సబ్ ఫీచర్

వివక్షలేని సమాజం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే నాగరికత, సంస్కృతి గల భారత జాతి తొలిసారిగా ఒకే ప్రభుత్వం, ఒకే పతాకం కిందకు వచ్చిన రోజైన సెప్టెంబర్ 17ను భారత జాతి మొత్తం ఐక్యతా దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యావత్ భారతదేశం ఒకే గొడుగుకిందకు వచ్చిన చారిత్రాత్మక క్షణం హైదరాబాద్ విమోచన దినం. అనేక వైవిధ్యాలు ఉన్న భారతదేశంలోని 545కు పైగా ఉన్న సంస్థానాలని కేవలం ఏడాది కాలంలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ రక్తం చిందించకుండా ఏకంచేసిన ఘన చరిత్ర అది. అటువంటి మహత్తర క్షణాన్ని హిందూ-ముస్లిం మత సమస్యగా చిత్రీకరించడం మూర్ఖత్వమే అవుతుంది. అద్భుతమైన ఆ చారిత్రాత్మక దినం రోజున ఏం జరిగిందో ఒక్కసారి మనం కూడా మననం చేసుకోవాల్సిన సందర్భం ఇది.
1947 ఆగస్టు 15న కోట్లాది మంది భారతీయులు బానిస సంకెళ్ళనుండి విముక్తి పొందిన పర్వదినం. దేశమంతా స్వాతం త్య్ర సంబరాలు జరుపుకొంటున్నా హైదరాబాద్ సంస్థానంలోని కోటీ 20 లక్షల మంది ప్రజలు కళ్ళనీళ్ళతో కడివెడు దుఃఖాన్ని దిగమింగాల్సిన పరిస్థితి. భారత యూనియన్‌లో తన రాజ్యా న్ని విలీనం చేసేదిలేదని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేసిన రేడియో ప్రకటన వారిని ఖిన్నులను చేసింది. స్వాతం త్య్రం కోసం నినదించిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులుచేస్తూ నిజాం పోలీసులు, సైన్యం రాజ్యమంతా దిగ్బంధం చేసింది. అప్పటికే రజాకార్ల పేరుతో నిజాం ప్రైవేట్ సైన్యం ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో చేస్తున్న అకృత్యాలు సంస్థానం ప్రజలలో తీవ్రమైన ఏహ్యభావాన్ని కలుగచేసాయి. భారత స్వాతంత్య్రానికి ముందే నిజాం సంస్థాన ప్రజలు సర్కార్ వ్యతిరేక పోరాటాలు ప్రారంభించారు. స్వామీ రామానందతీర్థ నాయకత్వంలో స్టేట్ కాంగ్రెస్, రావి నారాయణరెడ్డిగారి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు, పండిట్ నరేంద్రజీ, వందేమాతరం రామచంద్రరావుల నాయకత్వంలో ఆర్యసమాజాలు నిజాం విముక్తి పోరాటాలు సాగిస్తున్నారు. 1946 వరకూ ఈ ఉద్యమాలన్నీ గాంధేయ పద్ధతిలోనే జరిగాయి. దొడ్డి కొమరయ్య మరణంతో ఈ ఉద్యమం సాయు ధ పంథావైపు నడిచింది. మల్లు స్వరాజ్యం లాంటి వీర నారీమణులు తుపాకీ చేతపట్టి రజాకార్లను గడగడలాడించారు. ఒక దసరారోజున భువనగిరి తాలూకాలోని ఒక గ్రామంలో మహిళలను వివస్తల్రను చేసి నగ్నంగా బతుకమ్మ ఆడించిన నరరూప రాక్షసులు రజాకార్లు. నారాయణరావు పవార్, గంగారాం, జగదీష్ లాంటి యోధులు ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కారుపై బాంబు విసిరి హత్యాయత్నం చేసారు. కాని నిజాం ఆ బాంబు దాడిలో బతికి బయటపడ్డాడు. పవార్‌ను ఆయనకు సహకరించిన వారిని అరెస్ట్‌చేసారు. వీరికి ఉరిశిక్ష విధించినా, శిక్ష అమలుచేసే సమయానికి భారత సైన్యం నిజాంను లొంగదీసుకోవడంతో వారు బతికి బయటపడ్డారు. షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ లాంటి ఎందరో యోధులు తమ ప్రాణాలకు లెక్కచేయకుండా రజాకార్ల దౌర్జన్యాల్ని ఎండగట్టారు.
మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 21 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంవున్న హైదరాబాద్ సంస్థానంలో 10 శాతం అంటే 2.1 లక్షల చదరపు కిలోమీటర్ల స్థలాన్ని కేవలం తన స్వంత ఆస్తిగా ఉపయోగించుకున్నాడు. అప్పటికే 2.5 కోట్ల వార్షికాదాయంతో దేశంలోని అన్ని సంస్థానాల్లోకెల్లా అత్యంత ధనిక సంస్థానంగా హైదరాబాద్ సంస్థానం పేరుపడింది. 12 జూన్ 1946న ఏడవ నిజాం రేడియోలో ప్రసంగిస్తూ బ్రిటిష్ రాజ్యం ఇండియాలో అంతమయినా నా రాజ్యం మాత్రం ఇండియన్ యూనియన్‌లో కలిపే ప్రసక్తేలేదని ప్రకటించాడు. దీంతో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని భారత భూభాగంలో కలిపేందుకు ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్ పేరు ‘క్యాటర్ పిల్లర్’. నిజానికి అంతకుముందు దీనికి ‘ఆపరేషన్ పోలో’అని పేరుపెట్టారు. అప్పటికే ‘కబడ్డీ’ పేరుతో రజాకార్లను సంస్థానం సరిహద్దులనుంచి కొంత లోపలి తరిమే కార్యక్రమం నడిచింది. పోలో వ్యవహారం బయటకు పొక్కిందేమోనన్న అనుమానంతో 1948 జూలై 13న కొత్తగా ‘గొంగళి పురుగు’ పేరుతో నిజాం పనిపట్టడం ప్రారంభించారు. మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి సారథ్యం లో దాడుల ప్రణాళిక సిద్ధమైంది. పూణేలో ఆయన సిబ్బందిని సమాయత్తంచేసే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని ముందు రెండువైపులానుంచి ముట్టడించాలన్నది పథకం. పశ్చిమాన 289కి.మీ. దూరంలోవున్న షోలాపూర్ నుంచీ, అలాగే తూర్పున 287 కి.మీ. దూరంలోవున్న విజయవాడనుంచి ముట్టడి మొదలుపెట్టాలని నిర్ణయించారు. మలి దాడులకోసం ఉత్తర, దక్షిణాల్లోని మూడు ప్రాంతాలను ఎంపికచేసారు. సైన్యానికి వైమానిక దళం దన్నుగా నిలబడుతుంది. అవసరమైతే ప్రతిఘటనను అణచివేసేందుకు విమానాశ్రయాలను బాంబులతో ధ్వంసంచేయాలని రంగం సిద్ధంచేసారు. నాడు హకీంపేట్ ప్రధాన విమానాశ్రయం. ఆ తర్వాత వరంగల్, బీదర్ వినానాశ్రయాలున్నాయి.
అంతకుముందు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి చేసిన రాజకీయ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. వౌంట్ బాటెన్ ఒత్తిళ్లకు అప్పటివరకూ లొంగుతూ వచ్చిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వౌంట్ బాటెన్ నిష్క్రమణ తర్వాత మరింత దృఢంగా మారారు. సయోధ్యతో విలీనం సాధ్యమవుతున్న ఆశలు పూర్తిగా అడుగంటాయి. 1948 ఆగస్టు 17న నిజాం ప్రభుత్వం కొత్త ఎత్తువేసింది. హైదరాబాద్ సంస్థానానికి, భారత ప్రభుత్వానికీ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ తమ ప్రభు త్వం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని ఆశ్రయిస్తోందంటూ నైజాం సంస్థాన ప్రధాని లియాక్ ఆలీ భారత ప్రధాని నెహ్రూకు వర్తమానం పంపారు. కాని దీనికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. హైదరాబాద్ ప్రతినిధుల విమాన ప్రయాణానికి అనుమతికూడా నిరాకరించింది. అయినా నిజాం విదేశాంగ మంత్రి నవాబ్ మొయిన్ నవాజ్‌జంగ్ సారథ్యంలో ఒక బృందం పాకిస్తాన్ వెళ్లి, అక్కడినుండి విమానంలో ప్యారిస్ చేరుకొంది. ఇక దాడి తప్ప వేరే మార్గంలేదని ఇరువర్గాలు గుర్తించాయి. ఇక్కడ నిజాం సైన్యం ఎంతకాలం భారత సైన్యాన్ని ఎదుర్కోగలదు అన్నదే ప్రశ్న. ఎందుకంటె నిజాం సైన్యానికి గెలిచే అవకాశమేలేదు. కాని హైదరాబాద్ సర్వ సైన్యాధ్యక్షుడు ఎల్.ఎడ్రాస్ మాత్రం భారత సైన్యం వొట్టి ‘బనియా’ సైన్యమని, ధైర్యవంతులైన హైదరాబాద్ సైనికులు వారిని కనీసం ఆర్నెల్లయనా ఎదుర్కొంటారని గొప్పలు చెప్పుకొన్నాడు. ఇవన్నీ జనం కోసమే. ఎందుకంటె నిజాంకు చెప్పేటప్పుడు ఆయన అందులో సగమే చెప్పాడు. తర్వాత లాయక్ ఆలీ పాకిస్తాన్ వెళ్ళడం, సహాయం అడిగి భంగపడి రావడం జరిగిపోయింది.
