సబ్ ఫీచర్

విమ్స్‌పై నిర్ణయం సముచితం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పేదరోగులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంకోసం నిర్దేశించబడిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అహేతుకం. ఈ పథకానికి అంకురార్పణ చేసిన వై.యస్ తర్వాత వచ్చి ప్రభుత్వాలు విమ్స్ నిర్మాణంపై చిత్తశుద్ధి చూపించలేదు. 17 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను 8 విభాగాలకు కుదించేసారు. కావల్సిన పరికరాలను ఇప్పటివరకు సమకూర్చలేదు. ఒక దశలో ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయాన్ని ప్రజావ్యతిరేకత కారణంగా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు విమ్స్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అప్పగించడం వలన వైద్య సేవలను పలికే కార్యక్రమానికి స్వస్తి చెప్పి కేవలం వైద్య విద్యాబోధనకే పరిమితం చేయాలన్న నిర్ణయం పేద ప్రజలకు ఆశనిపాతంలా మారింది. ఎం.సి.ఇ. నిబంధనలను గాలికి వొదిలేసి, పేద ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా విమ్స్‌పై తీసుకున్న నిర్ణయా న్ని తక్షణం ఉపసంహరించుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
శాసనసభలే ‘సుప్రీం’
న్యాయవ్యవస్థ గాని, న్యాయ సభ గాని చట్ట సభలలోనికి రాకూడదు. అసెంబ్లీ స్పీకరు తీసుకునే నిర్ణయాలు చెల్లుతాయా, చెల్లవా అని తేల్చటానికి ‘శాసనసభే గాని, న్యాయ వ్యవస్థగాదు. చట్టసభల్లో సరిగా వ్రర్తించని వారిని సభనుంచి బయటకు పంపే అధికారం స్పీకరుకే వుంది. దీనిలో కోర్టుల జోక్యం తగదు. కోర్టులే శాసనసభా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే ఇక స్పీకరెందుకో చెప్పండి. స్పీకరు తప్పు చేస్తే ‘ప్రివిలేజ్ కమిటీ వుంది. స్పీకరును తొలగించే అధికారం శాసనసభకే వుంది. న్యాయ వ్యవస్థ అత్యుత్తమమైనది. శాసనసభలో శాసనసభ్యుల భవితవ్యాన్ని నిర్ణయించాల్సింది స్పీకరే! స్పీకర్‌కు ఆ అధికారాలు లేకపోతే శాసనసభ అప్రతిష్టపాలవుతుంది. స్పీకర్‌కు సర్వాధికారాలు వున్నాయి. ప్రతిపక్షాలు ఆ విషయాన్ని గ్రహించాలి. కోర్టుల జోక్యం తగదు.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
నాల్గవ తరగతి పోస్టులు భర్తీ చేయాలి
నాల్గవ తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. నిజానికి నాల్గవ తరగతి ఉద్యోగమంటేనే ప్రభువుల వద్ద వంగివంగి సలాములు కొడుతూ బ్రతుకుభారంతో వుంటే జీతగాళ్లు. ఈ పోస్టుల ఖాళీలను భర్తీ చేసే ప్రసక్తే లేదనడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. బ్యూరోక్రసీకి ఆయువుపట్టు నాల్గవతరగతి ఉద్యోగులే. పక్క తెలంగాణలో కెసిఆర్ వర్క్‌చార్జ్‌డ్ తాత్కాలిక అటెండెంట్ల పోస్టులను క్రమబద్ధీకరించేందుకు మానవతాదృక్పథంతో ఉన్నారు. ఇక్కడ మనకు అధికారులపైనే మోజు! వీరి పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. మరి నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ వరమణ వయసును 60 నుంచి 62కు పెంచలేదు? నాల్గవ తరగతి ఉద్యోగుల చేసిన పాపమేంటి? ఎన్నో ఖాళీలున్నప్పటికీ కేవలం ఈ చిన్న పోస్టులపట్లనే తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబించేందుకు కారణమేంటో అర్థం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మరోమారు ఆలోచించాలి.
-మాడుగుల జయలక్ష్మి, అత్తిలి
అశ్రు నివాళులు
దేశంకోసం.. దేశ రక్షణకోసం నిరంతరం శ్రమిస్తున్న జవానులకు మనం ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం. భరతమాత సంరక్షణకై.. ప్రాణాలను సైతం అనుక్షణం అర్పిస్తునే వున్నారు. ఒకవైపు ఉగ్రవాదుల దాడులు, మరోవైపు శత్రు సైనికుల దాడుల నేపథ్యంలో ఎందరో సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. మన వీర సైనికులకు శిరసు వంచి నమస్సుమాంజలులు అందజేద్దాం.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
పెట్రోలు,డీజిల్ ధరలు స్థిరంగా ఉంచాలి
పెట్రోలు, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. పెరిగితే లీటరుకు మూడు నాలుగు రూపాయలు పెరగడం లేదంటే ముప్పై నలబై పైసలు తగ్గడం ఇదీ నేడు కొనసాగుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వీటి రేట్లల్లో మార్పులు చేస్తోంది. వీటి ధరల పుణ్యమాని, దేశంలో సమృద్ధిగా ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇదెక్కడి న్యాయం?
-అయినం రఘురామారావు, ఖమ్మం