మెయన్ ఫీచర్

కొమురం భీం ఆశయాలకు తూట్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నటిదాకా అటవీ జిల్లాగా, ఆదివాసుల జిల్లాగా అక్షరక్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదటి జిల్లాగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ‘ఆదివాసీ అస్తిత్వాన్ని’ కోల్పోతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి. జలపాతాలకు, ప్రకృతి సోయగాలకు, అటవీ, జల సంపదకు,పత్తితోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తులకు ముఖ్యంగా మదనపల్లి తర్వాత ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండలాల్లో టమాటోలు పేరెన్నికగన్నాయి. దక్షిణాన గోదావరి ఒడ్డున మంచిర్యాల నుంచి ఉత్తరాన బల్లార్ష సరిహద్దులోని సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు భూగర్భ, ఉపరితల బొగ్గు గనులతో, జిన్నింగ్ మిల్లులతో, ఆసియాలోనే గర్వించతగ్గ కాగితపుమిల్లుతో, అంతర్గామి సర్‌సిల్క్ పరిశ్రమతో, సిమెంట్ కర్మాగారాలతో విరాజిల్లింది.
నాటి నైజాం వీటన్నింటినీ ప్రభుత్వ రంగంలో ఏర్పాటుచేసి వేలాది మందికి ఉద్యోగ భద్రతను కల్పించాడు. గిరిజనేతరులతోపాటు గిరిజనులు, ఆదివాసులు ఉపాధిని పొందారు. ఇలా అలరారిన ఆదిలాబాద్ జిల్లా ముఖ చిత్రం ప్రపంచీకరణ, అభివృద్ధి అనే నినాదాలతో అతలాకుతలం అవుతున్నది. గోదావరి నది ఒడ్డున సోనే గ్రామం నుంచి మొదలయ్యే 44వ జాతీయ రహదారి గుండా దాదాపు జైనథ్ మండలం దాకా ప్రయాణం చేస్తే ప్రకృతి ఒడిలో ఊయల ఊగిన విధంగా ఉండేది. రహదారి విస్తరణతో మహబూబియా ఘాట్ మాయమవగా, కుర్పి లోయ అందాలు కనుమరుగయ్యాయి. అందాలొలికించే సీతాగోండి లాంటి గ్రామాలు తూర్పు పడమరగా చీలిపోయాయి. సరస్వతి పాదాల చెంత మొదలైన రాష్ట్ర రహదారి నిర్మల్ గుండా కడెం, ఖానాపూర్ అడవి గుండా దండెపల్లి నుంచి లక్సెట్టిపేట వరకు పక్షుల కేలరావాలతో, జంతువుల అరుపులతో, వింజామరలు వీచే వెదురు కుదురులతో అలరిస్తాయి. ఆదిలాబాద్ నుంచి గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా ప్రయాణిస్తే అడవితల్లి గుండెను తాకినట్లుగా వుంటుంది.
ఇది పడమటి జిల్లా ముఖచిత్రం కాగా, తూర్పు భాగమంతా బొగ్గు గనులతో, పరిశ్రమలతో, అడవులతో నిండుకుండలా వుంటుంది. అభివృద్ధి పేరున మొదలైన ధ్వంసరచన వీటన్నింటినీ కబళిస్తోంది. ఎసిసి మూగబోయింది. కాగజ్‌నగర్ ముడత పడింది. సర్‌సిల్క్ దారాలు తెగిపోయాయి. దాదాపుగా 10వేల మంది కార్మికులకు, వేలాది మందికి ఉపాధిని కల్గించిన పారిశ్రామిక వాడలన్నీ పాలకుల ప్రజావ్యతిరేక వైఖరితో నష్టాలతో మూతపడుతున్నాయి.
