సబ్ ఫీచర్

పరిమితులను పాటిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక ప్రగతికి, సామాజిక శాంతికి, సమగ్రతకు ముప్పు తెచ్చే రెండు సమస్యలను మేధావి వర్గం గాని, నేతలు గాని, రాజకీయ పార్టీలు గాని విస్మరించడం విచారకరం. భారత్‌లో జనాభా మితిమీరి పెరిగిపోతోంది, ఆ పెరుగుదల ‘కొన్ని వర్గాల’లో అమితంగా ఉంటోంది. జనాభా, ఉపాధి విషయాల్లో చైనాతో మనం పోల్చుకుంటే సిగ్గుపడక తప్పదు. 1951లో మన దేశ జనాభా 37 కోట్లకు తక్కువగా వుండేది. ఆ తర్వాత ఏటా జనాభా పెరుగుదల 2.8 శాతంగా వుండేది. మన ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన 1991 నాటికి జనాభా 84.64 కోట్లకు చేరింది. 1991 నుంచి 2016 వరకూ 25 ఏళ్లలో జనాభా 84.64 కోట్ల నుండి 130 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో సగటున ఏటా కోటి ఎనభై లక్షల వరకూ జనాభా పెరుగుతూ వస్తోంది. వృద్ధి రేటు 2.8 శాతం నుండి సగానికి అంటే 1.4 శాతానికి తగ్గినప్పటికీ, జనాభా పెరుగుదల తగ్గడం లేదు. ఈ పెరుగుదల అన్ని వర్గాలలో ఒకేలా లేదు. నిమ్న, బడుగు వర్గాల్లో 15 శాతం నుంచి 22 శాతానికి, ఎస్‌టిల్లో 7.5 శాతం నుండి 12 శాతానికి, ముస్లింలలో 9.8 శాతం నుండి 15 శాతానికి జనాభా పెరిగింది. ఈ మూడు వర్గాల్లో జనాభా 49 శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం చొరబాటుదారులను కలుపుకుంటే, మన దేశంలో ఇస్లాం మతస్థుల జనాభా శాతం 20 పైనే వుంటుందని ఓ అంచనా. ఎస్సీ, ఎస్టీ, ముస్లింల ఓట్ల కోసమే రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. 2004లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ప్రస్తుతం 3.80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
ఉపాధి కల్పన, జనాభా పెరుగుదలకు ఉన్న సంబంధాల్ని విశే్లషిస్తే మరికొన్ని వాస్తవాలు తెలుస్తాయి. కేంద్రంలో ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ హ యాంలో అత్యధికమైన వృద్ధిరేటు, అందుకు అనుగుణంగా ఒక ఏడాదిలో కోటి మందికి ఉపాధి కల్పన జరిగింది. ఉపాధి కల్పన తీరు బాగున్నప్పటికీ , మున్ముందు ఏటా నిరుద్యోగులయ్యే 80 లక్షల మందిని దేశంలో పుట్టిస్తున్నాం. చాలాకాలంగా ఆర్థిక ప్రగతి 7 శాతంగానే ఉంటోంది. ఉపాధి కల్పన గణనీయంగా తగ్గిపోతోంది. ఉద్యోగ ప్రకటనలు వెలువడగానే అనూహ్య సంఖ్యలో అభ్యర్థులు ఎగబడుతున్నారు. విద్యాధికులు సైతం కింది స్థాయి ఉద్యోగాలకు అర్జీలు పెట్టుకుంటున్నారు. యుపి సచివాలయంలో 368 ప్యూన్ పోస్టులకు 23 లక్షలమంది దరఖాస్తు చేశారు. వీరిలో 255మంది ఇంజనీరింగ్‌లో, సైన్సులో, కామర్స్‌లో డాక్టరేట్‌లు కలిగినవారు, 1,50,000 మంది పట్ట్భద్రులు, 25,000 మంది మాస్టర్స్ డిగ్రీ కలిగినవారు ఉన్నారు. తెలుగురాష్ట్రాలలో పరిస్థితి కూడా ఇలాగే వుంది. తెలంగాణలో 9,281 కానిస్టేబుల్స్, ఫైర్‌మెన్ పోస్టులకు 5,36,037 మంది దరఖాస్తు చేయగా అందులో 8 మంది పిహెచ్‌డిలు, 20 మంది ఎంఫిల్ చేసినవారు , 30,446 మంది పీజీ చేసిన వారు ఉన్నారు. ఈ గణాంకాలను చూస్తుంటే ఎంతటి భయంకరమైన నిరుద్యోగం మన దేశంలో ఉందో గమనించవచ్చు. యువతలో అశాంతి పెరగకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇలా ఎంతకాలం సాగుతుంది? ఇంజనీరింగ్ చదివిన వారిలో అధిక సంఖ్యలో కంప్యూటర్, ఐటి శాఖలను ఎగబడుతున్నారు. దేశంలో సాలీనా రూ.6,50,000 కోట్ల ఐటి వ్యాపారం ఉంటోంది. ఈ స్థాయి వ్యాపారానికి 30 లక్షల మందికి ఉపాధి దొరికింది. రోబోలు, ఆర్ట్ఫిపల్ ఇంటెలిజెన్స్ గణనీయంగా ఉపయోగంలోకి వస్తూ వుండడం మూలాన- మరో 6,50,000 కోట్ల రూపాయల ఐటి వ్యాపారానికి కేవలం 15 లక్షలమందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఐటి రంగంలో ఉపాధి తగ్గుముఖం పడుతోంది. 2015తో పోలిస్తే, 2016లో 42 శాతానికి మాత్రమే ఐటి ఉద్యోగాలు పరిమితమయ్యాయి.
