మెయన్ ఫీచర్

ఉగ్రవాదమే పాక్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్ మనదేశంలో మొ త్తం మూడు రోజులు పర్యటించారు. ఉగ్రవాదం, అది విసురుతున్న సవాలును ఎంత సమర్ధవంతంగా మనం ఎదుర్కొనగలమన్నది ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటనలోని ప్రధాన ఇతివృత్తమన్న సంగతి మనం గుర్తించాలి. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన మన సైనిక పాటవ ప్రదర్శన కంటే ముందు మన నిఘా నిపుణులను అనుక్షణం కలవరానికి గురిచేసింది పొంచి ఉన్న ఉగ్రదాడి ప్రమాదం. ముఖ్యంగా మనం ముఖ్య అతిథిగా ఎవరినైతే ఆహ్వానించామో ఆయనపైనే తీవ్రవాద ముష్కరులు దాడి చేసే అవకాశమున్నదన్న సమాచారం. గత నవంబర్ 13న ప్యారిస్‌పై దాడికి పాల్పడిన తమ క్యాడర్ సభ్యులను ఫ్రాన్స్ భద్రతా దళాలు ఏరివేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ప్రతిజ్ఞ చేసింది.
ప్యారిస్‌పై దాడి సంఘటన ముగిసిన తర్వాత, ఉగ్రవాదుల బెదిరింపు నేపథ్యంలో ఫ్రాన్స్‌కు సంఘీభావం తెలపడం సముచితంగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాన్‌ను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనుకున్న విధంగానే భారత్-ఫ్రాన్స్‌లు తమ ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాద వ్యతిరేక పోరుకు పిలుపునిచ్చాయి. ఇందులో పేర్కొన్న వివిధ తీవ్రవాద సంస్థల్లో దక్షిణాసియా-పాకిస్తాన్‌కు సంబంధమున్న ముష్కర గ్రూపుల పేర్లు కూడా చోటు చేసుకోవడం సహజ పరిణామమే. ఈ ప్రకటనలో ఉగ్రవాద అంశానికి సంబంధించి ప్రయోగించిన పదజాలం ఈవిధంగా ఉంది. ‘‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దానికి ప్రేరణ, మూలాలు ఏవైనా..ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు ఎటువంటి వారైనప్పటికీ, కఠిన చర్యలు తీసుకోవడానికి నిబద్ధులమై ఉన్నాం.’’ లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, హక్కానీ నెట్‌వర్క్, అల్‌ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులను ఈ ఉమ్మడి ప్రకటనలో చేర్చారు. గురుదాస్‌పూర్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ, పఠాన్‌కోట్ దాడి ముష్కరులతో సహా 2008 ముంబయి దాడులకు కారకులైన వారిని కూడా చట్టపరిధిలోకి తీసుకొని రావాలని పాకిస్తాన్‌ను కోరాయి. ముం బయి దాడి మృతుల్లో ఇద్దరు ఫ్రెంచ్ జాతీయులు కూడా ఉండటం గమనార్హం. ఇటువంటి దాడులు భవిష్యత్తులో జరగరాదని హెచ్చరించాయి.
దక్షిణాసియాలో భారత్ నిర్వహిస్తున్న సుస్థిరమైన పాత్రను హొలాన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ వ్యవహరిస్తున్న తీరు, పాక్‌తో ఉమ్మడి చర్చలు జరపడానికి ముందుకు రావడం వంటివి ఈ సందర్భంగా హొలాన్ ఉటంకించారు.
