సబ్ ఫీచర్

మానవతా వాదమే ఆయన కథావస్తువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేకంగా ఏ వాదాన్నీ కాకుండా, ఇంకా చెప్పాలంటే మానవతావాదాన్ని పెంచే రచనల్ని బలివాడ కాంతారావు చేశారు. నేవీలో పనిచేస్తూ ఆయన మనదేశంలో విభిన్న అపదేశాల్ని చూశారు. సంస్కారాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఈ అనుభవంతో రాశారు కాబట్టి ఆయన రచనల్లో మనదేశమంతా కనిపిస్తుంది.
ఆయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా మాడపం గ్రామం. పుట్టింది గ్రామంలోనైనా ఆ తర్వాత విశాఖపట్టణం, ఢిల్లీ లాంటి నగరాల్లో ఉన్నారు. అందుకని ఆ తర్వాత ఆయన వాళ్ల గ్రామానికి వెళ్లి, అక్కడ మనుషుల్ని కలుసుకుని చాలా విషయాలు తెలుసుకొని రచనలు చేశారు. ఆయన రచనా వస్తువు ఊహల్లోంచి ఎప్పుడూ పుట్టుకురాలేదు. తనకు తెలిసిన సంఘటనలను, వ్యక్తుల్లోనుంచి పుట్టుకొచ్చింది కాబట్టి, ఆయన రచనలలో జీవముంది. అందుకే అర్థమయ్యేటట్టు, సహజత్వముట్టిపడేట్లు రాయడంతో ఆయన రచనలు చాల సహజంగా ఉంటాయి. అవి చదువుతుంటే ఆ సంఘటనలను మన మధ్య జరిగినవే అనిపిస్తాయి. ఆ మనుషులు మనమధ్యే ఉన్నవారే అనిపిస్తుంది.
తన వ్యక్తిగత అభిప్రాయాలకు రచయిత లొంగపోకూడదు. వాస్తవాలకు దూరంగా వస్తువునెప్పుడూ స్వీకరించకూడదు. అలాగే పూర్తి పరిశీలన లేకుడా రచయిత త్వరత్వరగా నిర్ణయాలకి రాకూడదు. చదివిన పాఠకుల్ని రచనలు సరైన ధోరణిలో ఆలోచింపచేయాలన్న ఖచ్చిత భావాలున్న బలివాత కాంతారావుకు కొన్ని నవలలు రాయడానికి సంవత్సరాలు పట్టింది. ఆలోచన వచ్చీరాకముందే రాయడం ఆయన అభిమతం కాదు. ఎదడులో పండిన తర్వాత సరైన అక్షరరూపాన్నివ్వగలని భావించారు. ఆ పంథానే అనుసరించారు.
‘‘నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లో గొల్ల రామస్వామి మా గ్రామంలో చాలా చక్కగా కథలు చెప్పేవాడు. అతని నుంచే నేను అవతలివాళ్లు మెచ్చుకునేట్టు కథనెలా మలచాలో నేర్చుకున్నాను. ఒకసారి మా ఊళ్లో పిల్లలు పోట్లాడుకుంటుంటే వాళ్ల తాలూకు పెద్దలూ పోట్లాడుకోసాగారు. వాళ్లలో ఒక స్ర్తి సోదరుడు దూరాన నిల్చుని చాలా జాగ్రత్తగా అంతటినీ గమనిస్తున్నాడు. నువ్వు వాళ్లతో కలవక ఇలా దూరాన ఎందుకు నిల్చున్నావన్ని అడిగాను. విషయం మీద సరైన అవగాహన వస్తే, వాళ్ల మధ్యన సంధి కూర్చడానికి వీలవుతుందని అలా నిల్చున్నానన్నాడు. అలాగే రచయిత కూడా ఇవతలనుంచి సమాజాన్నంతటిని చూడగలగాలి. నాల్గువందల దాకా కథానికలు రాసిన ఆయన 8 నాటకాలు యాత్రా రచనలు, వ్యాసాలు రేడియో నాటకాలు రాశారు. దాదపు 35 దాకా నవలలు రాశారు.
శారద (1947), పరాజయం (1949). అన్నపూర్ణ (1950), బూచి, సుగుణ (1951), గోడమీద బొమ్మ (1953), దగాపడిన తమ్ముడు (1957), మత్స్యగంధి (1962), సంపంగి (1970), నాలుగు మంచాలు (1966), పుణ్యభూమి (1969), ఇదే నరకం-ఇదే స్వర్గం (1974), వంశధార (1982), ఢిల్లీ మజిలీలు (1984), చైత్రపర్వం (1977), లవ్ ఇన్ గోవా (1984), మరో రాజశేఖర చరిత్ర (1986), అజంతా (1986), ఎల్లోరా (1988) నవలతో పాటు ఆయన రాసి ‘అమ్మి అండ్ జన్మభూమి’ మరణానంతరం అచ్చయింది.
నవల రాయడం కొంత శ్రమతో కూడుకున్నది. ప్రచురణకు నోచుకోకపోతే కష్టమవుతుంది. అందుకే నవలలు రాయడం కన్నా కథానికలు రాయడానికే మొగ్గు చూపడం జరిగిందాటారాయన. కథానికలు శిల్పరీత్యా చిన్నవని ఆ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యం లేదాయనకు. లక్ష్యంతో రాశారు కాబట్టే ఆయన కథానికల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘‘కొంతమంది రచయితలు తమని తాము గొప్ప రచయితలని భావించుకోవడంతో మామూలు రచయితలవుతున్నారు. డబ్బు కీర్తిల మీద రచయితల దృష్టి పడి వాళ్ల రచనల నాణ్యత తగ్గిపోతుంది. వీటిని దాటి మంచి రచనలు చేస్తున్న రచయితలూ ఎందరో ఉన్నారు. వాళ్లే ఈ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లగలరు’’ అన్నది కూడా బలివాడ కాంతారావు వెలిబుచ్చిన అభిప్రాయం.
- డా.వేదగిరి రాంబాబు