దేశంలో 47 కోట్లమంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. 1951లో దేశం స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 55.41 శాతం ఉండేది. ప్రస్తుతం అది 18 శాతం మాత్రమే. కానీ, ఆ రంగంలో పనిచేసేవారు ఇంకా 48 శాతం మంది వున్నారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారి సంఖ్య యాంత్రీకరణ, పట్టణీకరణ వల్ల తగ్గిపోతోంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో 82 శాతంగా వున్న ఇతర రంగాలలో ఏటా సగటున 2 శాతం ఉపాధి పెరుగుతోంది. అంటే- కోటికి తక్కువగా మాత్రమే ఉపాధి పెరుగుతోంది. జానాభా మాత్రం ఏటా కోటి ఎనభై లక్షలుగా పెరుగుతోంది. నిరుద్యోగుల అదే స్థాయిలో పెరుగుతోంది. వీరిలో విద్యావంతుల సంఖ్య అధికం. దీంతో సామాజిక అలజడులు, నేరాలు, అక్రమాలు పెరుగుతాయి. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పెంచుతాయి.
1990 వరకూ చైనాలో తలసరి ఆదాయం భారత్‌లో కన్నా తక్కువగా వుండేది. ఆ ఏడాది మన తలసరి ఆదాయం 376 డాలర్లు. చైనీయుల తలసరి ఆదాయం 314 డాలర్లు. 2016లో మన తలసరి ఆదాయం 1538 డాలర్లు. చైనాలో 7246 డాలర్లు. ప్రస్తుతం మన దేశీయ స్థూల ఉత్పత్తి 2.1 మిలియన్ డాలర్లు (135 లక్షల కోట్ల రూపాయలు), చైనా స్థూల ఉత్పత్తి 11 ట్రిలియన్ డాలర్లు (675 లక్షల కోట్ల రూపాయలు). చైనాలో అనూహ్య ప్రగతికి కారణం జనాభా నియంత్రణ. 1953లో చైనా జనాభా 58.3 కోట్లు. సంతాన నియంత్రణ విధానాన్ని కచ్చితంగా అమలు చేశాక 1982లో ఆ దేశ జనాభా 111 కోట్లు. ప్రస్తుతం 134 కోట్లు. గత 28ఏళ్లలో అక్కడ జనాభా పెరుగుదల శాతం 1.16 శాతం. చైనా స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 12 శాతం. పారిశ్రామిక ఉత్పత్తి 55 శాతం. అందుకే నిరుద్యోగ సమస్య అంతగా లేదు.
మన దేశం అభివృద్ధిని సాధించాలంటే, చైనాతో సమ ఉజ్జీ కావాలంటే జనాభా నియంత్రణ అత్యవసరం. చైనాలో నియంతృత్వ పాలన ఉంది కాబట్టి ఆ దేశ ప్రభుత్వం రెండో బిడ్డ కన్న దంపతులను ప్రభుత్వం శిక్షించగలిగింది. మన దేశంలో జనాభా నియంత్రణ అసాధ్యం. ఏటా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూ వుంటాయి. అన్ని పార్టీలూ పేదల సంక్షేమం గురించి మాట్లాడుతాయే తప్ప- ఆర్థిక రంగ సంస్కరణలు, ఉపాధి కల్పన గురించి పట్టించుకోవు. జనాభా స్థిరీకరణకై మనం చేయగలిగింది, చేయవలసింది- సంక్షేమ పథకాలను ఒక్క బిడ్డ వున్న కుటుంబాలకు పరిమితం చేయడం. రెండో సంతానం ఉంటే ఎలాంటి పథకాలు ఇవ్వరాదు. రిజర్వేషన్ల ప్రయోజనం ఒక కుటుంబంలో ఒక్క తరానికి, ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేయాలి. అందరికీ అవకాశాలు దక్కాలంటే ఇలాంటి నిబంధనలు అవసరం. కుటుంబ నియంత్రణ ద్వారా మాత్రమే పేదరికాన్ని నివారించగలం. ‘సంతానం దేవుడిచ్చిన ప్రసాదం’ అనుకునేవారు ఆ దైవాన్ని ప్రార్థించి మాత్రమే అభివృద్ధి పొందాలి. ప్రకృతిలోనైనా, ప్రభుత్వాల వద్దనైనా వనరులు పరిమితంగానే ఉంటాయి. ఆ పరిమితులకు, పరిస్థితులకు లోబడి అభివృద్ధి సాధించాలంటే కొన్ని విషయాల్లో కఠిన నిబంధనలు అనివార్యం.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి