సబ్ ఫీచర్

పోషకాహార లోపంపై పోరాడుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆకలి’ రెండు రకాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ‘ఆకలిలో రకాలేమిట’ని ఆశ్చర్యపోనక్కర్లేదు. పేదరికంతో తినడానికి పట్టెడన్నం దొరక్కపోవడం మొదటి రకం ఆకలి. ముప్పొద్దులా కడుపునిండా తింటున్నా శరీరానికి అవసరమైన పోషకాలు లభించక పోవడం రెండో రకం ఆకలి. దీనే్న సాంకేతికంగా ‘హిడెన్ హంగర్’ అంటారు. పోషకాహార లోపం నేడు దేశప్రజలను వేధిస్తున్న ముఖ్యమైన సమస్య అని అంతా అంగీకరించాల్సిందే. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా పేదరిక నిర్మూలన పూర్తి స్థాయిలో జరగలేదు. వ్యవసాయ రంగం శాస్తవ్రిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నా పోషకాహార లోపం ప్రజానీకాన్ని బాధిస్తోంది. ఇది మన అభివృద్ధి గమన లోపాన్ని సూచిస్తున్నది.
తెల్లని మల్లెపూల లాంటి వరి అన్నాన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనం తింటూనే ఉన్నాం. ధాన్యాన్ని పాలిష్ చేసే మిల్లుల సంఖ్య పెరిగాక తెల్లబియ్యానే్న మార్కెట్‌లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఈ బియ్యం ముడి బియ్యం కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ఒక కారణం. బియ్యంపై ఉండే పొరతో కూడా వ్యాపారం చేయవచ్చని వర్తకులు నిరూపిస్తున్నారు. పాత తరం వారు మనకన్నా బలంగా ఉండేవారని అందరికీ తెలుసు. ఆహారంలో సూక్ష్మ పోషకాలు ఎక్కువ భాగం కావడమే వారి ఆరోగ్యానికి హేతువు. దంపుడు బియ్యంపై ఎర్రటి పొర ఉంటుంది. దానిలో జింకు, ఐరన్, ఇతర అసేంద్రియ పదార్థాలు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి నేటితరానికి అందకపోవడం వల్లనే పోషకాహార లోపం పెరుగుతోంది. అంతర్జాతీయ సంస్థల గణాంకాల ప్రకారం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో శారీరక, మానసిక ఎదుగుదలలో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
విటమిన్-ఎ లోపం వల్ల పిల్లల్లో దృష్టి లోపం, ఐరన్ లోపిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం అందిరికీ తెలిసిందే. జింకు అందకుంటే శారీరక ఎదుగుదల లోపిస్తుంది, శిరోజాలు రాలిపోతుంటాయి. ఆకలి మందగిస్తుంది. పిల్లలకు విటమిన్-ఎ మెగా డోస్ ప్రతి ఆరునెలలోసారి ఇచ్చే కార్యక్రమాన్ని 1970 కాలంలోనే ప్రారంభించారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు రేచీకటి బారిన పడకుండా శాస్తవ్రేత్తలు కాపాడగలిగారు. దృష్టికి సంబంధించి సహజ ప్రక్రియ సజావుగా కంటిలో జరగడానికి విటమన్-ఎ అత్యంత అవసరమని శాస్తజ్ఞ్రులు, వైద్య నిపుణులు ప్రచారం చేయడంతో ఆ విషయాన్ని ప్రజలు సైతం గుర్తించారు.
ఇక, డయేరియా (నీళ్ల విరోచనాలు), డీ హైడ్రేషన్ (శరీరం నీటిని కోల్పోవడం) వంటి లక్షణాలతో ఏటా ఎందరో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధులు పెద్దలను సైతం వదలడం లేదు. వర్షాకాలంలో మారుమూల పల్లెల్లో, ఏజెన్సీ గ్రామాల్లో, నగరాల్లోని మురికావాడల్లో ఈ అనారోగ్య సమస్యలు తలెత్తడం ఆనవాయితీగా మారింది. ‘అనుబంధ మిశ్రమం’ అందించడం ద్వారా డయేరియా, డీ హైడ్రేషన్‌లను అదుపు చేస్తున్నారు. అనుబంధ మిశ్రమంలో జింకుతో పాటు మరికొన్ని సూక్ష్మ పోషకాలను కలిపి ఇవ్వడం ద్వారా డయేరియా, డీ హైడ్రేషన్‌ను త్వరితగతిన సులువుగా అదుపు చేయడం సాధ్యమైందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. శరీరానికి జింకు చాలా అవసరం. దీన్ని 300 రకాలకు పైగా శరీరంలోని ఎంజైములు తమ చర్యల నిర్వహణకు వినియోగించుకుంటాయి. శరీర రక్షణ వ్యవస్థను బలపరచడానికి జింకు అత్యంత అవసరం. డిఎన్‌ఎ సమన్వరుూకరణలో, గాయాలు మాన్పడంలో.. ఇలా ఎన్నింటికో ఇది అవసరం. 60- 70 కిలోల బరువుండే శరీరానికి రోజుకు 2-3 గ్రాముల జింకు లభించినా చాలు. ఇది కనీస స్థాయిలో లేకుంటే శరీరం ఎదుగుదల కుంటుపడుతుంది. డయేరియా వంటి రోగాలే కాదు, కంటి చూపునకూ నష్టం కలుగుతుంది. చర్మం తన విధులను నెరవేర్చలేదు. ఆకలి తగ్గుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, లోహాలు, ఇతర సూక్ష్మ పోషకాలను మాత్రల ద్వారా కూడా పొందవచ్చు. అయితే- పేదరికం, అవిద్య వంటి సమస్యలున్న భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ పద్ధతిలో పోషకాహార లోపాలను పూడ్చుకోవడం సాధ్యం కాదు. మందులు, అనుబంధ మిశ్రమాల ద్వారా పోషకాలను శరీరానికి అందించడం అసహజ మార్గం కూడా. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ మార్గం చేపట్టాలి.
శరీరానికి అవసరమైన పోషకాలను రోజూ తినే వరి అన్నం ద్వారా అందిస్తే మేలని మన వ్యవసాయ శాస్తవ్రేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని వరి పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్రబాబు దేశవ్యాప్త పరిశోధనకు నాయకత్వం వహించారు. వీరంతా పుష్కరకాలం పాటు శ్రమించి తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. దేశం నలుమూలల నుంచి వేలాది రకాల వరి వంగడాలను సేకరించారు. జింకు, ఐరన్ అధికంగా ఉన్నాయని నిర్థారించిన 168 వరి రకాలను ఎంపిక చేశారు. వాటిలో లభించే సూక్ష్మ పోషకాల స్థాయిని సమగ్రంగా విశే్లషించారు. పోషకాలు అధికంగా ఉన్న వరి రకాన్ని, విరివిగా వాడే మరో రకం వరి వంగడంతో సంకరపరిచారు. దీనికి ‘డిఆర్‌ఆర్-45’ అని నామకరణం చేశారు.
అధిక స్థాయిలో జింకు లభించే ఈ కొత్తరకం వరి వంగడం అన్ని విధాలుగా మేలైనది శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ ధాన్యాన్ని మిల్లులో తెల్లగా పాలిష్ చేసినా అందులో పోషకాలు నిలిచే ఉంటాయి. ఇది వ్యాపారులకు, వినియోగదారులకు లాభదాయకం కావడం విశేషం. సంప్రదాయ వరి రకాల్లో 75 శాతం వరకూ పిండి పదార్థం ఉంటుంది. డిఆర్‌ఆర్-45 రకంలో పిండి పదార్థం 51 శాతానికి మించదు. దీన్ని మధుమేహ రోగులు కూడా నిర్భయంగా తినవచ్చు. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. కనుక వీటిని తినేవారికి తొందరగా ఆకలి వేయదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఈ కొత్త వరి వంగడం ఆకలిని తీర్చడమే కాదు, శరీరానికి తగినంతగా పోషకాలు అందజేస్తుంది. సహజ పోషకాలను విరివిగా అందించే ఈ వరి బియ్యం వాడకాన్ని పెంచేలా తగినంతగా ప్రచారం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం కూడా తన వంతు ప్రయత్నం చేస్తే పోషకాహార లోపాన్ని కొంతవరకైనా నివారించే అవకాశం ఉంది.

-వి.వరదరాజు