సబ్ ఫీచర్

తరగతి గధి మానసిక ప్రయోగశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటలైజేషన్ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల బోధన సమర్థవంతంగా నడిచే అవకాశం ఉంది. కానీ, ఉపాధ్యాయుడు చేసే పనిని యంత్రమే చేస్తుందనటం సరైంది కాదు. ప్రభుత్వం సిలబస్‌ను నిర్ణయిస్తుంది. ఆ సిలబస్‌ను విద్యార్థులకు అందచేయటంలో ఉపాధ్యాయుడిది కీలక పాత్ర.
ఒక పాఠ్యాంశం తీసుకుని విద్యార్థుల అవగాహనా శక్తిని గుర్తుంచుకొని పాఠంలో ఉన్న కఠినమైన అంశాలను ఉపాధ్యాయుడు మొదట నిర్ధారణ చేస్తాడు. పాఠం లోని కఠినమైన విషయాలను ఏరుకోవటం జరుగుతుంది. పిల్లలకు అవగాహన కల్గించేందుకు ఆ కఠినమైన విషయాలను ఉపాధ్యాయుడు ఎన్నుకుంటాడు. అనగా- బియ్యంలో ఉన్న రాళ్లను వేరుచేయాలి. తినేవాడి జీర్ణకోశానికి తగిన విధంగా ఆహారాన్ని మార్చటం జరగాలి. పాఠంలో కూడా హంస మాదిరి గులకరాళ్లను వేరుచేయటం చేయాలి. పాఠాన్ని అవగాహన యోగ్యంగా చేయాలి. ఇందుకోసం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలి, వారిలో కొన్ని ప్రశ్నలు రేకెత్తించాలి. దాంతో పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకొస్తుంది. ఆ జ్ఞానాన్ని పిల్లలు స్వీకరించే స్థాయికి తీసుకురావటం జరుగుతుంది. ఉపాధ్యాయుడు విషయాన్ని వెంటవెంటనే చెప్పడు. ఆ పాఠంలోని విషయాలను ఏ క్రమంలో చెప్పాలో అతను నిర్ధారించుకుంటాడు.
పిల్లల నోట్లో ‘వండిన అన్నాన్ని’ కుక్కరు. బిడ్డ నోట్లోకి ఏ ప్రక్రియలో అన్నం పెట్టాలో తల్లి ఆలోచిస్తుంది. బిడ్డకు పుష్ఠికరమైన ఆహారం అందించాలని అరటిపండునో లేదా మెత్తగా ఉండే బలమైన ఆహారాన్ని అందులో తల్లి కలుపుతుంది. ఆహారం నాణ్యతను మార్చుతుంది. అలాగే ఉపాధ్యాయుడు తనలో దాగిఉన్న ప్రజ్ఞలో రుచికరంగా ఉండే విధంగా క్వాలిటీలో మార్పు తీసుకువస్తాడు. దీనే్న ‘స్టాండర్డైజేషన్’ అంటారు. ఇంకా పిల్లలకు చందమామను చూపించినట్లు ఉపాధ్యాయుడు ఆటపాటలతో వారికి భవిష్యత్తును చూపించి మెదడులో జ్ఞానముద్రలు వేసేందుకు కృషిచేస్తాడు.
పిల్లల ఆలోచనా విధానాన్ని ఉపాధ్యాయులు పుష్ఠికరం చేస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్ని స్వయం సమృద్ధిగా తయారుచేస్తాడు. ఈ పనిని ఏ సాంకేతిక పరిజ్ఞానపు యంత్రమూ చేయలేదు. ఉపాధ్యాయులు తమకుతాము విద్యార్థుల మానసిక స్థాయికి కుదించుకుంటారు. ఆ పిల్లల్లో ఒకరుగా టీచర్ ఆ నీళ్లలో ఈదుతారు. అంటే కలిసి ఆలోచిస్తాడు. ఈ మాదిరిగా విషయ పరిజ్ఞానం, సామర్థ్యం కలిస్తేనే పిల్లలు జ్ఞాన సంపన్నులవుతారు. యంత్రమూ ఫలితం చూపిస్తుంది. కానీ, ఆ ఫలితం ఎలా వచ్చిందో యంత్రం చూపించలేదు. ప్రాజెక్టు చూపించగలుగుతుంది. కానీ ప్రాసెస్‌ను చూపించలేదు. ప్రాసెస్ లేకుండా ప్రాజెక్టు చూపిస్తే గాలిలో మెరిసే రవ్వగానే ఉంటుంది. డిజిటలైజేషన్‌ను సహాయకారిగా ఉపయోగించాలే తప్ప, దాన్ని ప్రత్యామ్నాయం చేయకూడదు. తరగతి గది అంటే మానసిక ప్రయోగశాల. మెదడులో జరిగే జ్ఞాన రసాయనిక చర్యలకు తరగతి గది ఒక ప్రయోగశాల.

- చుక్కా రామయ్య