సబ్ ఫీచర్

దురాశకు పోతే నిరాశే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్’ (ఆర్‌ఎఫ్‌ఎస్) పరిమితమైన వనరు కాదు. ఇది ఎంతో అపరిమితమైనది, విస్తృతమైనది. బొగ్గు, తైలం, ఇంధన వాయువు, ఖనిజాలు వంటి సహజ వనరులు వాడుతున్న కొద్దీ క్రమంగా తగ్గిపోతాయి. కానీ, ఈ ‘స్పెక్ట్రమ్’ను సాంకేతికత ద్వారా ఉత్పత్తి చేస్తాము. ఒకే స్పెక్ట్రమ్‌ను కొంత దూరం తరువాత తిరిగి తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రభుత్వం చేత ఉత్పత్తి చేయబడడం లేదు. టెక్నాలజీ కంపెనీల ద్వారా ఉత్పత్తి చేయబడుతోంది. దీని ఉపయోగాన్ని మొబైల్ టెలికం, ఇన్ఫర్మేషన్ సర్వీసులకై ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ‘లైసెన్స్’ పేరిట విక్రయిస్తోంది.
ఒకప్పుడు పాలకులు తమకు ఇష్టం వచ్చిన వారికి స్పెక్ట్రమ్‌ను ఇచ్చేవారు. అయితే, కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా టెలికం కంపెనీలకు విక్రయించడం ప్రారంభించారు. 1జి, 2జి, 3జి స్పెక్ట్రమ్‌ల వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకూ మూడున్నర లక్షల కోట్ల రూపాయల మేరకు ఆదాయం సమకూరింది. ఇలా డబ్బును సేకరించి కూడా, స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకున్నందుకు ‘యూసేజ్ చార్జి’ కింద కంపెనీల ఆదాయంలో ప్రతి సంవత్సరం మూడు శాతం మొత్తాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. ఇది ఎలా ఉందంటే.. మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం. ముందుగా సొమ్మంతా చెల్లించాం. కానీ, ఆ ఇంట్లో నివసించినందుకు ప్రతి సంవత్సరం ఆ ఇంటి ఉపయోగం ద్వారా లభ్యం అవుతున్న ఆదాయంలో మూడు శాతాన్ని ఇంటిని వాడుకున్నందుకు కట్టాలన్నమాట. ఇది ఎంత అన్యాయమో.. ఎంత నీతి బాహ్యమో ఆలోచించాల్సిందే.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4జి స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా ప్రభుత్వం విక్రయించింది. ఈ 4జి టెక్నాలజీ- సమాచారాన్ని (డేటా), దృశ్యం (ఇమేజ్), వాణి (వాయిస్), వ్రాత (టెక్స్ట్) రూపాలను అత్యంత వేగవంతంగా పంపిస్తుంది. 700 ఎంహెచ్‌జడ్ లోని స్పెక్ట్రమ్‌ను విక్రయిస్తే- దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయలు లభిస్తాయని ప్రభుత్వం ఆశించింది. అందుకే కనీస ధరను చాలా ఎక్కువగా నిర్ణయించింది. ఇ-ఆక్షన్ ద్వారా కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. ప్రభుత్వం యొక్క దురాశను నిరాశ పరుస్తూ టెలికం కంపెనీలన్నీ ముందుగానే ఒక అవగాహనకు వచ్చినట్లుగా ప్రవర్తించాయి. అయిదు లక్షల కోట్ల రూపాయలకు బదులుగా కేవలం అరవై అయిదువేల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి దక్కింది. దురాశకు పోతే నిరాశ తప్పదన్న మాట ఇలా రుజువైంది. వేలం పాట ద్వారా జరిగే ఈ విక్రయాన్ని గత పదిహేను సంవత్సరాలుగా నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. వినతులు పంపినా, విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వాల ధోరణిలో మార్పు కానరావడం లేదు. ప్రకృతి గాని, ప్రభుత్వం గాని ఉత్పత్తి చేయని సాధనాన్ని కేవలం అధిక ఆదాయాన్ని పొందాలన్న ఆలోచనతో వేలం ద్వారా అమ్మడం ప్రభుత్వం తన శక్తిని దుర్వినియోగం చేయడమే అవుతుంది.
సౌరశక్తిని వినియోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. విద్యుత్‌ను అమ్ముతు న్నాం కానీ సౌరశక్తిని విక్రయించడం లేదు. అది సూర్యుడు ఇస్తున్న అమితమైన శక్తి. అదే విధంగా స్పెక్ట్రమ్ అనేది కంపెనీలు ఉత్పత్తి చేస్తే- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వినియోగిం చి, మళ్లీ మళ్లీ ఉపయోగిస్తున్నాం. అటువంటి సా ధనాన్ని అమ్మడం ని జంగా దురూహ.
స్పెక్ట్రమ్ అమ్మకం, ఉపయోగాల ద్వారానే గాక ప్రభుత్వం టెలికం కంపెనీలకు చెందిన ఆదాయంలో ఏడు శాతాన్ని తన వాటాగా తీసుకుంటోంది. అంతేగాక, మరో అయిదు శాతాన్ని వివిధ ప్రాంతాలకు, అన్ని వర్గాలకు టెలికం సేవలను అందుబాటులోకి తేవడం కోసమై ‘యూనివర్సల్ సర్వీస్ ఫండ్’ (యుఎస్‌ఎఫ్) పేరుతో కంపెనీల ఆదాయం నుంచి తీసుకుంటోంది. ఇంతవరకూ ఈ ఫండ్‌లో సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేవలం నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే లక్షిత ప్రయోజనం కోసం ఖర్చు చేశారు.
‘డిజిటల్ ఇండియా’ అనే పథకం కింద దేశంలోని సుమారు రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలకు ‘బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ’ ఇవ్వడానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పథకాన్ని 2010లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికి కావలసిన నిధులను చాలావరకూ ‘యూనివర్సల్ సర్వీస్ ఫండ్’ నుంచి కేటాయిస్తున్నారు. కానీ, ఇంతవరకూ కనీసం పదివేల గ్రామ పంచాయతీలకు కూడా ఈ ‘కనెక్టివిటీ’ లభించలేదు. దీనికి ప్రధాన కారణం ‘్భరత సంచార్ నిగమ్’ (బిఎస్‌ఎన్‌ఎల్) యొక్క భూగర్భ ‘ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్’ (ఒఎఫ్‌సి)లోని ‘ఫైబర్’ల జాడ తెలియక పోవడం. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన కేబుల్స్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం మరో కారణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూగర్భ కేబుల్స్‌ను పక్కన పెట్టి, ‘ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ టవర్స్’ నుంచి వేలాడదీసే పద్దతిని చేపట్టింది. ఇది భారతదేశానికి ఆదర్శప్రాయం అయింది. ‘టెరాసాఫ్ట్’ అనే కంపెనీ ఈ పనిని ఆంధ్రప్రదేశ్ అంతటా చేపట్టి విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అన్ని సేవలను గ్రామాలలో అందించేందుకు సంబంధిత ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తోంది. ఈ విధానాన్ని అమలుచేస్తే గనుక దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు కేవలం పదివేల కోట్ల వ్యయంతోనే ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన చొరవను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి