సబ్ ఫీచర్

గురువే రేపటి కాలం ఆవిష్కర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి సమాజానికి నాందీ వాచకాలు ఇవాళ తరగతి గదిలో జరుపబడుతున్నాయి. ఈనాడు తరగతి గదిలో బోధనా పద్ధతులు నాలుగు గోడలకే పరిమితం కాదు. రేపటి సమాజంలో తయారయ్యే పౌరులే సమాజానికి విస్తరిస్తారు. తరగతి గదిలో నేర్చుకున్న పద్ధతులు రేపటి సమాజం యొక్క వ్యవహారశైలిగా మారుతుంది. 21వ శతాబ్దంలో మార్కెట్ యొక్క శైలి 20వ శతాబ్దం క్లాస్‌రూం స్వరూపం. 20వ శతాబ్దంలో తరగతి గదిలోని కో-ఆపరేటివ్ లెర్నింగ్ విస్తరించి- ఈనాడు చాలా కంపెనీల మేనేజ్‌మెంట్ శైలిగా మారిపోయింది. మునుపటి మాదిరిగా ఆఫీసులకు ఉద్యోగులు రావల్సిన అవసరం లేదు. ఉదయం 10 గంటలు కాగానే రోడ్డుపై రద్దీ అవసరం లేదు. ఇంటినుంచే ప్రతివారు పనిచేయవచ్చు. సమాలోచనలు టెలికాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒక జట్టు టెలికాన్ఫరెన్స్‌ను ఒక దేశానికే పరిమితం చేయటం లేదు. ఒక జట్టు ఒక పనిలో భాగాన్ని ఇండియాలో చేస్తే, ఆ పనియొక్క రెండవ భాగం ఇజ్రాయిల్‌లో జరుగుతుంది. మూడవ భాగం పని పాకిస్తాన్‌లో జరుగుతుంది. ఒకే జట్టులోని ఒక సభ్యుడు ఇంగ్లాండ్‌లో ఉంటే రెండవ సభ్యుడు అమెరికాలో, మరో సభ్యుడు చైనాలో ఉండవచ్చు. ఈ ముగ్గురు కలిసి ఒక టీంగా ఏర్పడి ఒకే పనిని పూర్తిచేయవచ్చు. లేక వివిధ బృందాలు వివిధ కార్యక్రమాలను సమన్వయపరిచి తమ కంపెనీ బిజినెస్‌ను నడుపవచ్చును. ఈ కార్యక్రమం నడవాలంటే పనిచేసే మనుషుల దృక్పథాలే మారాలి. ఒక ఇండియన్ పాకిస్తానీతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ పనిలో సమన్వయం రావాలంటే ఇతర సభ్యుల కల్చర్‌ను అవగాహన చేసుకోవాలి. సంస్కృతిలో సఖ్యత లేనిదే పనిలో సమన్వయం జరగదు.
ఒక దేశం విద్యావ్యవస్థ ప్రభావం ఇతర దేశాల విద్యావ్యవస్థపై పడుతున్నది. ఇండియన్స్‌కు కొన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉంది. ఆ ప్రావీణ్యత ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా పడుతున్నది. భారతీయుడు ఇతర దేశాలకు పోవలసిన అవసరం లేదు. తన సంబంధీకులతోనే కాలం గడుపుతూ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి పంపే అవకాశం ఉంటుంది. పూణెలో వున్న ఓ టీమ్ కాలిఫోర్నియా టీమ్‌తో కలిసి పనిచేస్తుంది. మునుపటి మాదిరిగా ఆఫీసు పనివేళలు ఉదయం 10 నుంచి 8 గంటల వరకే కాదు. కొన్ని కంపెనీలైతే 24/7 పనిచేస్తున్నారు. ఒక ప్రాంతంలో రాత్రి ఉన్నప్పుడు మరొక ప్రాంతంలో పగలు ఉంటుంది. కానీ కంపెనీ మాత్రం 24 గంటలు పనిచేస్తున్నది. ఇలాంటి పనులకు సిద్ధపడితేనే నేడు రాణించగలుగుతారు. విజ్ఞానానికి అవధులు లేనట్టే మార్కెట్‌కు కూడా అవధులు లేకుండాపోయాయి. దీనివల్ల సాంస్కృతిక మైత్రికూడా ఏర్పడుతుంది. ఆర్థికవ్యవస్థ సాంస్కృతిక మైత్రికి దోహదపడుతుంది.
మునుపటి మాదిరిగా యజమాని చెప్పటం, ఉద్యోగులు చేయటమనే భావన పోయింది. ఉద్యోగస్తులు కంపెనీలో భాగస్వామి అవుతున్నారు. మారిన పరిస్థితులకనుగుణంగా మా కంపెనీలకు ఏంచేస్తావని అడుగుతున్నారు. 20 శతాబ్దంలో కోఆపరేటివ్ లెర్నింగ్‌ను వ్యక్తిగతం నుంచి సామూహికంగా చేయగలిగారు. నేర్చుకునేది సామూహిక ప్రక్రియ. ఆ సామూహిక ప్రక్రియను బిజినెస్‌లో ప్రవేశపెట్టడంతో గ్లోబల్ బిజినెస్‌గా మారిపోయింది. దీనివలన కంపెనీకి ఎంతో మిగులు ఏర్పడింది. వౌలిక వసతులపైన డబ్బు ఖర్చుపెట్టవలసిన అవసరం లేదు. ఆఫీసులకు నిత్యం వెళ్లే పనిలేకపోవటంతో పెట్రోల్ ఖర్చు తగ్గింది. తరగతి గది ప్రయోగాలు ఏ విధంగా ఆర్థిక, సామాజిక రంగాలపై, దినచర్యలపై ఏ విధమైన ప్రభావం చూపాయో మనం చూస్తూ ఉన్నాం. తరగతి గది ప్రపంచానికి ఒక ప్రయోగశాల. అందుకే నేటి గురువురేపటి నూతన ఆవిష్కర్త. ఇపుడు తరగతి గదిలో వున్నవారు రేపటి గ్లోబల్ ఎంటర్‌ప్రైన్యూవర్.

-చుక్కా రామయ్య