సబ్ ఫీచర్

చవితి సంబరాల్లో ‘మద్యం వేడుక’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో తొలిసారిగా ఈసారి వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అత్యధిక పందిళ్లలో నవరాత్రులతో పాటు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. కృష్ణా జిల్లాలో 3 వేలకు పైగా పందిళ్లతో పాటు విజయవాడ నగరంలో వెయ్యికి పైగా పందిళ్లు పోటాపోటీగా వెలిశాయి. వీటి ల్లో కనీసం మూడు నుంచి 10 అడుగుల ఎత్తు వరకు వినాయ క విగ్రహాలు కొలువుదీరాయి. మొత్తం ఖర్చు దాదాపు రూ.15కోట్లు దాటితే ఇందులో దాదాపు మూడోవంతు, అదీ నిమజ్జనోత్సవంలో కేవలం మద్యం కోసమే ఖర్చయింది! నవరాత్రి ఉత్సవాల్లో ఇలా మద్యం అరంగేట్రం చేసింది. రాజధాని నగరం కదా! తొలిసారి నిమజ్జనోత్సవాలు కూడా పోటాపోటీగా జరిగాయి. ప్రతి ఊరేగింపులో తొలుత డప్పు వాయిద్యాలు, సంప్రదాయ మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు, తప్పెటగుళ్లు, విచిత్ర వేషాలు, భేతాళ నృత్యాలు, సింగర్స్.. ఇలా వీరంతా కలిసి ఒకో వినాయకుని ముందు దాదాపు 100 మంది అవుతున్నారు. ఇక వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు, లైట్‌బాయ్స్, నిర్వాహకులు.. వీరంతా కాకుండా మద్యం కోసం చిందులు వేయడానికొచ్చే మూక ఎటూ ఉండనే ఉంటుంది. తొలుత ఊరేగింపు ఆరంభం, మధ్యమధ్య నిమజ్జనం సమయంలో, ఆ తర్వాత ఒక్కో గణపతి నిమజ్జనానికి కనీసం వందకు పైగా ఫుల్‌బాటిల్స్ కోసం లక్ష రూపాయలకు పైగానే నిర్వాహకులు మద్యం కోసం వెచ్చించారు.
కొసమెరుపు: ఏడాదికి ఒకసారే కదబ్బా!.. అంటూ కొందరు నిర్వాహకులు ‘మద్యం వేడుక’ను సమర్ధించుకుంటున్నారు. మ నం కాదనగలమా?!

- నిమ్మరాజు చలపతిరావు