ఇప్పుడంతా పట్టణీకరణ మంత్రమే! ఇందులో భాగంగానే తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు. ప్రజలవద్దకు పాలన అనే ముసుగులో ప్రజల్ని విడదీసి పాలించు అనే వలస నీతి జతకట్టింది. ప్రజల చెంతకు చేరిన ఈ విధమైన పాలనలో వారి వౌలిక సౌకర్యాలు, అవసరాలు ఎంతమేరకు తీరుతాయో భవిష్యత్‌లో తేలుతుంది. నిజానికి జిల్లా కేంద్రం పూర్తిగా పశ్చిమాన వుండడంతో తూర్పు ప్రాంతం వారికి దూరభారముండేది. నైజాం కాలంలో జిల్లా మధ్యన వున్న ఆసిఫాబాద్‌లో జిల్లా కేంద్రం వుండేది. తర్వాత వచ్చిన అధికారులు- పాలకుల సహకారంతో హైవే రవాణా సౌకర్యం వుంటుందని ఆదిలాబాద్‌కు మార్చారు. ఈ నేపథ్యంలోనే తూర్పు ప్రాంతంలో అనుకూలంగా వున్న మంచిర్యాలను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ వచ్చింది. ఇలా జరిగితే ప్రజలు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కొంతమేరకు నెరవేరేనేమో! అదనంగా మరో రెండు జిల్లాలు తెరపైకి రావడంతో రాజకీయంగా ఉపాధి కోరుకునే వారికి, జిల్లాస్థాయి పదవులు పొందేవారికి, గిరిజనేతర ప్రజలకు సంతోషంగానే వున్నా, జిల్లా మూలవాసులైన గోండులు, కొలాంలు, ప్రధానులు, తోటీలు, నాయక్ పోడులు, తక్కువ సంఖ్యలో వున్న కోయలు తమ ఉనికికి ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఇలా జిల్లా నాలుగుముక్కలుగా విడిపోవడంతో ఇప్పటికే బలంగావున్న బంజారాలు మరింత బలాన్ని పుంజుకునే అవకాశం వుంటుందని ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
సహజంగా అటవీ, గిరి, లోతట్టు (లో యల్లో) ప్రాంతాల్లో నివసించే వారందరినీ గిరిజనులుగా సంబోధించడం జరుగుతుంది. అడవుల్లో ఆవాసం (చ్యిళఒఆ తీళజశఒ), విసిరేసిన విధంగా ఉండే ఇళ్ళ సముదాయాలు ( జఒ్య్ఘఆళజూ ద్యఖఒళఒ) , అటవీ ఆధారిత ఆర్థిక పునాది (-జౄజఆజ్పళ/ యూళఒఆ ఉష్యశ్యౄక) , పోడు వ్యవసాయం (డ్ఘఒ్ద ఱఖూశజశ షఖఆజ్ప్ఘఆజ్యశ) , ఫశు సంపద (-్ఘఒఆ్య్ఘ), గిరిజన పంచాయతీ (జఇ్ఘ -్యజషక) , లిపి లేని భాష, వేరువేరు గిరిజన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, మతం, దేవుళ్ళు, మహిళాధిపత్య కుటుంబ విధానం, ప్రజాస్వామ్యపు పెళ్ళి తంతు, సులభంగా అమలయ్యే సాంఘిక, రాజకీయ నిబంధనలు, స్ర్తిస్వేచ్ఛ వెరసి గిరిజనులుగా గుర్తించడానికి, నిర్వచించడానికి ఉండే కొలబద్దలు. ఇందులో దాదాపు అన్ని అంశాలు బంజారాలకు కూడా వర్తించడంతో ఒకప్పుడు నేర ప్రవృత్తి గిరిజనులుగా (్ళజౄజశ్ఘ), తర్వాతి కాలంలో గుర్తింపబడిన గిరిజనులుగా (ళశ్యఆజచిజళజూ), 1976 నుంచి సాధారణ గిరిజనులుగా గుర్తించడం జరిగింది. బలమైన బంజారా రాజకీయ నాయకత్వం, వీరి తెలివితేటలు గిరిజనులపై ఉన్న సౌకర్యాల్ని సింహభాగం అనుభవించేలా చేస్తున్నాయి. నిజానికి వీరు ఇక్కడి మూలవాసులు కారు. ఉత్తర భారతదేశాన్నుంచి రాజకీయ కారణాలచే వలసగా, సంచారకులుగా వచ్చిన తెగవారు. వివిధ రాష్ట్రాలలో వివిధ హోదాలను కల్గిన బంజారాలు, పక్క రాష్ట్రం మహారాష్టల్రో వెనుకబడిన వర్గాలుగా గుర్తించబడడంతో ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చి గిరిజన సౌకర్యాల్ని పొందుతున్నారనేది స్థానిక మూలవాస గిరిజనుల ఆరోపణ.