అంతా బాగానే ఉంది...కానీ పాక్‌తో చర్చలను పునరుద్ధరించాలన్న నిర్ణయం, ఎంతమేర సానుకూల ఫలితాలిస్తుందనేది అసలు ప్రశ్న. ముఖ్యంగా ఉగ్రవాదంపై పాక్ వైఖరిలో ఎంతవరకు మార్పు సంభవనీయమనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. జనవరి 20న ఛర్‌దస్సాలోని బచ్ఛా ఖాన్ యూనివర్సిటీపై జరిగిన ఉగ్రవాద దాడి, 2014 డిసెంబర్‌లో పెషావర్‌లోని సైనిక స్కూలుపై ఉగ్రవాదులు దాడి జరిపి అనేక మంది అమాయక విద్యార్థులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఇటువంటి అనుమానం రావడం సహజమే. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐలు తమ వ్యూహాత్మక విధానంలో భాగంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్న సంగతి స్పష్టంగా తెలిసిన అంశమే. మరి ఈ ఉగ్రవాద మూలాలు తెలుసుకోవాలంటే 1980 నాటి కాలాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక చేత్తో కలాష్నికోవ్, మరోచేత్తో ఖురాన్‌ను పట్టుకొన్న ముజాహిద్దీన్ ఉగ్రవాదుల చిత్రాలు ఇప్పటికీ మదిలో మెదులుతాయి. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియన్ సేనలకు వ్యతిరేకంగా వీరు పోరాటం సలిపారు. పాకిస్తాన్‌ను ఇస్లామీకరించే చర్యల్లో భాగంగా నాటి పాక్ పాలకుడు జియా ఉల్ హక్ ఈ ఉగ్రవాద బీజాన్ని నాటి, అది మొలకెత్తి పెను వృక్షం కావడానికి కారకుడయ్యాడు. ముఖ్యంగా దేశాన్ని, సమాజాన్ని ఇస్లామీకరించడానికి జియా ఉల్ హక్ కృషి చేశాడు. దీని ఫలితంగా సున్నీలోని వహా బీ-సలాఫి సిద్ధాంతం బలీయమై క్రమంగా పాక్ సమాజంలో ఆధిపత్యం వహించడం మొదలైంది. దీంతో పాటు 1971 తర్వాత పంజాబ్ జాతీయులే పాలనాధికారాలను చేజిక్కించుకోవడం, ఆధిపత్యం వహించడమూ ప్రారంభమైంది.
లష్కరే తొయ్యబా (లెట్), జేషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను భారత్‌కు వ్యతిరేకంగా పురికొల్పడం, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను ఉసిగొల్పడం అతిముఖ్య భద్రతా విధానంగా మారిపోయింది. రావల్పిండిలోని సైనిక కేంద్ర కార్యాలయం చేతుల్లోకి దేశ నియంత్రణ వెళ్లిపోయింది. దీనివల్ల లబ్ది పొందిన అతికొద్ది మంది ఈ విధానాన్ని సమర్ధించగా, పౌర నాయకత్వం ఈ పరిస్థితిని తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు మద్దతిచ్చే రావల్పిండి విధానాలు అమెరికా, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ దేశాలు తమ స్వప్రయోజనాలకోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ విధానానికి ఆమోదం తెలిపాయి.
1990 ప్రాంతంలో క్రమంగా తలెత్తిన ‘జిహాదీ ఉగ్రవాదం’ పాకిస్తాన్ అనుసరించిన అత్యంత ప్రమాదకర విధానం పుణ్యమాని ఒక స్పష్టమైన రూపురేఖలు దాల్చింది. అయితే పశ్చిమ దేశాలకు చెందిన ప్రధాన మీడియా, నిఘా సంస్థలకు ఈ పరిణామం చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ పైకి మాత్రం తెలియనట్టు నటించడమో, ఉద్దేశ పూర్వకంగా విస్మరించడమో జరిగింది. అన్నింటికంటే విచిత్రమేమంటే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం నిర్వహిస్తున్న పోరులో, పాక్‌ను అగ్రభాగాన నిలుపుతున్నామంటూ అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ప్రకటించడం సరికొత్త వైపరీత్యం. దీనికోసం తమను తాము సమర్ధించుకుంటూ, ప్రపంచాన్ని మభ్య పెట్టడానికి ‘సరికొత్త వివరణలు’ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇది పాక్‌లోని అబొట్టాబాద్‌లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేవరకు కొనసాగింది. సరీగ్గా ఇదే సమయంలో రావల్పిండిలోని సైనిక కేంద్ర కార్యాలయం చేసిన విశ్వాస ఘాతుకం కూడా 2011, మే నెలలో వెల్లడైంది. ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాక్‌ను ముందు నిలుపుతున్నామంటూ చేసిన ప్రకటన అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల దుర్మార్గతకు నిదర్శనం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ముందు నిలుపుతున్నామంటూ గంభీరంగా అమెరికా ఎన్ని ప్రకటనలు చేసినా, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద పీడిత దేశంగా మిగిలిపోయింది. అదే స్థితి ఇప్పటికీ కొనసాగుతోంది.
తన ఆధిపత్యాన్ని గుర్తించాలన్న ఒకే ఒక తలంపుతో ఏ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిందో ఆ ఉగ్రవాద భూతమే పాక్ ప్రభుత్వం, సైన్యాలను తన లక్ష్యంగా చేసుకుంది. ఎట్టకేలకు దాని దృష్టి పర్వేజ్ ముషార్రఫ్ వైపునకు మళ్లింది. 2007లో ముషార్రఫ్..ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదులోని జిహాదీ ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రయత్నించాడు. సాహసించి ఈ చర్య తీసుకున్న పుణ్యమాని తన పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో పాక్ ఉగ్రవాదులు మరింత పేట్రేగి పోయారని చెప్పడానికి 2008 ముంబయి ఉగ్రవాద దాడులే ఉదాహరణ.
పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల పదఘట్టనలు బాగా పెరిగిపోయాయన్నది మాత్రం తిరుగులేని వాస్తవం. పెషావర్, ఛరదస్సా ఉందంతాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో రావల్పిండి అనుసరిస్తున్న ‘వరణాత్మక’ విధానాన్ని మనం ఎన్నడూ మరువరాదు. దీన్ని మాజీ అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ బాగా అర్ధం చేసుకున్నారు. అమె ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘ వెనుక వైపున పాములను పెంచుతూ, కేవలం పొరుగువారిని మాత్రమే కాటువేస్తాయని పాకిస్తాన్ భావిస్తోంది,’’ అన్నారు. విచిత్రమేమంటే, పెషావర్ దుస్సంఘటనను పట్టించుకోకుండా, దీనికి బాధ్యులము తామేనంటూ తాలిబన్లు చేసిన ప్రకటనను ఖాతరు చేయకుండా, పాకిస్తాన్‌లోని కుహనా మేధావులు ఇందుకు కారణం భారతే నంటూ, బదనాం చేయడానికి యత్నించడాన్ని మించిన దౌర్భాగ్యం మరోటి లేదు. చూస్తుంటే పెషావర్ సంఘటన పాకిస్తాన్‌లో అంతర్గతంగా కొనసాగుతున్న ఉగ్రవాద ఏరివేతను మరింత తీవ్రం చేస్తుందని భావించినా, ఛర్‌దస్సా సంఘటనను చూస్తే అందంతా ఒట్టిదేనన్న స్పష్టమవుతోంది. ఇక్కడ విద్యార్ధులను ఆత్మబలిదానం ఇచ్చినవారిగా ప్రచారం చేశారు. నిజానికి విద్యార్థులకు అటువంటి ఉద్దేశమే ఉండదు.
ది ఎకనామిస్ట్ పై రెండు దాడులపై ఈవిధంగా వ్యాఖ్యానించింది, ‘‘ పాకిస్తాన్‌కు చెందిన కుట్ర సిద్ధాంత కర్తలు, సాక్ష్యాధారాలను పక్కన పెట్టి మరీ, పాక్ భూభాగంపై హింసాత్మక సంఘటనలకు భారత్ మాత్రమే కారణమంటూ నిస్సిగ్గుగా ప్రకటించారు.’’ అంతేకాదు ‘‘ఫ్రాంకిస్టైన్’’ భూతాన్ని తమ కాళ్లవద్దకు తీసుకొని రావాలని మరీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు.’’ పఠాన్‌కోట్ దాడిపై అమెరికా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ , ‘‘ఏమాత్రం క్షమార్హం కాని ఉగ్రవాద దాడి ఇది. భారత్ బహుకాలంగా తీవ్రవాద బాధిత దేశంగా కొనసాగతుందనడానికి ఇదొక ఉదాహరణ’’ అని వ్యాఖ్యానించడం, పాకిస్తాన్ నయవంచక వైఖరిని మరోసారి బహిర్గతం చేసింది. ఉగ్రవాద తండాలపై పాక్ మరింత విస్పష్టమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఒబామా నొక్కి చెప్పారు. ముఖ్యంగా అటువంటి నెట్‌వర్క్‌లను చట్టవిరుద్ధం చేయడం, అడ్డుకోవడం, ధ్వంసం చేయడం వంటి ప్రక్రియల ద్వారా నిర్వీర్యం చేయాలని ఆయన స్పష్టం చేశారు. మరి ఇది జరిగే పనేనా? ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తుంటే, పాక్ సైన్యం లేదా ఐఎస్‌ఐలు ఉగ్రవాదం విషయం లో తాము అనుసరిస్తున్న ‘వరణాత్మక’విధానానే్న గట్టిగా పట్టుకొని వేలాడతాయి తప్ప వాటి వైఖరిలోమార్పులు రావడం దుస్సా ధ్యం. దీన్ని తమ జాతీయ విధానంగా అమలు జరుపుతున్నాయి. ఇక్కడ జాతీయ అంటే ‘రావల్పిండి లోని సైనిక కేంద్ర కార్యాలయం’ అని అర్ధం చేసుకోవాలి.

- సి. ఉదయ్ భాస్కర్