ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు మరొకసారి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదు. ఇది ఢిల్లీకే కాదు హైదరాబాదు గల్లీకి కూడా వర్తిస్తుంది. శ్రేష్టప్రజాస్వామ్యం అంటే అసెంబ్లీలో అశ్లీల పద ప్రయోగంకాదు. తెనే్నటి విశ్వనాథం, ఎన్.జి.రంగా, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్యలు ఎప్పుడూ అసెంబ్లీ- పార్లమెంటులల్లో అసభ్యంగా ప్రవర్తించలేదు.
హర్యానా ప్రభుత్వం పంచాయతీ, స్థానిక సంస్థల నిర్వహణకు పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను నిర్ణయంచడం చర్చకు దారితీసింది. భారతదేశంలో నేటికీ 17 కోట్లమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారికి రాజ్యాంగ బద్ధమైన అధికారాన్ని తిరస్కరిం చడమేనని కొందరు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ నియమాలను అమలు చేయవలిస్తే అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులకు ఎందుకు వర్తించదు? అని అడిగిన వారు కూడా ఉన్నారు. పంచాయతీల్లో వెచ్చించే లక్షల ధనం కనీస విద్యార్హత లేనివారి వల్ల దుర్వినియోగం చేయ బడుతుందని స్వార్థపరులు నిరక్షరాస్యు లను వంచిస్తారని లోక్‌సభలో అలాంటి అవకాశ ముండదని ఒక సమాధానం వచ్చింది. నిజానికి దేశాన్ని దోచుకున్న బడా స్కామ్ మాస్టర్లు విద్యావంతులే. అంతేకాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో నిరక్షరా స్యులు ఎలా ఉన్నారనేది కూడా చర్చనీయాం శమే కదా? మొత్తానికి శ్రేష్ఠ ప్రజాస్వామ్యానికి విద్యార హతకు గల సంబంధం మరొకమారు ఇప్పుడు చర్చనీయాంశం కావడం ఆలోచిం పదగ్గ అంశమే. పంచాయతీలలోని అభ్యర్థుల విద్యార్హతల గురించి గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టులు సానుకూలంగా స్పందిచాయ. ఇప్పుడు రాజకీయ లబ్దికోసం కొన్ని వర్గాలు హర్యానా ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేయడం తగ దు. మనకు పార్టీలు ముఖ్యమా? లేక దేశం ముఖ్యమా? అన్నది తేల్చుకోవాలి.

- ముదిగొండ శివప్రసాద్