సబ్ ఫీచర్

బాలికా విద్యకోసం అలుపెరుగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా వివక్ష మత ఛాందసవాదులకు వెన్నతో పెట్టిన విద్య. పాకిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలు మితిమీరి బాలికలు చదువుకోవడానికి వీల్లేదంటూ పాఠశాలల్ని బలవంతంగా మూసేసిన తరుణంలో విద్యాహక్కు కోసం గళం విప్పి, నడుం బిగించిన మలాలా తాలిబన్ల ఆగడాలకు ఎనలేని ధైర్యసాహసాలతో, అంతులేని ఆత్మవిశ్వాసంతో, ‘‘చదువుకోవడం బాలికల (మహిళల) మా నైతిక హక్కు, దాన్ని కాలరాయడానికి తాలిబన్లు ఎవరు?!’’ అంటూ పనె్నండేళ్ల చిన్నారి మాలాలా ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా చైతన్య స్రవంతి వెల్లివిరిసింది. విశ్వమంతా మీడియా, టీవీ చానళ్ళు ఆమె ఆలోచనా విధానాలను ప్రస్తుతించాయి.
తాలిబన్ల పాలనలో స్కూలు పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయన్న విషయం మీద మలాలా ఎప్పటికప్పుడు తన మనసులోని భావాలను నిర్ద్వంద్వంగా ప్రకటించేది. మాలాలా పదేళ్ళకే చదువు గురించి దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టింది. అన్నపానీయాల్లానే చదువుకూడా అత్యవసరం అంటూ సుస్పష్టం చేసి, విద్య లేని సమాజం చీకటి గుయ్యారమని అభివర్ణించింది. న్యూయార్క్ టైమ్స్ వెంటనే స్పందించి పాకిస్తాన్ సైన్యం జోక్యంతో స్థానికులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలు పర్యవసానం గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రం రూపొందించింది. దాంతో మాలాలా యూసఫ్ జాయ్ వెలుగులోకి వచ్చింది. మీడియాలో మలాలా మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వార్తలయ్యాయి.
మలాలా 1997 జూలై 12న పాకిస్తాన్ ముస్లిం కుటుంబంలో పుట్టింది. ‘మలాలా, అంటే వ్యసనాలకు అతీతం అని అర్థం. పాకిస్తాన్‌లో ప్రముఖ కవయిత్రి, వీరనారి ‘మలాలై, స్ఫూర్తితో తండ్రి జియా- ఉద్దీన్ యూసఫ్‌జాయ్ తన కుమార్తెకు ఆ పేరు పెట్టారు. మలాలా తం డ్రి కవి, పండితుడే కాకుండా, విద్యాకార్యకర్తగా కుశాల్ పబ్లిక్ స్కూలు నిర్వాహణ బాధ్యత నిర్వహించేవారు. మలాలా సామాజికపరమైన చైతన్యాన్ని తండ్రినుండే పొందింది. స్వతహాగా తాను డాక్టర్ లేదా పైలట్ కావాలని ఆమె కోరుకున్నా, తన కుమార్తె పోలీసుగా రాణించాలని తండ్రి కోరిక. తరచూ తండ్రి మలాలాకు దేశ రాజకీయాలతో సహా, సాంఘిక, సామాజిక జీవన విధానాల్ని గూర్చి విడమర్చి చెప్పేవాడు. విషయం క్లిష్టమైన తరుణంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిష్కారంకోసం ఎలాంటి సవాళ్లయినా ఎదుర్కొని ఎలా ముం దుకు సాగాలో మలాలా తండ్రినుండి అనేక విషయాల్ని తెలుసుకొంది.
తాలిబన్ల పాలనలో బాలికల విద్యపై ఆంక్షల్ని విధించి, మహిళా హక్కులను కాలరాయడమే కాకుండా వారి జీవితాల్ని విద్యాపరంగా వెలుగు చూడని పరిస్థితులపై, మహిళా వివక్షతపై ఆమె తన మనసులోని భావజాలాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించడంతో తాలిబన్ల ఆక్రోశం మరిం త రెట్టింపైంది. తాను నిత్యం రాసే డైరీని తన తండ్రే రాస్తున్నట్లు కొంతకాలం గోప్యంగా ఉంచడం జరిగింది.
