సబ్ ఫీచర్

కుంగదీస్తున్న నిరర్థక ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థిరత్వం మీద తాజాగా భారత రిజర్వు బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన పత్రంలో ఆ రంగానికి పొంచి వున్న ముప్పుపై హెచ్చరించింది. ఒక్క భారతరదేశమే కాదు ప్రపంచమంతటా ఆర్థికాభివృద్ధి ఒడుదుడుకులకు లోనవుతోంది. ఆర్థిక మాంద్యం నుంచి కొన్ని దేశాలు బయటపడగా మరికొన్ని దేశాలు కోలుకోవడం ఆలస్యమవుతోంది. భారత్ అనేక దేశాలకన్నా మెరుగైన అభివృద్ధి రేటు సాధిస్తున్నా, మన కార్పొరేట్‌రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమవుతోంది. బ్యాంకింగ్ రంగం కంపెనీలకు ఇచ్చిన రుణాలు, నిరర్థక ఆస్తులుగా మారి లాభాలు తగ్గి ఈ రంగాన్ని కుంగదీస్తున్నాయి. ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాయి. దానికి తోడు డిపాజిట్లు క్షీణిస్తున్నాయి. ఇనుము, ఉక్కు, భవన నిర్మాణం, విద్యుత్, టెలి కమ్యునికేషన్ రవాణా రంగాలు భారీగా అప్పులు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని 2016 మార్చినాటి ఆర్‌బిఐ నివేదిక స్పష్టంచేసింది. బ్యాంకులిచ్చిన మొత్తం రుణాలలో కిస్తీలు, అసలు, వడ్డీలు చెల్లించలేక ఎన్‌పిఏలుగా ఏటికేడాది పెరిగిపోతున్నాయి. 2015 సెప్టెంబర్‌లో 5.1 శాతంగా, 2016 మార్చిలో 7.6 శాతం వున్న స్థూల నిరర్ధక ఆస్తులు ఇలాగే కొనసాగితే 2017 నాటికి 8.5 శాతానికి పెరుగుతాయని అంచనా. బ్యాంకులు తమ బాలెన్స్ షీట్లను సరిచేసుకునే కార్యక్రమంలో నిమగ్నమవుతుండగా ఎన్‌పిఏల విషయంలో రిజర్వు బ్యాంకు తనవంతు సహాయం అందచేస్తోంది. బ్యాంకులు ఇచ్చిన రుణాల ఆస్తుల నాణ్యతను మదింపు చేసి తిరిగి చెల్లించేవాటికి వాటికి కొత్త గడువు, సులభ షరతులు ఇవ్వాలని, మొండి బకాయిలను పూచీకత్తులను స్వాధీనం చేసుకోవాలని సూచిస్తోంది. ఈ నిరర్ధక ఆస్తుల ఊబిలో బ్యాంకులు పడకుండా రిజర్వుబ్యాంకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారనున్న జీఎన్‌పిఏలపై అప్రమత్తంగా వుండాలని ఆర్‌బిఐ హెచ్చరిస్తోంది.
2007-08 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం పరిపుష్టంగా వున్నప్పుడు బ్యాంకులు వెనకాముందు చూడకుండా విచ్చలవిడిగా రుణాలిచ్చాయ. ఖాతాదారులు రుణాలను సక్రమంగా సకాలంలో తిరిగి చెల్లిస్తారా లేదా అనే వివేచన లేకుండా అప్పట్లో రుణాల పంపిణీ జరిగింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఈ రుణాలన్నీ బ్యాంకు ఖాతాల్లో ఒత్తిడికి లోనవుతున్న ఆస్తులుగా మిగిలిపోయాయి. ప్రైవేటు, విదేశీ బ్యాంకులకన్నా ప్రభుత్వ బ్యాంకుల్లో జీఎన్‌పిఏలు చాలా ఎక్కువగావున్నాయని 2016లో రిజర్వు బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. బ్యాంకు అధికారులు ఆశ్రీతులకు, తమకు సర్వవిధాలుగా బహుమతులతోపాటు గాఢంగా సత్కరించి సమాదరించే ఖాతాదారులపట్ల వ్యవహరించిన శైలే జీఎన్‌పీఏలకు కారణమైందని ఆర్థిక నిపుణులు విశే్లషిస్తున్నారు. ప్రభుత్వపరమైన బ్యాంకులు 2015-16 సంవత్సరంలో అంతకుముందు సంవత్సరం కంటే 118 శాతం ఎక్కువ నష్టాలు చవి చూడగా ప్రైవేటు బ్యాంకులు 11.6 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్రభుత్వ బ్యాంకుల పనితీరును స్పష్టం చేస్తున్నది.
బ్యాంకింగ్ రంగాన్ని బలపరిచే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విలీనం చేసే ముందు ప్రభుత్వం తద్వారా జరిగే నష్ట నష్టాల్ని బేరీజు వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆర్థిక వనరుల్ని రుణాల రూపేణా ఇష్టారాజ్యంగా పంపిణీ చేసి మొండి బకాయిదారులంటూ చేతులు ముడుచుకు కూర్చోవడం బ్యాంకింగ్ వ్యవస్థకే శరాఘాతం. ఆర్‌బిఐ సూచనలు మేరకు మొండి బకాయిలను ఎలా రాబట్టాలనేది బ్యాంకుల విధి విధానాల్లో ఒక భాగం. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చిన రు. 18వేల కోట్ల నష్టం జాతీయ ఖజానాపై పడుతుంది. ప్రభుత్వం అసమర్ధ బ్యాంకులను ప్రైవేటీకరించి లాభదాయ బ్యాంకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- దాసరి కృష్ణారెడ్డి