జిల్లా జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న ఆదివాసీ జనాభాలో అత్యధికులు గోండులే. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే, బంజారాలు మొదటి స్థానానికి చేరినా ఆశ్చర్యం లేదు. ఈవిధంగా వున్న గిరిజన జనాభా 50 శాతానికి పైగా షెడ్యూల్డు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలు 16 విభాగాలుగా విభజించబడి ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు కింద చేర్చబడ్డాయి. సాధారణ గిరిజన హక్కులతోపాటు షెడ్యూల్డు ప్రాంతాల వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలుంటాయి. ఆది నుంచి వీరి హక్కులకు భంగం వాటిల్లుతూనే వుంది. ‘విశాఖ మన్యం’ తిరుగుబాటుకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించినట్లే, ఆసిఫాబాద్ మన్యంప్రాంత ఆదివాసీ గిరిజన హక్కులకై కొమురం భీం నాయకత్వం వహించాడు. ముఖ్యంగా గోండుల తిరుగుబాటుకు చెదిరిన నైజాం- బ్రిటీష్ మానవ వికాస శాస్తవ్రేత్త పుర్రర్ హేమన్ డార్ఫ్‌ను పిలిపించి పరిశోధన చేయించాడు. ఆయన సతీసమేతంగా వచ్చి, మార్లవాయిలో స్థిర నివాసం ఏర్పర్చుకొని ఆదిలాబాద్ గోండుల పరిస్థితోపాటు, వరంగల్, ఖమ్మం కోయ గిరిజనుల, నల్లమల చెంచుల స్థితిగతుల్ని పరిశీలించి సమగ్ర నివేదికను నైజాంకు సమర్పించాడు. నైజాం ఆ నివేదికలోని అంశాలను ఆచరణలోకి తెచ్చాడు. వాటి ఫలితంగానే మార్లవాయిలో తొలి గోండుల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఏర్పాటైంది. గోండి లిపికి శ్రీకారం చుట్టారు. కేశలాపుర్‌లో గిరిజన దర్బార్ ఏర్పాటైంది. స్వాతంత్య్రం తర్వాత కూడా హేమన్ డార్ఫ్ అనేక దఫాలుగా ఆదిలాబాద్‌ను సందర్శించడమేకాక, ఆయన భార్య ఇక్కడే తుది శ్వాస విడిచింది. అందుకే మార్లవాయిలో గోండులే ఆ దంపతుల స్మృతి చిహ్నాల్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉట్నూర్‌లో ఏజెన్సీ కేంద్రాన్ని, ఐటిడిఎ ప్రాజెక్టును ఏర్పాటుచేశారు. కొమురం భీం పేరున (కెబి కాంప్లెక్స్) ఓ పెద్ద విద్యావనరుల కేంద్రం రూపుదిద్దుకుంది. ‘కొమురం భీం’ అనడం ఇష్టం లేని వారు దీనికి ‘కెబి కాంప్లెక్స్’గా పేరుపెట్టడం గమనార్హం! ఇలా ఆదిలాబాద్ అనగానే ఉట్నూర్, దగ్గరలోని ఇంద్రవెల్లి, జలియన్‌వాలాబాగ్ కాల్పుల్ని తలపించే 1981 నాటి మారణకాండ, నాగోబా జాతరలు గుర్తుకువస్తాయి, పిడికిళ్లు బిగించేలా చేస్తాయి. తూర్పున గల చెన్నూర్ నుంచి, పశ్చిమాన గల జైనథ్ దాకా ఆదివాసులకు నిలయంగా వున్న ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా సౌలభ్యం పేరుతో నాలుగు భాగాలుగా విభజించబడింది. భౌగోళికంగా సమంజసంగా కనపడినా ఇది తమ ఐక్యతకు విఘాతాన్ని కల్గిస్తుందనేది ఆదివాసుల గుబులు. దీంతో ఈ ప్రాంతవాసులు కాని బంజారాలు మరింతగా బలోపేతం అయితే, అసలైన ఆదివాసీ గోండుల, కోలాంల, ప్రధానుల, తోటిల, కోయల ఉనికితే ప్రమాదం కావచ్చు!
బ్రిటీషు కాలంలోనే గోదావరి పరీవాహక ప్రాంతంలోని గిరిజన ఆవాసాలతో మధ్య భారత్‌లోని దండకారణ్య ప్రాంత ఆవాసాల్ని కలిపి ఓ గిరిజన రాష్ట్రం (ఆదివాసీ ) ఏర్పాటు చేయాలనే డిమాండ్ వుండేది. ఇది అమలు కాకపోగా, భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఈ ఆవాస ప్రాంతాల్ని ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు పంచారు. శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ అంశాల్ని గుర్తించింది. ఇలా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా గిరిజన ఆవాసాలను ఐక్యం చేసే జిల్లాలు ఏర్పాటు చేస్తే సమంజసంగా వుండేది. కాని, ఈ ఆవాస ప్రాంతాల్ని చెల్లాచెదురుచేస్తూ విడదీయడంతో వీరి ఐక్యత దెబ్బతినే ప్రమాదం వుంది. గతంలో గోండ్వాణ కేంద్రంగా, ఆసిఫాబాద్ కేంద్రంగా గోండులే రాజ్యం ఏలిన ఓ చారిత్రిక వాస్తవం పూర్తిగా కనుమరుగైపోయింది. ఆచరణకు నోచుకోని 1/70, పీసా చట్టాలు, 5వ షెడ్యూల్డు ప్రకారం దక్కాల్సిన హక్కులు గిరిజనులకు దక్కకుండాపోతున్న తరుణంలో- ఈ జిల్లా విభజన మరింత సంక్షోభాన్ని భవిష్యత్తులో కల్గించవచ్చు! ఇవన్నీ అభివృద్ధి నిరోధక ఆలోచనలని కొట్టిపారేసే వారు లేకపోలేదు. నాడు నై జాంకు కొమురం భీం ఇలాగే కనపడినా, పరిష్కారానికై హేమన్‌డార్ఫ్‌ను పిలిపించాడు. నేటి పాలకులకు ఇలాంటి స్పందన వుం టుందా? అనేది- రాబోయే కాలపు ప్రశ్న..!

-జి.లచ్చయ్య 94401 16162