పాఠశాలల్ని నిషేధించాక తాలిబన్లు అక్కడి బాలికల పాఠశాలలన్నింటినీ విధ్వంసం చేశారు. మరో ఐదు పాఠశాలల్ని కూడా విధ్వంసం చేయాలన్న వారి వ్యూహాన్ని పసికట్టిన మలాలా ‘‘పాఠశాలల్ని ఎలాగు నడిపించడానికి వీలులేకుండా చేశారు. ఆఖరికి స్కూళ్ళను కూడా నేలమట్టం చేయాలనే క్రౌర్యం వారికి ఎలా ఒంటబట్టిందో ఆశ్చర్యంగా వుంది.’’ అంటూ తన బ్లాగులో పొందు పరచింది. మలాలా స్కూ ల్‌కు వెళ్ళనంతమాత్రాన చదువును మనసులోనుంచి తుడిచేయలేదు. ఆ ఏడు జనవరి 19న మరో ఐదు పాఠశాలల్ని నేలమట్టం చేయాలని తాలిబన్ల వ్యూహం. సంవత్సరాంతపు పరీక్షలింకా కాలేదు. తాలిబన్లు మనసు మార్చుకొని ఆడపిల్లలు పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తేనే రాయగలం. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ సైన్యాలు ఏం చేస్తున్నట్లోనని ఆ చిన్నారి అదే విషయాన్ని తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. సెలవుల తర్వాత బాలుర పాఠశాలలన్నీ తెరచారు. బాలికల పాఠశాలలకు ప్రాథమిక స్థాయిలో నిషిద్ధం ఎత్తేశారు. కో-ఎడ్యుకేషన్ పాఠశాలలు కనుక వాటికి వారినుండి అనుమతి లభించింది. అయినా ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో తమ పిల్లలను స్కూల్‌కు పంపలేదు. ఏడువందల మంది బాలికలకు గానూ 70 మంది బాలికలు మాత్రం పాఠశాలలకు హాజరయ్యారు. మలాలా ఆలోచనలు మంచివే అయనా తాలిబన్ల ధాటికి భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి భయపడ్డారు.
తాలిబన్లవైఖరి మలాలాలో ఆలోచన్లు రేకెత్తించి ఉద్యమానికి దారితీసింది. భూమి మీద పుట్టిన ప్రతి ఆడపిల్లకు చదువుకునే హక్కుంది. మత ఛాందస భావాలతో ఆడ పిల్లలు బంగారు భవితను నాశనం చేస్తున్న తాలిబన్లు ఏదో ఒకనాటికి పశ్చాత్తాప పడక తప్పదు. దేవుడి (అల్లా) సృష్టిలో ఆడ, మగ తేడా లేనప్పుడు వీరి రాద్ధాంతమేమిటని మలాలా విరుచుకుపడింది. అయితే తాలిబన్లు ఆమె ఆలోచన్లకు ఏమాత్రం తావీయకుండా హతమార్చాలని కుట్ర పన్నారు. అనుకున్న ప్రకారం ముష్కరులు ఆమెపై బుల్లెట్లు పేల్చారు. అయితే తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకొన్న మలాలా అనేక ఆసుపత్రులలో చికిత్స పొంది సజీవంగా బయటపడింది.
ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా మలాలా తన ఆరోగ్యం గురించి కాకుండా విద్యాహక్కు గురించి మతమ తిప్పే ప్రసక్తేలేదని బాలికలకు చదువు ఒక హక్కని నిరంతర పోరాటంతో, ఆమె చేస్తున్న అర్ధవంతమైన, సాహసోపేతమైన పోరాటానికి పాకిస్తాన్ ప్రజలు మద్దతు పలికి, ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రజలంతా ఏకత్రాటిన సిఫార్సు చేశారు. 2011 డిసెంబరులో పాకిస్తాన్ ప్రభుత్వం గురించి తొలి యువ శాంతి పురస్కారాన్ని అందించింది.
మలాలా బాలల హక్కుకోసం పోరాడిన బాలికగా ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని పురస్కారాలు లభించాయి. నవంబర్ 10వ తేదీన మలాలా దినోత్సవం జరుపుకోవాలని యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బానిన్‌కీ మూన్ చేసిన ప్రతిపాదన, బాలికల హక్కులకోసం పోరాడిన మలాలాకే కాకుండా ప్రపంచ బాలికల విద్యాహక్కుకు ఒక రక్షణ కవచమైంది. మలాలా ఒక బాలిక కాదు బాలికల విద్యాహక్కుకోసం పోరాడిన విప్లవ మూర్తి.

- దాసరి కృష్ణారెడ్డి