హైదరాబాద్‌లో రోడ్లమీద ఒకటే హంగామా. రజాకార్లు నిజాంకు, ఖాసిం రజ్వీకి అనుకూలంగా నినాదాలుచేస్తూ బస్సు ల్లో, రోడ్లమీద తిరిగారు. పవిత్ర యుద్ధంలో పోరాటమే ధ్యేయమన్నారు. అవసరమైతే వీర మరణానికి సిద్ధమన్నారు. భారత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు ఆరంభించింది. హైదరాబాద్ సంస్థానంలో తమ ప్రతినిధి అయిన కె.ఎం.మున్షీని కంటోనె్మంట్ నుంచి ప్రధాని నివాసం షామంజిల్ (ఇప్పటి రాజ్‌భవన్) పక్కనే వున్న లేక్‌వ్యూ అతిథి గృహానికి తరలించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసింది. మున్షీ అప్పటికే కీలకమైన రికార్డులన్నింటినీ రక్షణశాఖకు తరలించేసారు. తన వ్యక్తిగత పత్రాలనూ పంపిస్తూ తనకేమన్నా అయితే తన భార్య లీలావతికి అందజేయాలని వర్తమానమూ పంపారు. కళ్యాణీ-బీదర్ రోడ్డుమీద భారత సైన్యం, ట్యాంకుల కదలికలు ఆరంభమైనట్లు ప్రధాని లియోక్ ఆలీకి వర్తమానం అందింది. కాని సంస్థానం దగ్గరున్న మ్యాపులలో ఆ రోడ్డే లేదు. అంత గొప్పగా వారిదగ్గర మ్యాపులున్నాయి. అదేసమయంలో ఖాసిం రజ్వీ ప్రధాని లియాక్ అలీని సంప్రదించి భారత సైన్యంపై తిరుగుబాటుకు తమవాళ్లకు ఆయుధాలు కావాలని కోరాడు. నిజాం సైన్యం బస్సులలో బ యలుదేరింది. అప్పటికే సూర్యాపేట వరకు మేజర్ ధనరాజులు నాయుడు సారథ్యంలో వచ్చేసిన భారత సైన్యం ఎటువంటి ప్రతిఘటన లేకపోవడంతో ముందుకు కదిలింది. తర్వాత ఔరం గాబాద్ భారత వశమైనట్టు ‘ఆకాశవాణి ఔరంగాబాద్’ చేసిన ప్రకటన దక్కన్ రేడియోలో కలకలం రేపింది. ఎట్టకేలకు 17, సెప్టెంబర్ 1948 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నిజాం వ్యక్తిగతంగా మున్షీకి వర్తపానం పంపాడు. నాలుగు గంటలకు రమ్మని ఆహ్వానం. ఆ సాయంత్రం మున్షీ కింగ్ కోఠికి వెళ్ళే సరికి ‘దొంగలంతా రాజీనామా చేశారు’ ఇప్పుడేం చేయాలో పాలుపో వడం లేదు’ అంటూ తలపట్టుకున్నాడు. మున్షీ నిజాంతో పోలీ సు చర్యను స్వాగతిస్తున్నామని ప్రకటించవలసిందిగా కోరాడు. మొట్టమొదటిసారి నిజాం నవాబు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా రేడియో స్టేషన్‌లోకి అడుగు పెట్టాడు. ‘నావల్ల జరిగిన తప్పులకు క్షమించండి’ అన్న ప్రకటనతో ఒక శకం ముగిసింది. నిరంకుశ సంకెళ్లు తెగిపోయ, స్వాతంత్య్ర వాయువులు వీచాయ.

- కూసంపూడి శ్రీనివాస్
అధికార ప్రతినిధి, లోక్‌సతా - సెల్: 9000165971

- కూసంపూడి శ్రీనివాస్