సబ్ ఫీచర్

ఉగ్రవాదం... కాంగ్రెస్ మెతక వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు సంతో షం ఉండదు, కోపం కూడా ఉంటుం ది. అందువలన ఎవరైనా నిరపరాధుల ప్రాణాలను బలిగొంటే అది సరియైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రక్రియలున్న సమాజం నుంచి అట్టి చర్య సరియైనది కాదు అనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు. ఫ్రాన్స్‌లో పది మంది పత్రికా విలేఖరులను, ఇద్దరు పోలీసులు ఉగ్రవాదులు హత్య చేయడం అతని దృష్టిలో సరియైనదే, ఉగ్రవాదులకు విరుద్ధంగా ప్రపంచంలో జరుగుతున్న కఠిన చర్యలకు అది సహజమైన ప్రతిచర్యగానే అతను భావిస్తున్నాడు. మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదులు అడ్డు అదుపులు లేకుండా నిరపరాధులను పొట్టన పెట్టుకుంటున్న దేశంలోని ఒక రాజకీయ నాయకుడు వారి బీభత్సకర చర్యలు సరియైనవే అంటూ వారి తరఫున అడ్డులేని వకాల్తా తీసుకోవడం చూస్తే కాంగ్రెసు ఆలోచనా ధోరణి దారి తప్పింది అని అనుకోవడంలో ఎలాంటి పొరపాటు లేదు.
అమెరికా, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ టవర్ మీద ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతి చర్యగానే యావత్ప్రపంచంలోనూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయని అయ్యర్ మణిశంకర్ మాటల ఆధారంగా అనుకోవాలా? అయితే ఉగ్రవాదులు అమెరికాలో సృష్టించిన ఆ విధ్వంసం దేనికి ప్రతిచర్యో అయ్యరు మహాశయుడు స్పష్టం చేయలేదు. వాస్తవానికి అయ్యర్ తన వాదనలలో ముస్లింలనందరిని చేరుస్తున్నాడు. ముస్లింలు అత్యాచారాలకు గురవుతున్నారు కాబట్టే వాటికి ఇవి ప్రతీకార చర్యలంటూ సమర్ధిస్తున్నాడు. ఆ విధంగా ముస్లింలను సమర్ధించాలనుకునే తలంపుతోనే ఉగ్రవాదులను కూడా సమర్ధించడంలో అతను వెనుకాడడం లేదు. అతని ఈ తర్కంతో బహుశా ముస్లింలు కూడా సమ్మతించరు. అతని ఉగ్రవాద సమర్ధింపు అభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అభిప్రాయమని భావించాలా? కాంగ్రెసు పార్టీని దాని సీనియర్ నేతలను వేరువేరుగా పరిగణించలేము. అయితే మణిశంకర్ అభిప్రాయం అతని వ్యక్తిగతమైనది. అది పార్టీ అభిప్రాయం కాదని పార్టీ కొట్టివేసింది. అతని అభిప్రాయంతో పార్టీకి సంబంధం లేదు అని పార్టీ అంటే అది సమంజసమైన జవాబు కాగలదా? ఇది ఇలావుండగా కాంగ్రెసేతర ఇతర సెక్యులర్ పార్టీ నాయకులు అయ్యరును అటు నిందించక, ఇటు సమర్ధించక వౌనముద్ర వహించారు. వారు అయ్యరును సమర్ధించాలి లేదా అతని వక్తవ్యాన్ని ఖండించాలి, వారి వౌనం మరింత నిర్ఘాంతపరుస్తోంది. భారతీయ జనతాపార్టీ సభ్యులు చేసే అతి చిన్న వక్తవ్యాలను రభస చేసి దుమారం లేపి పార్లమెంటును కూడా స్థంభింప జేస్తున్నారు. మరి అయ్యర్ వక్తవ్యానికి స్పందించరేం? గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైంది. దానికి కారణం విశే్లషించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఏ.కె.ఆంథోనీ అధ్యక్షతను ఒక కమిటీని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. హిందూ విరోధిగా పార్టీని ప్రజలు భావించడం కూడా ఓటమికి ఒక కారణం అని కమిటీ చెప్పింది. ఈ ధోరణిని మార్చుకోవాలని హితవు చెప్పిందాకమిటి. మణిశంకర్ అయ్యర్ వంటి నాయకుల హిందూ విరోధ వక్తవ్యాలు పార్టీకి సహాయం చేస్తాయా అన్నది ఒక ప్రశ్న.
