సబ్ ఫీచర్

చెట్టు..మనిషి మనుగడకు మెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవుల నరికివేతవల్ల వాతావరణం సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో సమతుల్యత లోపించి కాలుష్యం ఏర్పడి మానవకోటి కి నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరం వుంది. అడవుల నరికివేత,గుట్టలు తరిగిపోవడంతో వాతావరణంలో మార్పులు జరిగి అనేక అనారోగ్యాలతో ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల వెంబడి, జన నివాస ప్రాంతాల్లో, పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటడంవల్ల గ్రామాలు సస్యశ్యామలవౌతాయి. మొక్కల పెంపకం ద్వారా గ్రామాలు సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురిసి ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటవలసిన అవసరం ఉంది.
చెట్లు నరికివేయడంవల్లే పర్యావరణం దెబ్బతిని కరవుకాటకాలు సంభవిస్తున్నాయి. ఉదాహరణకు ఒక టన్ను పేపర్ తయారుకావడానికి దాదాపు 27చెట్లను నరికివేయాల్సి వస్తున్నది. చెట్లు నరకడం పట్ల కరువుకాటకాలతోపాటు పర్యావరణం దెబ్బతింటోంది. కాలుష్యం బారినపడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అందుకే చెట్లను విరివిగా పెంచాల్సిన అవసరం ఉన్నది. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన అవసరం వుంది. చెట్లతోనే మానవాళికి మనుగడ ఉంటుంది. చెట్లతోనే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వం ఎన్నిసార్లు మొక్కలునాటే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేనిదే ‘హరితహారం’ కార్యక్రమం విజయవంతంకాదు. మొక్కలను నాటి ‘మమ’అనిపించకుండా వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఎవరికైనా అప్పగిస్తే అవి పెరిగి పెద్దవై వృక్షాలుగామారే అవకాశం ఉంటుంది. అప్పుడే తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో భాగంగా ‘అశోకుడు రోడ్డుకిరువైపుల చెట్లు నాటించెను’అని విద్యార్థులలో గురువులు వల్లెవేయించేవారు. పూర్వ కాలంలో తప్పకుండా చెట్లను పెంచేవారు. కాని నేటి ఆధునిక కాలంలో అంతా కాంక్రిట్ ప్రపంచం అయింది. ఎక్కడ చూసినా సిమెంట్ కట్టడాలు, రోడ్లు ఉండటంతో భూమిలోకి నీరు పోకుండా వృధాగా పోతోంది. ప్రస్తుత ప్రభుత్వం హరితహారం పేరిట పచ్చదనమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నా ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. అప్పడే మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం అయి వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. వృక్షోరక్షతి రక్షితః.

- గుండు రమణయ్య