సబ్ ఫీచర్

బాల్యాన్ని చిదిమేస్తున్న వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యుమేనియా, డయేరియా వంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్న బాలబాలికల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉంది. పదిహేను దేశాల్లో నిర్వహించిన ఓ తాజా సర్వే ప్రకారం ఈ అంశంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ రెండు వ్యాధుల బారిన పడి మరణించిన చిన్నారుల సంఖ్య 2015లో 2,97,114 కాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరణించిన పిల్లల సంఖ్య 2,96,279. చిన్నారుల మరణాల సంఖ్యాపరంగా భారత్ కొనే్నళ్లుగా అదే స్థానంలో ఉంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మేల్కొని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే బాలబాలికల భవిత ఆందోళనకరంగానే ఉంటుంది. ‘ద ఇంటర్నేషనల్ వాక్సిన్ యాక్సిస్ సెంటర్ (ఐవిఎసి) ప్రతి ఏడాది న్యూమేనియా (శ్వాస సంబంధ సమస్యలు), డయేరియా తీరుతెన్నులపై ఓ నివేదికను ప్రచురిస్తూంటుంది. జాన్స్ హోప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఈ నివేదిక వెలువడుతుంటుంది. ఈ నివేదిక ప్రకారం రెండేళ్లుగా ఏ స్థానంలో ఉందో ఇప్పుడూ భారత్ అదే స్థానంలో, అగ్రపీఠాన ఉంది.
ఈ వ్యాధులను నియంత్రించడానికి ఈ పదిహేను దేశాల్లో సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో భారత్ సహా పనె్నండు దేశాలు అమలు చేస్తున్నాయని నివేదికలో పేర్కొనడం గుడ్డిలోమెల్ల. మిగతా రోగాల కారణంగా మరణిస్తున్న చిన్నారుల సంఖ్యను నియంత్రించగలిగినప్పటికీ న్యూమేనియా, డయేరియా వ్యాధుల వల్ల మరణిస్తున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఈ రెండు వ్యాధుల వల్లే మరణిస్తున్నారని 2015లో లెక్కలు చెబుతున్నాయి. న్యూమేనియా నిరోధానికి సంబంధించిన వాక్సిన్ అందుబాటులోకి వచ్చి పదిహేనేళ్ల తరువాత కూడా భారత్, ఇండోనేషియా, చాద్, చైనా, సొమాలియాల్లో ఇంకా వాటిని వాడటం లేదని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఏడాది పాక్షికంగా ఈ వ్యాక్సిన్‌ను వాడనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 2017లో ఈ వాక్సిన్‌ను ఉపయోగించనున్నారు. న్యూమేనికల్ కాంజుగేట్ వాక్సిన్ (పిసివి) వంటి రొటావైరస్ వాక్సిన్‌లతో ప్రాణాలను కాపాడవచ్చని, వీటితో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపినడ్డా ఇటీవల ప్రకటించారు. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడేలా, మెరుగుపడేలా రొటావైరస్ వాక్సినేషన్ పనిచేస్తుందని ఆయన చెప్పారు. న్యూమేనియా, డయేరియా, పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల మందగిస్తోందని ఆయన చెప్పారు.
గతేడాది మనదేశంలో నాలుగు రాష్ట్రాల్లో రొటావైరస్ వాక్సినేషన్ కార్యక్రమం అమలు చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం, తల్లిపాలు అందేలా చూడటం, సత్వర చికిత్స అందించే సౌకర్యాలు కల్పించడం, యాంట బయోటిక్ ఔషధాలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలతో చిన్నారుల మరణాల సంఖ్యను బాగా తగ్గించవచ్చునని ఆ నివేదిక సూచించింది. ఇలాంటి చర్యలను చురుకుగా అమలు చేయడం వల్ల అద్భుత ఫలితాలు సాధించవచ్చని, చిన్నారులను చిరంజీవులుగా మార్చవచ్చని పేర్కొంది. నిజానికి గతేడాది వివిధ కారణాల వల్ల 5.9 మిలియన్ల మంది చిన్నారులు ఐదేళ్లు నిండకుండానే కన్నుమూశారు. వీరిలో 16శాతం మందిని న్యూమేనియా కబళించిందంటే మనదేశంలో పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం మేలుకుంటేనే మన పిల్లలు హాయిగా మనగలుగుతారు.

-కృష్ణతేజ