సబ్ ఫీచర్

క్రీడారంగంపై చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో స్థానాన్ని పొందిన మన దేశం ఒలింపిక్ క్రీడలలో మాత్రం ఇంకా అట్టడుగునే వుండటం బాధాకరం. భారత్ కంటే చిన్న దేశాలు ఇటీవలి రియో ఒలింపిక్స్‌లో పతకాలను కైవసం చేసుకోవడంలో ముందు వరుసలో నిలిచాయ. మన దేశానికి ఒక్క స్వర్ణ పతకం కూడా దక్కలేదు. రజత, కాంస్య పతకాలను సాధించిన ఇద్దరు యువతులు రియో ఒలింపిక్స్‌లో భారత్ పరువు నిలిపారు. రెండు పతకాలను సాధించినందుకే వీరికి జాతి యావత్తూ అఖండ స్వాగతం పలికింది. వీరికి ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు నగదు నజరానాలు, ఇతర బహుమతులు భారీగా అందజేశాయ.
రియో ఒలింపిక్స్‌లో ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇటీవల టాస్క్ఫోర్సు నియమించటం హర్షణీయం. ఇపుడు క్రీడలకు కేటాయిస్తున్న నిధులకంటే కనీసం నాలుగైదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించి, రాజకీయ జోక్యం లేకుండా, క్రీడలపై అజమాయిషీకి క్రీడా నైపుణ్యంగల వారినే మంత్రులు, అధికారులుగా నియమించాల్సి ఉంది. ప్రభుత్వం విడుదల చేసే నిధులను క్రీడా వసతులు, క్రీడాకారుల శిక్షణకు మాత్రమే సక్రమంగా వినియోగించాలి. పట్టణ ప్రాంతాల్లో యువత క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలకే పరిమితమవుతున్నారు. శారీరక శ్రమ కలిగించే అథ్లెటిక్స్ వంటి క్రీడలకు, శ్రమ జీవనానికి అలవాటుపడిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని క్రీడాసక్తిగల పిల్లలను గుర్తించి వారిని బాల్యదశనుండే ప్రోత్సహించి గట్టి శిక్షణ ఇప్పించాలి.
చైనావలె దీర్ఘకాలిక శిక్షణా శిబిరాల్లో పిల్లలను ఉంచేందుకు ఈనాటి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆటల్లో మునిగితే చదువును పిల్లలు నిర్లక్ష్యం చేస్తారని చాలామంది తల్లిదండ్రులు అపోహ పడుతుంటారు. ఇక, అనాథాశ్రమాల నుండి, ఆశ్రమ పాఠశాలల నుండి క్రీడాసక్తిగల పిల్లలను గుర్తించి వారి బాధ్యతను ప్రభుత్వం స్వీకరించి కఠోర శిక్షణ ఇప్పిస్తే ఎంతో ప్రయోజనం వుంటుంది. ఇలా చేస్తే అనాథ బాలల విషయంలో నిర్వాహకులకు కొంత భారం తగ్గుతుంది. కేంద్రమేగాక రాష్ట్ర ప్రభుత్వాలు కూడ తమ వంతుగా ఎక్కువ నిధులు కేటాయించి గ్రామీణ, జిల్లా, రాష్రా టస్థాయి క్రీడా పోటీలను తరచూ నిర్వహించాలి. గుర్తింపు పొందిన క్రీడాకారులకు మెడికల్, ఐఐటీ ఎంట్రెన్స్ కోర్సులకు కొద్దిగా అదనపు మార్కులు కలపాలి. తక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుని సీట్లు ఇస్తున్న నేటి విద్యా వ్యవస్థలో క్రీడాకారులకు కొన్ని మార్కులు, సీట్లు ఇస్తే ఎలాంటి నష్టం లేదు. రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి భారీ కార్పొరేట్ సంస్థలు క్రీడాకారుల కోటా ఏర్పరచి కొందరికైనా ఉపాధి కల్పించి క్రీడలను ప్రోత్సహించాలి, అది సామాజిక బాధ్యత కూడా.
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో వలే ఆటల కోసం తరగతులను నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహించాలి. ఈ విషయంలో మిషనరీ విద్యాలయాలు ఎంతో నయం. చక్కటి క్రీడా ప్రాంగణాలు, పీటీ క్లాసులుంటాయి. ఆదివారం కూడా క్లాసులు నిర్వహించే కార్పొరేట్ విద్యా సంస్థలకు తమ పిల్లలను పంపకుండా, క్రీడావసతులు ఉన్న విద్యాసంస్థల్లో చేరిస్తే వారి ఆరోగ్యానికి, దేశానికి ఎంతో మంచిది. నేడు పెద్ద నగరాలలో తప్ప ఆడుకోటానికి మిగతా ప్రాంతాలలో స్టేడియంలు అందుబాటులో మచ్చుకైనా లేవు. క్రీడా స్థలాలు లేనందున యువత శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో సైతం క్రీడా మైదానాలు, మినీ స్టేడియంలను ఏర్పాటు చేయాలి.

-తిరుమలశెట్టి సాంబశివరావు