పొరుగున ఉన్న పాకిస్తాన్ తన యుద్ధ నీతిలో ఉగ్రవాదాన్ని ఒక భాగంగా పరిగణిస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారికి సైనిక శిక్షణను ఇవ్వడం వారికి ఆయుధాలను అందించడం, ధన సహాయం చేయడంలో ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ అగ్రగామిగానుందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. అయినా పాకిస్తాన్ కపట యుద్ధాన్ని భారత్ ఒంటరిగానే పోరాడుతున్నది. అటువంటి సమయంలో మన ఇంటినుంచి మన వాళ్ళే ఉగ్రవాదులను సమర్థించేలా వ్యవహ రిస్తే ఉగ్రవాదులతో పోరాడడానికి అది నష్టం కలిగించే వైఖరి. పైగా ఉగ్రవాదుల మనోబలం స్వాభావికంగానే పెరుగుతుంది. ఉగ్రవాదులతో పోరాడడం ఒక పార్టీ లేదా ప్రభుత్వం పనే కాదు. ఈ పోరాటంలో దేశవాసులందరూ సంయుక్తంగా పాలుపంచుకోవాలి. ఉగ్రవాదుల దుస్సాహస చర్యలను వెనకేసుకురావడం వారిని సమర్ధించడంతో సమానం. ఈ ప్రవృత్తి ఉగ్రవాదంకన్నా భయంకరమైనది, అపాయకరమైనది. ఇది కాంగ్రెస్ విరుద్ధం (వెర్సెస్)గా భారతీయ జనతాపార్టీ లేదా ప్రభుత్వ విరుద్ధంగా ప్రతిపక్షములకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఎవరైనా అనుభూతి పూర్వకంగా వ్యవహరించాలి. ఉగ్రవాదులతో తలపడడంతో ప్రభుత్వం విఫలమైంది అని స్టేట్‌మెంట్లు ఇచ్చి లేదా ఒక సంప్రదాయం వారిని చిన్న చూపుచూడడం వలననే ఉగ్రవాదం ప్రబలిపోతున్నదని, ఉగ్రవాదుల ప్రతి చర్యలు సరియైనవేనని వారిని సమర్ధించిన కారణంగా కాంగ్రెస్ పార్టీ కోలుకొని తన పూర్వ వైభవాన్ని అందుకోలేదు. తన పూర్వ వైభవాన్ని తిరిగి చేజిక్కించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తన నీతి రీతులను సవరించుకోవాలి. ఇంతగా పార్టీ పతనమవడానికి గల కారణాలను అనే్వషించాలి. దిగ్విజయ్‌సింగ్, సల్మాన్ కుర్షీదుల వక్తవ్యాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగలేదు, పైగా దిద్దశక్యంకాని హాని జరుగుతోంది. ఈ దుర్దశకు వదరుబోతు నేతల వక్తవ్యాలు, వారిని తగు సమయంలో అంకుశంతో జడిపించని పార్టీ అగ్రనేతలు పూర్తిగా బాధ్యులు. ఉగ్రవాదం గురించి కాంగ్రెస్‌లో ఒక దానితో వేరొకటి పొంతన కూడని వేర్వేరు రాగాలు వినిపిస్తూ ఉంటాయి. అది బటాలాహౌస్ ఎన్‌కౌంటరు కావచ్చు. 26/11న ముంబాయి మీద ఉగ్రవాదులు జరిపిన దాడి తరువాత సంఘటనలు కావచ్చు. ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ పార్టీ మెత్తదనాన్ని ఎందుకు చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఆలోచించవలసిన తరుణం కాదా?

- గుమ్మా ప్రసాదరావు